గిరిజనుల పేరుతో అధికార పార్టీకి చెందిన వారే అక్రమంగా పరిహారం కాజేస్తున్నారని ఆరోపణలు
అవినీతి ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు. నేటికీ గిరిజనుల పేరుతో అధికార పార్టీకి చెందిన వారే అక్రమంగా పరిహారం కాజేస్తున్నారని విపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. .ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు ప్రాజెక్ట్ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చాయి.కోట్లాది రూపాయిలు గంగపాలైన వైనం…పోలవరం ప్రాజెక్టు భూముల పరిహారం పంపిణీ అక్రమాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు రూ.50 కోట్ల వరకు ఇలాంటి అక్రమాలు జరిగి ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం . దొంగ పట్టాలు సృష్టించి, కొండ పోరంబోకు భూముల సేకరణలో అనర్హులకు పరిహారం పంపిణీ చేసిన అంశం రగులుతేనే ఉంది..అనేక గ్రామాల గిరిజనులు తమకు ఇంకా పరిహారం అందలేదని చెప్పడం, ఇప్పటికే వారి భూములకు పరిహారం చెల్లించినట్లు రికార్డుల్లో నమోదై ఉన్న అంశాలు బయటపడుతూనే ఉన్నాయి. దొంగ పట్టాలు సృష్టించి, కొండ పోరంబోకు భూముల సేకరణలో అనర్హులకు పరిహారం పంపిణీ చేసిన అంశం కలకలం సృష్టిస్తుంది… మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఈ కుంభకోణంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ వద్ద గతంలో నిరాహారదీక్షలు చేపట్టారు. పోలవరం ప్రత్యేకాధికారి ప్రవీణ్ ఆదిత్య విచారణ జరిపి జిల్లా కలెక్టరుకు నివేదిక సమర్పించారు. అనంతరం ఈ అక్రమాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ అక్రమాలు జరిగిన సమయంలో దేవీపట్నం ఎమ్మార్వోగా పని చేసిన వీర్రాజును అధికారులు సస్పెండు చేయడంతో పాటు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అక్రమాల్లో మరో ఇద్దరు కీలక అధికారుల ప్రమేయం ఉందని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో వీటికి కొన్ని ఆధారాలు దొరికినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గతంలో భూ సేకరణ ప్రత్యేక కలెక్టరుగా పని చేసిన ఇద్దరు రెవెన్యూ అధికారుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. అందులో ఒకరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. మరొకరు వేరే చోట విధుల్లో ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్రమాల్లో నలుగురు దళారుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం.ఎమ్మార్వో, దళారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇద్దరు ఉన్నతాధికారుల ప్రమేయాన్ని ఇందులో ఆధార సహితంగా గుర్తించినట్లు తెలిసింది. దేవీపట్నం మండలం కొండమొదలు భూములకు సంబంధించి అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అక్కడ భూముల పరిహారానికి నిజమైన హక్కుదారులు ఎవరో తేలకపోవడంతో గతంలో ఉన్న ఒక అధికారి రూ.25 కోట్లను కోరుకొండలోని ఒక బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిసింది. తర్వాత కొందరు దళారులు అప్పట్లో ఒక ఉన్నతాధికారిని సంప్రదించారు. అసలు హక్కుదారులు తేలక ముందే దాదాపు రూ.18 కోట్ల వరకు మొత్తం వేరేవారి పేరున చెక్కులు ఇచ్చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో పెద్ద మొత్తంలో కమీషన్ చేతులు మారిందన్న ఆరోపణలున్నాయి. తాజా విచారణలో ఈ అంశమూ వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
వారికి ఉపాధి చూపించాలి
గతంలో పోలవరం ముంపు బాధితులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలు దేవిపట్నం, చిన్న భీంపల్లి, కొండమొదలు, గానుగుల గొంది, పెనికలపాడు, సీతారం, మంటూరు, తొయ్యేరు గ్రామాల్లో పునరావాస బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించి, పోలవరం ముంపు బాధితులకు పునరావాసం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పాటు దానికి తోడు 2013 భూసేకరణ చట్టంలో మారిన నిబంధనలు అమలులోకి రావడంతో చెల్లించాల్సిన పరిహారం కూడా పెరిగింది. అదే విధంగా ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ జగన్ ఇచ్చిన హామీలు కూడా పునరావాసం కోసం వెచ్చించాల్సిన వ్యయం మరింత పెరగడానికి కారణమయ్యాయి. వైఎస్సార్ హయంలో శంకుస్థాపన జరిగిన నాటికి 2005-06లో బాధితుల సంఖ్య 44,500 మంది అని ప్రకటించారు. వారికి పరిహారంగా రూ. 8 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ ఆ తర్వాత 2011-12 నాటి లెక్కల ప్రకారం పరిహారం కోసం అర్హుల సంఖ్య 80 వేలకు చేరింది. ఆ సమయంలో 18 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హుల జాబితాలో లెక్కించడం, కొత్తగా వచ్చిన కుటుంబాలు కలుపుకొని నిర్వాసితుల సంఖ్య పెరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ పదేళ్ల కాలంలో వారి సంఖ్య లక్ష దాటిందని చెబుతున్నారు.
ప్రాజెక్టు కోసం 2005-06లో 95,700 ఎకరాలు భూసేకరణ చేయాలని లెక్కలు వేశారు. కానీ, 2017-18లో దానిని 1,55,465 ఎకరాలుగా సవరించారు. దాంతో తొలి అంచనాల కన్నా 55,335 ఎకరాలు అదనంగా సేకరించాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ముంపు ప్రాంతంలో ఫీల్డ్ సర్వే చేయడం వల్ల భూసేకరణ పెరిగిందని అధికారికంగా ప్రకటించారు. కానీ పోలవరం విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తర్వాత ముంపు ప్రాంతం ఎక్కువగా లెక్కిస్తున్నారన్నది నిర్వాసితుల వాదన. నిర్వాసితుల సంఖ్య, సేకరించాల్సిన భూమి కూడా పెరగడంతో పునరావాసానికి వెచ్చించాల్సిన ఖర్చు పెరిగింది. దాంతో తాజాగా ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం సుమారు రూ. 30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మొత్తం 371 ఆవాసాలకు చెందిన 1,05,601 కుటుంబాలు ప్రభావితం అవుతాయని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిర్ధరించింది. వాటిలో ఇప్పటి వరకు 3,922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. పోలవరం ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని ప్రభుత్వం చెబుతుంది..
పోలవరం ముంపు ప్రాంతాల్లో భాదితులను అదుకోవాలి.. పద్మశ్రీ
పోలవరం ముంపు బాధితులను ఆదుకోవాలని,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి తక్షణం ఇవ్వాలని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కేంద్ర, రాష్ట్రాలను డిమాండ్ చేశారు.జాతీయ ప్రాజెక్ట్ కోసం తమ సర్వశ్వాన్ని త్యాగం చేసిన నిర్వాసితులను నట్టేట ముంచేస్తున్నారన్న వాదన వినిసిస్తోంది. ఇప్పటి వరకు నిర్వాసితుల్లో 4 శాతం మందికి మాత్రమే పరిహారం.. పునరావాసం కల్పించినట్టు నివేదికలు చెప్తున్నాయి అన్నారు… రైతులకు , గిరిజనులకు పరిహారం చెల్లించకుండా కేంద్ర, రాష్ట్రాలు మోసం చేస్తున్నాయి అన్నారు. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ చర్యుల చేపట్టాలన్నారు.. ఏపి సీఎం జగన్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ కల నిజం చేస్తానని హామీ ఇచ్చిన నాయకుడు… కనీసం గిరిజనుల పరిహారం జరుగుతన్న జాప్యంపై స్పందించక పోవడం దారుణం అన్నారు…