ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అలసత్వానికి మరియు నిధుల దుర్వినియోగానికి పరాకాష్టగా కొన్ని పథకాల పేర్లు వెంటనే గుర్తొస్తాయి అందులో ప్రధానంగా షెడ్యూల్ కాస్ట్ మరియు వెనక బడిన తరగతుల కులాలకు సంబందించిన పథకాలు ఎప్పుడు ముందంజలో ఉంటాయి నిధుల దారిమళ్లింపు పథకాల అమలులో నిర్లక్ష్యం ఇవన్నీ షెడ్యూల్ కులాలు మరియు వెనక బడిన తరగతులకు సంబందించిన పథకాల విషయం లో ప్రత్యేకంగా వార్తల్లో నిలుస్తుంటాయి తాజాగా ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి 23 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి ఎస్సీ కులాలకు సంబంధించి చేయూతను అందించే కార్యక్రమం లో భాగంగా ఈ ఆటో లను కొనుగోలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయయించింది.
దీని కథ ఏంటి ?
రాష్ట్ర వ్యాప్తం గా గ్రామ పంచాయితీల్లో చెత్తను సేకరించి సేంద్రీయ ఎరువులను తయారుచేయాలనే లక్ష్యం తో మరియు ఎస్సీ యువత కోసం ఈ ఆటోలను కొనుగోలు చేసి వాటిలో చెత్తను తరలించేందుకు గ్రామాల్లో వినియోగించాలని నిర్ణయించారు మొత్తం 7500 ఈ ఆటోల కొనుగోలుకు జాతీయ సఫాయి కర్మచారి ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా నిధులు వాడుకోవాలని నిర్ణయించారు రాష్ట్రవ్యాప్తంగా 13 ఈ ఆటో సర్వీసెస్ కేంద్రాలను ప్రారంభించాలని భవిష్యత్ లో 42 సర్వీస్ కేంద్రాలుగా విస్తరించాలని గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది 2019 ఎన్నికల లో ప్రభుత్వం మారటం తో పూర్తిగా పాత కధలా మారిపోయింది.
ఈ ఆటోలను కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో టెండర్లను పిలిచింది ఈ ఆటోలను సరఫరా చేసేందుకు పుణెకు చెందిన కెనిటిక్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్ సంస్థ ధ్రువీకరణతో తాడేపల్లికి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్ ఒప్పందం చేసుకుంది ఒక్కో ఆటో 2 .60 లక్షల చొప్పున మొత్తం 7500 ఆటోలు సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంది అడ్వాన్సుగా ౩౩.11 కోట్లను చెల్లించింది వైసీపీ ప్రభుత్వం వచ్చాక 12 .93 కోట్ల విలువైన ఈ ఆటోలను వెంకటేశ్వర ఏజెన్సీ సరఫరా చేసింది మిగిలిన ఈ ఆటోలను సరఫరా చేయలేదు దీంతో వెంకటేశ్వర ఏజెన్సీ 20 .17 కోట్లు చెల్లించాల్సి ఉంది వడ్డీ ౩.49 కోట్లు వెరసి మొత్తం 23 .56 కోట్లు చెల్లించాల్సి ఉంది డీలర్ చెల్లించకుండా తాత్సారం చేస్తుండటంతో అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప శాఖపరమైన చర్యలేమి తీసుకోవటంలేదు
నకిలీ బ్యాంకు గ్యారంటీ
ఎస్సీ కార్పొరేషన్ తో ఒప్పందం నేపథ్యంలో కైనెటిక్ ఎనర్జీ సంస్థ నుండి 7 .72 కోట్లకు గాను ఐసీఐసీఐ బ్యాంకు జారీ చేసిన ఈ ఎం డీ ని షూరిటీ గా ఆ సంస్థ పెట్టడం జరిగింది ఐతే అది నకిలీదిగా తర్వాత తేలింది ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొనటం విశేషం . .గతంలో అమ్మఒడి నిధులకోసం ఎస్సీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించారనే వాదనలు బలంగా వినిపించాయి ఏ పథకాల అమలులో ఇబ్బందులున్నా వెనకబడిన మరియు దళిత కార్పొరేషన్ నిధులే దారి మళ్లిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ పాత్ర – దళిత కులాలు
దళిత కులాల అభ్యున్నతే ద్యేయంగా మా ప్రభుత్వం నడుస్తుందనే మాటలు ఎప్పుడు వింటుంటాం వాస్తవానికి మాత్రం అందుకు విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు కనిపిస్తున్నాయి దళిత కులాల అభివృద్ధి కోసం కార్పొరేషన్ లు పెట్టడం సబబే ఐనా వాటికీ పూర్తీ ఆర్థిక స్వతంత్రత ఇవ్వకుండా నిధుల కేటాయింపులో అలసత్వం ప్రదర్శించటం కేటాయించిన నిధులను నేరుగా ఖర్చు చేయకుండా దారి మళ్లించటం వంటి పనుల వలన ప్రభుత్వం అప్రదిష్ట పాలవుతుంది స్కిల్ డెవలప్మెంట్ పోగ్రామ్స్ మరియు దళిత ఎంట్రప్రెన్యూవల్స్ కు లోన్స్ వంటి స్కీమ్స్ ఎన్ని ఉన్నా వాస్తవానికి దళిత ప్రజానికానికి చివరికి ఎంత లబ్ది చేకూరుతుంది అనేది ప్రశార్ధకంగా మిగిపోతుంది గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున దళిత కులాలు బీసీలు వైసీపీ ప్రభుత్వం వెంట నడిచారు అభివృద్ధి హామీలను నమ్మారు కాబట్టి వంచనకు తావులేకుండా ప్రభుత్వం మెసులుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు బాబా సాహెబ్ అంబెడ్కర్ కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేయాలని దళిత ప్రజానీకం కోరుకుంటున్నారు.