భారత్ పశ్చిమాసియా ఒప్పందాల గురించి ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడుకునే ముందు భారత ఆర్థిక వ్యవస్థ గురించి సామజిక ముఖచిత్రం గురించి కొంత అవగాహన పెంచుకోవటం అత్యవసరం..
భారత ఆర్థిక వ్యవస్థ – ముఖచిత్రం :
భారత ఆర్ధిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ (PPP-పిపిపి) లెక్కల బట్టి 3.36 ట్రిలియన్ డాలర్ల GDP (జిడిపి అనగా ఆదాయం) తో ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. డాలర్ మారక ద్రవ్య విలువల బట్టి చూసినా, భారత్ 691.87 బిలియన్ డాలర్ల GDP తో ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది. 2005 మొదటి త్రైమాసికం నాటికి భారత్ 8.1 శాతం పెరుగుదలతో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. ఐతే, భారీ జనాభా వలన తలసరి ఆదాయం మాత్రం 3,100 డాలర్లతో (PPP లెక్కల బట్టి) కొంచెం తక్కువగానే ఉంది.
విభిన్న ఆర్థిక కోణాలు – సవాళ్లు :
భారత ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయం, హస్తకళలు, పరిశ్రమలు, సేవలు వంటి రంగాలతో విభిన్నమై ఉంది. నేటి భారత ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలకు సేవల రంగమే దోహదపడుతున్నప్పటికీ, పని చేసే జనాభాలో మూడింట రెండొంతుల వారు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. దేశంలోని ఆంగ్ల భాషా ప్రవీణులైన విద్యావంతుల సంఖ్య వలన భారత్ సాఫ్ట్‌వేర్ సేవలు, వాణిజ్య సేవలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఎగుమతిలో ముందంజలో ఉంది.భారత స్వాతంత్ర్యానంత చరిత్రలో ఎన్నో ఏళ్ళు ప్రభుత్వం సామ్యవాద విధానాన్ని ఆచరించడమే కాక, ప్రైవేటు సెక్టార్, విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులను నియంత్రించింది. 1990ల మొదలు ఆర్ధిక సంస్కరణల ద్వారా ప్రభుత్వం విదేశీ వ్యాపారంపై నియంత్రణలను తగ్గించి మార్కెట్టు వ్యవహారాలని సులభతరం చేసింది. ఐతే ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న పరిశ్రమల ప్రైవేటీకరణ మాత్రం రాజకీయ వాగ్వివాదాల మధ్య నెమ్మదిగా సాగుతోంది. పెరుగుతున్న జనాభా, మౌలిక సదుపాయాల కొరత, పెరుగుతున్న అసమానత, నిరుద్యోగం, 1980లనుండి 10 శాతం మాత్రమే తగ్గిన పేదరికం – ఇవన్నీ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఆర్ధిక-సామాజిక సమస్యలు.
ఐక్య రాజ్య సమితి – భారత్ స్థానం :
ప్రపంచంలోని దేశాలను తలసరి ఆదాయం ప్రాతిపదికగా ఐక్య రాజ్య సమితి రెండు విధాలుగా విభజించింది (1) అభివృద్ధి చెందిన దేశాలు (2) అభివృద్ధి చెందుతున్న దేశాలు ; ప్రపంచ బ్యాంకు కూడా తలసరి ఆదాయం ప్రాతిపదికగా నాలుగు విధాలుగా విభజించింది.
నిమ్న ఆదాయ వర్గ దేశాలు – తలసరి వార్షిక ఆదాయం 875 డాలర్ల కంటే తక్కువ ఉన్నాయి.
అల్ప మధ్యస్త ఆదాయ వర్గ దేశాలు – తలసరి వార్షిక ఆదాయం 875 – 3465 డాలర్ల మధ్య ఉన్నాయి.
అధిక మధ్యస్త ఆదాయ వర్గ దేశాలు – తలసరి వార్షిక ఆదాయం 3465 – 10,725 డాలర్ల మధ్య ఉన్నాయి.
అధిక ఆదాయ వర్గ దేశాలు – తలసరి వార్షిక ఆదాయం 10,726 డాలర్ల కంటే ఎక్కువ ఉన్నాయి.
2005లో భారత్ తలసరి వార్షిక ఆదాయం 720 డాలర్లు కనుక భారత్ నిమ్న ఆదాయ వర్గ దేశంగా పరిగణింపబడుతున్నది.
గల్ఫ్ దేశాలు ఆయిల్ నిల్వలు :
గల్ఫ్ దేశాలు ఆయిల్ నిల్వలకు పెట్టింది పేరు అదేవిధంగా భారత దేశం పెట్రోలియం డీజిల్ లాంటి పెట్రో ఆధారిత ఉత్త్పత్తుల కోసం చాల వరకు గల్ఫ్ దేశాల పైన ఆధారపడవలసి వస్తుంది
మూడువంతుల పెట్రో దిగుమతులు గల్ఫ్ దేశాల నుండే మనకు లభ్యమవుతున్నాయి అంతేకాకుండా సుమారు 89 లక్షల మంది భారత పౌరులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు సుమారు వారు 40 బిలియన్ విదేశీ మారక ద్రవ్యాన్నిఅక్కడ నుండి ఇండియాకు పంపుతున్నారు దీంతో తాజాగా భారత ప్రభుత్వం (సి ఈ పి ఏ )కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ యూ ఏ ఈ తో చేసుకుంది దీని వలన మరిన్ని వాణిజ్య ఒప్పందాలను ఇస్లామిక్ దేశాలతో చేసుకోవటం వలన మరింత విదేశీ నిల్వలను పెంచుకోవచ్చు అనేది భారత ప్రభుత్వ ఆలోచన అంతేకాకుండా ఇరాక్ దేశం సుమారు 60 శాతం పెట్రోలియం ను మనకి దిగుమతి చేస్తుంది యూఏఈ నుండి కూడా 18 శాతం దిగుమతి చేసుకుంటుంది అంటే సుమారు గా మనం 60 శాతం పైనే ఆయిల్ కోసం గల్ఫ్ దేశాల మీద ఆధారపడవల్సి వస్తుంది.
అదేవిధంగా బాస్మతి రైస్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు శిల్క్ ఇంజనీరింగ్ ఫార్మా ఆటోమొబైల్ అగ్రికల్చరల్ ఉత్పత్తులు ఇలాంటివి పశ్చిమాసియా దేశాలకు మన నుండి ఎగుమతి చేస్తుండటంతో ఇరు దేశాలకు వాణిజ్య ఒప్పందాలు కీలకంగా మారాయి
రాజకీయ కారణాలతో ఆర్థిక లావాదేవీలకు గండం ?
ఇస్లాం మత సంప్రదాయాలకు భిన్నత్వం లో ఏకత్వం గా ఉండే భారతీయ సంప్రదాయాలకు చాల తేడా ఉంది ఐతే మాత్రం వాణిజ్య పరంగా వీటిని పక్కన పెట్టి కేవలం ఎవరి దేశ ప్రయోజనాలకు వారు ప్రాధాన్యత ఇస్తున్నారు తాజాగా నుపుర్ శర్మ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం అందుకే ఇంతలా స్పందించింది వాణిజ్య వ్యాపారాలతో పాటు భారత లౌకిక స్ఫూర్తి దెబ్బతుంటుందనే ఆలోచనలో భాగంగా వారిని సస్పెండ్ చేయటం జరిగింది ఎవరి మత విశ్వాసాలకు భారత్ లో ఇబ్బంది కలగదని ప్రజాస్వామా స్ఫూర్తి కలిగిఉంటుంది మోడీ ప్రభుత్వం చాటి చెప్పింది
భారత్ స్వదేశీ స్వాలంబన దిశగా అడుగులు ?
పై ఉదాహరణల నేపథ్యం లో భారత్ స్వదేశీ స్వాలంబన దిశగా అడుగులు వేస్తుంది భారతీయ పరిశ్రమలను ప్రోత్సహించటం స్వదేశీ డిఫెన్సె పరికరాలు వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల ఆటో మొబైల్ సర్వీస్ రంగం లో గణనీయమైన మార్పులు కొత్త కంపెనీస్ కి చేయూత ఇలా అన్ని రకాలుగా భారతదేశం గతం కంటే కచ్చితమైన అంచనాతో ముందుకు వెళ్తుంది అందుకే రాబోయే రోజుల్లో భారత్ ఒక శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోబోతుంది అనటంలో సందేహం లేదు.