టార్గెట్ కుప్పం అంటోంది వైసీపీ పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమాతో ఉంది. మొదటి నుంచి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు, టీడీపీకి చెక్ పెట్టాలని వైసీపీ పావులు కదుపుతోంది. ఇప్పుడు మరింత దూకుడు పెంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకంగా కుప్పంలోకి ముఖ్యమంత్రి హోదాలో ఎంట్రీ ఇచ్చారు. చేయూత పథకం నిధుల విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుప్పంలో అడుగు పెట్టారు.
ఇప్పటికే కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారు, మున్సిపాలిటీ హోదా ఇచ్చారు. ఇవేకాదు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. కుప్పంలో ఈసారి కచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని చెబుతున్నారు వైసీపీ నేతలు. ఈసారి చంద్రబాబు ఓటమి ఖాయమని మొన్న కుప్పం మున్సిపాలిటీని దక్కించుకున్నామని,ఈసారి ఎమ్మెల్యే సీట్ తమదే అంటోంది. అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పం పర్యటన సందర్భంగా సరికొత్త నినాదాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది.
వైసీపీ సరికొత్తగా #Why Not 175, #Why Not Kuppam అంటూ సరికొత్త నినాదాలను తెరపైకి తెచ్చింది. మొదట టార్గెట్ కుప్పం అంటోంది. కుప్పం గడ్డ వైఎస్సార్‌సీపీ అడ్డా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారు కుప్పం ఊపిరి పీల్చుకో అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రధానంగా #WhyNotKuppam నినాదాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈసారి కుప్పంలో ఎగిరేది వైసీపీ జెండానే అని కేఆర్జీ భరత్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారంటున్నారు. అంతేకాదు అధికార పార్టీ నేతలు ఆయనకు మంత్రి పదవి ఖాయమని ధీమాతో ఉన్నారు.
#WhyNot175 #KuppamGaddaYCPAdda pic.twitter.com/vLU5h5ajv7
— Kodali Nani (@IamKodaliNani) September 23, 2022