క్షణక్షణం సినిమా గుర్తుందా… అందులో వెంకటేష్ సమాధానాలు విని శ్రీదేవి అంటుంది.. పులి లేదంటావ్.. ఉండొచ్చంటావ్.. అసలేం చెబుతున్నావ్ అని సీరియస్ అవుతుంది. ఇప్పుడు అనంతపురం ఎస్పీ ఫకీరప్పను కూడా శ్రీదేవి ఉంటే ఇలాగే అడిగేది. అవును ఆయన చెప్పింది అలాగే ఉంది. గోరంట్ల మాధవ్ వీడియోపై విచారణ చేశారు.. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది .. చెబుతున్నారంటే.. ఫేక్ అనే చెబుతారని ఫిక్స్ అయ్యారంతా. కాని అసలు ఫోరెన్సిక్ రిపోర్టే లేదని తేలింది. అదేమంటే ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప ల్యాబ్ కు పంపలేమని ఎస్పీ చెప్పారు. సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియో ఒరిజినలో కాదో నిర్ధారించలేమని.. ఎందుకంటే మల్టిబుల్ టైమ్స్ ఫార్వార్డ, ఎడిట్ అయిందని చెప్పుకొచ్చారు.
వారి ఇన్వెస్టిగేషన్ లో ఆ వీడియోను ఐటీడీపీ అనే గ్రూపులో మొదటిసారి ఒక యూకె నెంబర్ ద్వారా పోస్ట్ అయిందని. దీంతో పాటు మరో నలుగురికి కూడా ఆ వ్యక్తి ఫార్వార్డ్ చేశారని చెప్పారు. విషయం ఏంటంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ అంతా అది ఒరిజనలా కాదా అని కాదు.. ఎవరు పోస్టు చేశారో తేల్చాలని చూశారని తెలిసిపోతుంది. గోరంట్ల మాధవ్ అనుచరుడు ఇఛ్చిన కంప్లయింట్ ఆధారంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినట్లు చెప్పారు.
అయితే విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఫకీరప్పగారు చాలా తడబడ్డారు. ఏది అడిగినా ఒరిజినల్ వీడియో దొరికితేనే చెప్పగలమని ఆయన చెప్పుకొచ్చారు. మరి మాధవ్ గారి ఫోన్ చెక్ చేస్తే.. ఆయన వీడియో కాల్ చేశారో లేదో.. ఎవరికి చేశారో తేలిపోతుంది కదా అని ఒక విలేకరి అడిగితే… బాధితులు కంప్లయింట్ చేస్తే అవి చేయలమని.. కంప్లయింట్ లేకుండా ఎలా చేయగలమని అన్నారు. ఇలా అన్నీ డొంకతిరుగుడుగానే చెప్పాల్సి వచ్చింది పాపం ఎస్పీగారికి.
మరోవైపు ఈ ప్రెస్ మీట్ అవడం ఆలస్యం.. ప్రెస్ మీట్ కు రెడీగా ఉన్న ఎంపీ గోరంట్ల మాధవ్ మళ్లీ విరుచుకుపడ్డారు. ఒరిజినల్ కాదని నేను చెప్పా కదా అంటూ తన ఒరిజినల్ భాషలో మండిపడ్డారు. మీడియా చానెళ్లను, తెలుగుదేశాన్ని దుర్భాషలాడుతూ చెలరేగిపోయారు. మళ్లీ కమ్మ సామాజికవర్గం పేరెత్తి మరీ తిట్టారు.
మొత్తం మీద వైసీపీ గోరంట్ల మాధవ్ ను రక్షించడానికే సిద్ధమైంది ఈ ఎపిసోడ్ తో అర్ధమవుతుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. అందుకే అది ఫేక్ వీడియోనే క్రియేట్ చేశారు అనే మాట చెప్పలేక.. అది ఒరిజినల్ కాదు అని చెప్పించి.. దానిని షెడ్ లో పడేసే పని చేశారు పోలీసులు. ఇదంతా వైసీపీ డైరెక్షన్ లోనే జరిగిందనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక ఆ ఒరిజినల్ వీడియో బయటకు రాదు. నిజం తెలియదు.. ఎవరి వాదన వారు వినిపించుకుంటూ ఉంటారు.