అంబటి రాంబాబు ఆడియో కాల్ వచ్చినప్పుడు.. వెనకేసుకొచ్చారు. అసెంబ్లీలోనే జోకులు కూడా వేశారు. అవంతి ఆడియో కాల్ వచ్చినప్పుడూ అదే తంతు. ఇవన్నీ కామన్ తప్పేంటి అన్నట్లే అధికార పార్టీ వ్యవహరించింది. ఒక్క పృధ్వీ విషయంలోనే సీఎం వెంటనే రెస్పాండ్ అయి.. తీసేశారు. ఎమ్మెల్యే, ఎంపీ కాదు కాబట్టి అది ఈజీ అనుకున్నారేమో తెలియదు. కాని ఇఫ్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మాత్రం అలా చేయటం లేదు. విచారిస్తాం అన్నారు. తర్వాత నిజమని తేలితే కఠిన చర్యలన్నారు. ఇప్పుడు సస్పెండ్ చేద్దామని చూస్తున్నారు.
పార్టీ నుంచి కూడా బహిష్కరించకపోతే డ్యామేజ్ భారీగా ఉంటుందని భయపడుతున్నారు. ఇంత భయం రావడానికి కారణం లేటెస్ట్ సర్వేలే. ఆ సర్వేల్లో వైసీపీకి ఓటమి ఎధురవుతుందనే అంచనాలు రావడంతోనే.. జగన్ కరెక్షన్ మొదలెట్టారు. జనంలో తిరగడం.. ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయటం.. ఎమ్మెల్యే, ఎంపీల పనితీరు రివ్యూ చేయడం, గడపగడపకు చేయాల్సిందేనని పట్టుబట్టడం ఇవన్నీ అందులో భాగమే. 175కి 175 వస్తాయనడం.. కుప్పంతో మొదలెడతామని చెప్పడం.. ఇవన్నీ మైండ్ గేమ్ లో భాగమే. ఇలాంటి సమయంలో మాధవ్ వీడియో చాలా పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది.
అందుకే జగన్మోహన్ రెడ్డి ఈసారి మాధవ్ విషయంలో గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. వేటు వేస్తే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది.. వేయకపోతే అలాంటోడిని ఎలా వెనకేసుకొచ్చారంటారు.. ఏం చేయాలి అని జగన్ తర్జనభర్జన పడుతున్నారని ముందు చెప్పారు.. కాని జగన్ చర్య తీసుకోవడానికే ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు. మరి గోరంట్ల మాధవ్.. వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోఫణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరెత్తితే ఏమంటారో తెలియదు.
అయితే జగన్ మాత్రం ఒకటైతే ఫిక్స్ అయ్యారు. ఈసారి మళ్లీ గెలవాలి. ఏ మాత్రం లూజ్ ఉన్నా.. తేడా వచ్చేస్తుంది. ఒక్కసారి అధికారం కోల్పోతే.. ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. అందుకే చాలా పట్టుదలతో మొత్తం అన్నీ తానై చక్కబెట్టే పనిలో పడ్డారు. మరోవైపు ఇప్పటికే పరిస్ధితి చేయిదాటిపోయిందనే కామెంట్లు వినపడుతున్నాయి. అయినా గాని.. కుప్పం వెళ్లి తన మైండ్ గేమ్ స్టార్ట్ చేసే టైమ్ లో సరిగ్గా మాధవ్ వ్యవహారం ముందుకొచ్చింది. అందుకే జగన్ కు చిర్రెత్తుకొచ్చిందని అంటున్నారు.
మామూలుగా మాధవ్ కేరెక్టర్ పై బ్యాడ్ రిమార్క్ లేకపోతే వేరేగా ఉండేది. మనోడి మొత్తం జాబ్ కెరీర్ లోనూ, ఇటు పొలిటికల్ కెరీర్ లోనూ అన్నీ నెగెటివ్ మరకలే. అందుకే ఈ వీడియో నిజమో కాదో తేలకముందే.. అందరూ నిజమని భావిస్తున్నారు. సొంత పార్టీ నేతలు సైతం తాను చెప్పేది నమ్మటం లేదని మాధవ్ ఇప్పటికే మొత్తుకున్నారు. ఆయన కేరెక్టర్ ని బట్టి అది నిజమే అనుకోవాల్సి వస్తుందనే టాక్ వైసీపీలోనూ వినపడుతోంది. అందుకే మాధవ్ పై చర్య తప్పదని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ తో సరిపెడతారా.. లేక ఏకంగా పార్టీ నుంచి బహిష్కరిస్తారా అనేదే సస్పెన్స్. ఒకటైతే ఖాయం.. ఆయనకు మళ్లీ టిక్కెట్ మాత్రం రాదు. ఒక విధంగా మాధవ్ పొలిటికల్ కెరీర్ ఖతమైందనే చెప్పుకోవాలి.