ఏపీలో నేతలకు వచ్చే ఎలక్షన్స్ కచ్చితంగా బీపీని పెంచుతున్నాయన్న టాక్ నడుస్తోంది. మెయిన్ గా పార్టీ ఏదయినా టిక్కెట్ ఆశించిన నేతకు మాత్రం హార్ట్ బీట్ తో పాటు.. బీపీని కూడా పెంచేస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ అధినేతలకు నిద్ర కరువవడం కామన్ విషయమే. అందులోనూ ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరికి వారే ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవడంతో పాటు.. ఈసారి ఎన్నికలే రాబోయే కాలంలో కూడా పార్టీ బలోపేతాన్ని డిసైడ్ చేయడంతో ఎవరికి వారే ఇప్పటి నుంచే స్ట్రాంగ్ స్ట్రాటజీలను ఫాలో అవుతూ అపోజిషన్ పార్టీలను డీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ఏపీలో వైఎస్సార్సీపీ కి దీటుగా తెలుగు దేశంపార్టీని మరింత బలంగా తయారుచేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా స్కెచ్ లు వేస్తున్నారు. అయితే ఇటు ఏపీ సీఎం జగన్ , అటు చంద్రబాబు కూడా ఒక విషయంలో మాత్రం ఒకే రూట్ ను ఎంచుకోవడమే ఇప్పుడు నేతల్లో గుబులు పుట్టిస్తోంది.ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వాళ్లకి టిక్కెట్ ఇవ్వమని అప్పుడెప్పుడో చంద్రబాబు తనయుడు లోకేష్ ఎప్పుడో చెప్పారు. అయితే అది అంత సీరియస్ గా తీసుకోని నేతలు..ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో బీపీలు పెంచుకుంటున్నారు. టిక్కెట్ ఇచ్చేముందు అతని బయోడేటా మొత్తం బయటకు తీసి వారికి గెలిచే సీనుంటేనే టిక్కెట్ ఇవ్వడానికి లేదంటే నో చెప్పేసి సైడేయడానికి చంద్రబాబు ప్లాన్ వేస్తున్నారు. ఎలా అయినా వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలని.. అలా అని డబ్బుకు, సన్నిహితులకు, రికమెండేషన్ లకు లొంగిపోతే తర్వాత తలెత్తుకోలేమన్న లెక్కలు వేసుకున్న చంద్రబాబు..ఈసారి ముక్కుసూటిగా ఉండటానికే డిసైడయ్యారట. దీంతోనే అతని వెనుకున్న బలం ఏంటి.. అతనికి టిక్కెట్ ఇస్తే వచ్చే లాభనష్టాలు కూడా బేరీజు వేసుకుంటున్నారట.
అటు జగన్ కూడా టిక్కెట్ విషయంలో చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారట. ఇప్పటికే పదవులు ఇచ్చిన వారికి నెక్ట్స్ టిక్కెట్ ఇవ్వడమా.. మానేయడమా లేక కొత్త వారికి టిక్కెట్ ఇస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందోనని సీక్రెట్ గా ఎంక్వైరీలు చేయిస్తున్నారట. ఇచ్చిన మాట కంటే ఎన్నికల్లో వచ్చే గెలుపే ముఖ్యమన్న కాన్సెప్ట్ ను ఫాలో అవడానికి జగన్ చాలా సీరియస్ గా వర్కవుట్లు సార్ట్ చేస్తున్నారన్న వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదన్న నిర్ణయానికి జగన్ వచ్చారు. దీనికితోడు ప్రజల్లో ఎక్కువ శాతం అసంతృప్తి ఉన్న నేతలను దగ్గరకూ కూడా రానివ్వకూడదని డెసిషన్ ఏపీ సీఎం తీసుకున్నారట. అందుకే గడపగడపకూ ప్రభుత్వంలో నేతల పనితీరుపై సీక్రెట్ గా కన్నేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇటు వైసీపీలోనూ.. అటు టీడీపీలోనూ వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించే నేతలకు ఈసారి తమకు టిక్కెట్ వస్తుందా రాదా అన్న భయం వెంటాడుతుందట. దీంతో ఈ నేతలంతా.. అధినేతలను కాకాలు పట్టుకోవడం కాకుండా జనాల్లో ఇమేజ్ పెంచుకోవడానికి ఇప్పటి నుంచీ తమ ప్లాన్ లు తాము గీసుకుంటున్నారట. దీనికోసం సీనియర్ పొలిటికల్ లీడర్స్ సజెషన్స్ కూడా ఫాలో అవుతూ.. ఎలా అయినా టిక్కెట్ సంపాదించాలని స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నారట.