రాష్ట్రంలో లోన్ ఆప్స్ ముఠా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కరు కాదు… ఇద్దరు కాదు… వందల్లో కేసులు… పదుల్లో మరణాలు వరుస కథనాలతో పేదవాలను భయభ్రాంతులకు …మానసిక వేదనలకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న. లోన్ ఆప్స్ బాధితులు ఎందరో ఉంటున్నారు. ఈ లోన్ ఆప్స్ ముఠా ఆగడాలకు అంతే లేకుండా పోతున్నది. వారి ప్రధాన స్థావరాలు. . రాష్ట్రంలోనే కాకుండా దేశం దాటి ఉన్నాయంటే …ఈ ముఠా వెనుక సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా ఉన్నాయా??? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చైనా ప్రధాన కేంద్రంగా కొన్ని లోన్ యాప్స్… మరికొన్ని. స్వదేశీ లోన్ ఆప్స్ ముఠాలు బెంగళూరు ని అడ్డాగా చేసుకొని క్యాష్ మాస్టర్.. క్రేజీ రూపీ ..క్యాష్ ఇన్ రూపీ మెనూ.. ఇండియన్ బుల్స్.. రూపీ యాప్ ..లతో యాప్స్ ముఠాలు. భారత్ లో తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది. ఎన్ఫోర్మెంట్ డైరెక్టరేట్ కథనం ప్రకారం… బెంగళూరులో ఇటీవల 6.2 కోట్ల రూపాయల నగదును యాప్స్ ముఠా నుండి స్వాధీనం చేసుకొని వీరిపై ఈడి (ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్) కేసులు బుక్ చేసిన ఈ ఆప్ ముఠా వాళ్లు మరలా… మరల పేర్లు మార్చి మార్కెట్లో తమ వ్యాపారాలను బాహాటంగా విస్తరిస్తున్నారన్నారు .దీంతో పేదవాళ్లు వీరు ఉచ్చు లో పడి ప్రాణాలను కోల్పోతున్నారు. తెలియని అకౌంట్స్ నుండి పేదవారికి డబ్బులు పంపడం వారు దాన్ని వాడుకున్నాక… అధిక వడ్డీలు ఇవ్వాలని లేకపోతే వారి ఫోటోలను గుర్తు తెలియని వారి నగ్న చిత్రాలతో మార్పింగ్చేసి …సోషల్ మీడియా అకౌంట్స్ లోకి వారి చుట్టాలకు… బంధువులకు పెడతామని బెదిరింపులు.. రౌడీలతో ఒత్తిడి చేయించడం ఇవన్నీ లోన్ యాప్స్ ముఠా చేసే నిత్య ఆకృత్యాలు. ఇలాంటి యాప్స్ ఉచ్చులో ..పేదవారు… చాలామంది చిక్కుకున్నారు అనేది నగ్నసత్యం.
గుంటూరు లో వివాహిత మృతి…లోన్ యాప్స్ ముఠానే కారణం ???
లోన్ ఆప్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది .మంగళగిరి మండలం… చిన్న కాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్ బుల్స్… రూపెక్స్ యాప్స్ నుంచి 20వేల రూపాయల లోన్ తీసుకుంది. 20వేల రుణానికి లోన్ ఆప్స్ నిర్వాహకులు… 2 లక్షల వరకు వసూలు చేశారు. అయినా ఇంకా డబ్బులు కట్టాలని లేకుంటే ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని కేటుగాళ్లు బెదిరించారు. రుణం తీర్చకపోతే.. బంధువులకు… ఫోన్ చేసి చెప్తామని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. వాట్సాప్ లో అసభ్యకర మెసేజ్లు పంపుతూ… వేధింపులకు గురి చేశారు .దీంతో మనస్థాపం చెందిన ప్రత్యూష …ఇంటి పైన ఉన్న ప్లెక్సీ బోర్డింగ్ కు చీర తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తాను ఎందుకు చనిపోతున్నానో.. సెల్ఫీ వీడియో తీసి తల్లిదండ్రులకు.. భర్తకు వివరించింది.
తూర్పుగోదావరి జిల్లాలో ???
తూర్పుగోదావరి జిల్లా కడియం కు చెందిన ఓ యువకుడు రుణ యాప్స్ ఉచ్చులో చిక్కుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని ఆ అప్పును మీరే చెల్లించాలంటూ అతని స్నేహితులకు.. బంధువులకు… మోసగాళ్లు అసభ్యకర సందేశాలు పంపించారు. దీనిని తట్టుకోలేని. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు…యీ సంఘటన ల గురించి ఏ పి.మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మరియు సభ్యురాలు గజ్జల లక్ష్మీ లు మాట్లాడుతూ….. ఆన్లైన్.లోన్ యాప్ ల ద్వారా తేలికగా రుణాలు అంటగట్టి వడ్డీ మీద వడ్డీలు వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఇలాంటి రుణయాపులను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలను తీసుకోవాలని డిజిపి కి లేఖ రాసినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు ల నిర్వాహకులను కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మహిళా కమిషన్ మెంబర్ గజ్జల లక్ష్మి మాట్లాడుతూ బాధితులు ఎక్కువగా మధ్యతరగతి…సామాన్య మహిళలే అని..పిల్లల చదువులు కొరకు..కుటుంబ అవసరాల కోసం…గత్యంతరం లేని పరిస్థితుల్లో యాప్ ల ద్వారా రుణాలు తీసుకుంటున్నారని..తీసుకున్న రుణాల కన్నా 3 రెట్లు అధిక మొత్తం లో నగదు చెల్లించిన.. వీళ్ల ఆగడాలు ఆగడం లేదన్నారు…అంతే కాదు లోన్ యాప్ ద్వారా రుణం తీసుకునే బాధితులు..తాము నివసిస్తున్న ప్రాంతం లొకేషన్..ఆధార్ కార్డులు… పాన్ కార్డులు..బంధువుల…స్నేహితుల పోన్ నెంబర్ల ను కూడా ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నార న్నారు..వీళ్ళుఅప్పు మొత్తం చెల్లించినా… ఇంకా ఇంకా నగదు చెల్లించాలని.. విపరీతంగా ఫోన్లు చేయడం…అసభ్యం గా మాట్లాడడం…బంధువులకు..స్నేహితులకు ఫోన్లు చేసి రుణం తీసుకున్న వారి గురించి చెప్పడం..లేకుంటే న్యూడ్ ఫొటో ల ను మార్ఫింగ్ చేసి ఆ స్తానం లో వీళ్ల ఫొటో లు పెట్టి సోషల్ మీడియా లో పెడతానని బెదిరించడం చేస్తున్నారని వీటి కి చరమ గీతం పాడాలంటే… ప్రజల లో అవేర్ నెస్ రావాలని..ఆ విధం గా మహిళా సంఘాలు…కృషి చేయాలన్నారు..అంతేకాకుండా..రాష్ట్ర…కేంద్ర ప్రభుత్వాలు.యీ లోన్ యాప్ లను బ్యాన్ చేయాలని..సోషల్ మీడియాలో ఉన్న రుణాల లింక్ లను తొలగించాలన్నారు.