టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర సాంస్కతిక వ్యవహారాల మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇందులో ఆయన మన్యం వీరుడిగా దేశంలో పలు రాష్ట్రాలు గర్వించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని కేంద్రం ఈసారి అధికారికంగా నిర్వహిస్తోందని, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దీన్ని చేపడుతున్నట్లు తెలిపారు. భీమవరంలో ప్రధాని మోడీ హజరవుతున్న ఈ కార్యక్రమానికి ఓ ప్రజాప్రతినిధిని పంపాలని కోరారు.
అల్లూరి 125వ జయంతి సందర్భంగా జూలై 4 నుంచి ఏడాది పాటు కేంద్రం నిర్వహించే పలు కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి కోరారు. 2019 తర్వాత ఇదే తొలిసారి గతంలో టీడీపీ-బీజేపీ 2014లో కలిసి పోటీ ఉమ్మడిగా కేంద్ర, రాష్ట్రాల్లో విజయం సాధింఛాయి. అలాగే కేంద్రంలో మోడీ కేబినెట్ లో ఇద్దరు టీడీపీ మంత్రులకు అవకాశం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ తరఫున ఇద్దరు మంత్రులకు చంద్రబాబు అవకాశం కల్పిచారు. ఆ తర్వాత జగన్ ట్రాప్ లో పడి విభజన హామీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు దెబ్బతిన్నారు. ఆ తర్వాత తిరిగి బీజేపీతో స్నేహం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు ఇన్నాళ్లకు మోడీ ఆహ్వానం పంపారు. అయితే అక్కడే మరో ట్విస్ట్ నెలకొంది. చంద్రబాబు స్ధానంలో అచ్చెన్నాయుడు హాజరు అయితే కిషన్ రెడ్డి చంద్రబాబుకు రాసిన లేఖలో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబును నేరుగా మీరు రావాలని కోరకుండా మీ పార్టీ తరఫున ఓ ప్రజాప్రతినిధిని పంపాలని మాత్రమే కోరారు. దీంతో పార్టీలో ఈ విషయాన్ని చర్చించిన చంద్రబాబు… ఏపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని భీమవరం పంపాలని నిర్ణయించారు. దీంతో ఆయన వచ్చేనెల 4న ప్రధాని మోడీ టూర్ లో టీడీపీ ప్రతినిధిగా హాజరుకాబోతున్నారు. అయితే ఇంతకూ కేంద్రం పంపిన లేఖలో చంద్రబాబుకు నేరుగా ఎందుకు ఆహ్వానం పంపలేదనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. మోడీ టూర్ లో చంద్రబాబును రప్పించడం ఇష్టంలేకపోవడం వల్లే ఇలా చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది.