నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘బింబిసార’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. ఈ మూవీతో తో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను రీసెంట్‌గా విడుదల చేయగా విశేషమైన స్పందన లభించింది. ఆగస్ట్ 5న రాబోతోన్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివార గ్రాండ్‌గా జరిగింది.
ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘మన అందరికీ చందమామ కథలు, అమరచిత్ర కథలు, జానపద చిత్రాలంటే ఇష్టం. వాటిని మొదలు పెట్టింది మా తాత గారు. బాబాయ్ భైరవ ద్వీపం, చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇదొక మంచి సోషియో ఫాంటసీ, జాన పద చిత్రం. ఆగస్ట్ 5న మీ ముందుకు రాబోతోంది. తప్పకుండా థియేటర్‌కు వెళ్లండి. మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని కచ్చితంగా ఈ సారి మిమ్మల్ని నిరాశపర్చను. సినిమా చూశాక మీరు గర్వపడతారు. మా తాత గారి వందో జయంతి. ఆయనకు ఈ సినిమాను అంకితం చేస్తున్నాను. సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కరోనా సమయంలో ఎంతో కష్టపడి పని చేశారు. పాప చలిలోనూ పని చేసింది. ఎడిటర్ తమ్మిరాజు, వీఎఫ్ఎక్స్ అద్వితా, అనిల్ పాడూరి అందరికీ థాంక్స్. మీరు లేకపోయి ఉంటే.. ఆ విజువల్స్ వచ్చి ఉండేవి కావు. వెంకట్, రామకృష్ణ ఫైట్ మాస్టర్లకు థాంక్స్. శోభి, యష్, విజయ్, రఘు మాస్టర్లకు థాంక్స్. మాటలు రాసిన వాసుదేవ్‌కు థాంక్స్. మా పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వచ్చి రైటర్ అయ్యారు.
చోటా గారికి థాంక్స్.. ట్రైలర్ చూశారు కదా ?
టాలెంట్ అంతా వశిష్టదే. ఈ సినిమాకు లైఫ్ ఇచ్చింది కీరవాణి గారు. ఈ రోజు బింబిసారుడి కర్త కర్మ క్రియ ఒకే ఒక వ్యక్తి హరిబాబు. హరి లేకపోయి ఉంటే ఇంత వరకు వచ్చేవాళ్లం కాదు. ఇంత పెద్ద సినిమాను మాకు ఇచ్చినందుకు రుణపడి ఉంటాను. ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన నా తమ్ముడికి థాంక్స్ చెప్పను. లవ్యూ నాన్న.. అదే మన రిలేషన్. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి.. వర్షాలు పడుతున్నాయి.. ఇంకా జాగ్రత్తగా వెళ్లండి .. ఆగస్ట్ 5న థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు. ఇక ఎన్టీఆర్ పేరు ఎత్తగానే ఓ రెండు నిమిషాలు ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది.