నగరిలో రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా నగరిలోని ఎన్టీఆర్ కూడలిలో ఆయన మాట్లాడుతూ అద్దె మనుషులతో వైకాపా ప్లీనరీ నడుస్తోందని విమర్శించారు.
వైకాపా ప్రభుత్వంలో చిత్ర విచిత్రాలు..
”జగన్ ప్రభుత్వానివి నవరత్నాలు కాదు నవఘోరాలు. జగన్ ప్రజల్లోకి వెళితే వారి ఆగ్రహం తెలుస్తుంది. పులివెందులలో కూడా జగన్ పరదాలు, బారికేడ్లు అడ్డం పెట్టుకొని తిరిగారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఎక్కువ. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా ఏపీలో తగ్గించలేదు. మనకంటే తమిళనాడులో మద్యం ధరలు తక్కువ. మద్యం కోసం పొరుగు రాష్ట్రం వెళ్తున్నారు. జగన్ అక్రమాలతో ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం హానికరం.. విష పదార్థాలు ఉన్నాయి. హానికర మద్యంపై రాష్ట్ర ప్రజలకు ప్లీనరీలో జగన్ సమాధానం చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు ఆరుసార్లు పెరిగాయి. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే తెదేపా మహానాడుకు భారీగా జనం వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. ఎలుకలు మద్యం తాగుతున్నాయి.. ఉడతలు కరెంటు తీగలు కొరుకుతున్నాయి. తేనెటీగలు రథాలు కాల్చేస్తున్నాయి. నేను ఒక్క ఆర్డర్‌తో ప్రతి గ్రామంలో స్కూల్ వచ్చేలా చేస్తే.. జగన్ ఒక్క ఆర్డర్‌తో 10వేల స్కూళ్లు మూసేశారు” అని చంద్రబాబు విమర్శించారు.
నా మీద కోపంతో అమరావతి ఆపేశారు
”పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశారో చెప్పగలరా? రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్ రద్దు చేయడం పేదవాళ్లపై ప్రేమా ? డీఎంకే పాలన వచ్చినా తమిళనాడులో అమ్మ క్యాంటీన్ కొనసాగించారు. హైదరాబాద్‌లో ఉన్న హైటెక్ సిటీ, ప్రాజెక్టులు కూల్చివేసి ఉంటే అభివృద్ధి జరిగేదా? నా మీద కోపంతో అమరావతి ఆపేశారు.. ఇది న్యాయమా? పాలకులు జవాబుదారీ తనంతో ఉండాలి. ముఖ్యమంత్రి రూ.లక్ష కోట్లు తినేస్తుంటే.. స్థానిక మంత్రులు రూ.10వేల కోట్ల చొప్పున తింటున్నారు” అని చంద్రబాబు ఆరోపించారు.