విశాఖపట్నం : గడపగడపకూ వైఎస్సార్సీపీ అంటూ అనధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ అప్పుడే రాజకీయ వ్యూహాలకు తెరలేపారు. నిన్నామొన్నా పార్టీ నాయకులతో జరిగిన సమావేశాల్లో జగన్ మొత్తం 175 స్థానాలూ గెలవాల్సిందే అంటూ టార్గెట్ ఫిక్స్ చేశారు. అంటే అందులో 2019 ఎన్నికల్లో టిడిపి గెలిచిన 23 సీట్లూ ఉన్నాయన్నమాట..వాస్తవానికి గత ఎన్నికల్లో టిడిపి 23 సీట్లు గెలవగా కరణం బలరామకృష్ణ మూర్తి(చీరాల), మద్దాలి గిరిధర్(గుంటూరు వెస్ట్) వల్లభనేని వంశీ(గన్నవరం) వాసుపల్లి గణేష్(విశాఖ) మాత్రం టిడిపికి దూరంగా వైసీపీకి దగ్గరగా మెలుగుతున్నారు. ఇక మిగిలిన 19 స్థానాల్లో టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు.ఇప్పుడు ఈ స్థానాలమీద జగన్ దృష్టి సారించారు. ఈమేరకు ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఐ-ప్యాక్ సంస్థ ఓ రోడ్ మ్యాప్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ 19 స్థానాల్లో చంద్రబాబు-కుప్పం, అచ్చెన్నాయుడు-టెక్కలి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. గద్దె రామ్మోహన్.. బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ వంటి ఎమ్మెల్యేలూ ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని గెలిచారు అంటే వీరికి ప్రజల్లో అభేద్యమైన మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ తరుణంలో వారిని ఓడించేందుకు ఎలాంటి వ్యూహాలు పన్నాలి ఏ రూట్లో వెళితే వారిని ప్రజల నుంచి దూరం చేయొచ్చు అన్నదానిమీద ఐ ప్యాక్ టీమ్ ఓ ప్రణాళిక రూపొందించి జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది.
కుప్పం పై ప్రత్యేక దృష్టి
గత ముప్పై ఏళ్లుగా కుప్పంలో అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడుని ఈసారి ఎలాగైనా నిలువరించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో భయపెట్టో, బెదిరించో, డబ్బు లు పంచో ఏదో విధంగా మెజారిటీ స్థానాలు వైసిపి అభ్యర్థులను గెలిపించుకున్నారు. మొత్తం 66 ఎంపిటిసి స్థానాల్లో 63 సీట్లను వైసిపి వాళ్లే గెలిచారు. 89 గ్రామపంచాయతీల్లో 74 స్థానాలు ఇంకా కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులనూ నయానో భయానో అధికారపార్టీ తమ ఖాతాలో వేసుకుంది. ఇంతటి రుబాబు గతంలో ఎన్నడూ చూళ్ళేదని, ఇంతటి ఆరాచకత్వం ప్రజాస్వామ్యనికే విఘాతం అని చంద్రబాబు నాయుడుతోబాటు సీనియర్ నాయకులు ఆక్రోశించినా ఫలితం లేకపోయింది. ఈ ఫలితాలను పట్టుకుని జగన్ కుప్పం కోటను కూడా కైవసం చేసుకునేందుకు సేనలను సిద్ధం చేస్తున్నారు.
సర్పంచులు..ఎంపీటీసీలు..ఎంపిపి