ఆయన ఒకసారి మీసం మెలేస్తే.. దెబ్బకు ఎంపీ అయిపోయాడు. ఒక్కసారి తొడగొడితేనే కియా ఫ్యాక్టరీ వణికిపోయింది. ఎన్నికల అఫిడవిట్ లో మర్డర్, రేప్ కేసులు చూసి జనాలు అదిరిపోయారు. అయినాగాని ఆయన స్టయిలే వేరు.. ఆయన రూటే సెపరేటు. మాస్ .. ఊరమాస్ మన ఎంపీ గోరంట్ల మాధవ్. ఆ విషయం ఆయన నిరూపించేసుకున్నాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆయన వీడియో ఒకటి వైరల్ చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం అది ఫేక్ అంటున్నారు. అయినాగాన వైరల్ వైరలే కదా.. ఎక్కడా తగ్గేదేలే అంటూ అది వాట్సప్ గ్రూపుల్లో తెగ తిరిగేస్తుంది.
అందులో బాస్ మాంచి రొమాంటిక్ మూడ్ లో ఓ మహిళతో మాట్లాడుతున్నట్లు ఉంది. పైన చొక్కా లేదు. ఇదేంట్రా బూ అనుకుంటుండగానే చూడలేని ఘోరం కూడా ఆ వీడియోలో ఉంది. అది రియలో ఫేకో అయితే తేల్చలేకపోతున్నారు. మాధవ్ మాత్రం ఇది టీడీపీ తనపై చేసిన కుట్ర అని.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తాలుకా విజయ్, మరొకరు కలిసి ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నట్లు ఎంపీ చెప్పారు. అసలైతే మరి సార్ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఒకవేళ నిజమైతే ఇది ఢిల్లీలో జరిగిందా.. లేక పాత వీడియోనా అనేది జనం చర్చించుకుంటున్నారు.
సార్ దూకుడు అయితే అందరికీ తెలిసిందే. ఒక టైమ్ లో అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మాట్లాడుతూ మీసం మెలేశారు. ఒక సీఐగా ఉండి అలా చేయడంతో పాపులర్ అయిపోయారు. దీంతో జగన్ ఆయనకు హిందూపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. అదొక సంచలనం అయితే.. ఆయన గెలుపు మరో సంచలనం. ఎంపీ అయ్యాక కియా ఫ్యాక్టరీ వాళ్లను బెదిరించారని మరో ఆరోపణ వచ్చింది. అప్పుడు కూడా ఇలాగే ఎవరో కుట్ర చేశారన్నారు. ఇక ఆయనపై మర్డర్ కేసు, రేప్ కేసు ఉన్నాయని ఆయన అఫిడవిట్ లోనే ఉంది. అవన్నీ ఉన్నా ఆయన పోలీసు జాబ్ లో ఎలా కొనసాగారో.. కొనసాగటానికి ఏ లూప్ హోల్స్ అదే రూల్స్.. ఎలా పనికొచ్చాయో తెలియదు. ఇప్పుడు ఆ కేసులు ఏ స్టేజ్ లో ఉన్నాయో కూడా తెలియదు.
ఇప్పుడు కొత్తగా ఈ వైరల్ వీడియో వచ్చింది. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం.. ఈ విషయంపై గోరంట్ల మాధవ్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారంట. కావాలనే తనను ఇరికించారంటూ మీడియా ముందే మండిపడుతున్నారు. అయితే కొందరు వైసీపీ నేతలు అయితే.. ఇవన్నీ మామూలే.. అవంతి శ్రీనివాస్ మీద రాలేదా.. అంబటి రాంబాబు మీద రాలేదా.. వారందరికీ ఏమయింది.. అందరూ తర్వాత మర్చిపోయారు అంటూ ఓదారుస్తున్నారంట. అయితే వాళ్లందరివి ఆడియోలే.. నాది వీడియో కదా అని ఆయన శివాలెత్తుతున్నారంట.
మరి ఈ వైరల్ వీడియో పరిణామం ఎక్కడ దాకా వెళుతుందో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాధవ్ ను ఓదారుస్తారా.. లేక లైట్ తీసుకోమని చెప్పి.. ఆయన కూడా లైట్ తీసుకుంటారా.. లేక అసలే కష్ట కాలంలో ఉన్న పార్టీకి ఇలాంటి ఎంపీ భారమవుతాడని ఫీలై.. పక్కకు పెట్టేస్తారా? వేచి చూడాలి మరి.