ఎస్బీఐ ఖాతాదారులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే ఖాతాదారుల సౌకర్యార్థం నిరంతరం సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ సేవ కోసం సమీపంలోని శాఖకు వెళ్లవలసిన అవసరం లేదు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు కస్టమర్ల కోసం కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. శని, ఆదివారాలు కూడా కొన్ని సౌకర్యాలు అందించనుంది. బ్యాంక్ ప్రారంభించిన ఈ సౌకర్యం కింద మీరు ఫోన్‌లో అనేక ముఖ్యమైన వివరాలని పొందుతారు.
ఎస్బీఐ ఇటీవల జారీ చేసిన రెండు కొత్త టోల్ ఫ్రీ నంబర్‌లకు కాల్ చేయడం వల్ల మీరు ఫోన్‌లో బ్యాంకింగ్ సేవను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు మీరు శనివారం, ఆదివారం కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా, వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అందిస్తూ ఎస్బీఐ సంప్రదింపు కేంద్రం టోల్ ఫ్రీ నంబర్‌కు 1800-1234 లేదా 1800-2100కు కాల్ చేయడం ద్వారా మీ బ్యాంకింగ్ అవసరాలను తీర్చుకోవచ్చు.
SBI alert! NEFT service will remain unavailable on THIS date https://allplacesmap.com/news/business/sbi-alert-neft-service-will-remain-unavailable-on-this-date.html State Bank of India (SBI) may need to wrap up all their digital transactions pending for Sunday on Saturday as the bank’s online…
అన్ని ల్యాండ్‌లైన్, మొబైల్ నంబర్ల ద్వారా ఈ నెంబర్లకి కాల్ చేసుకోవచ్చు. ఈ రెండు నెంబర్లు టోల్ ఫ్రీ నంబర్లు. వీటికి ఫోన్ చేయడం ద్వారా బ్యాంకు మీకు ఐదు రకాల సేవలు అందిస్తుంది. మీరు సర్వీస్ ఖాతాలో 24×7 బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఏటీఎమ్ కార్డ్ రిక్వెస్ట్‌ను బ్లాక్ చేసినట్లయితే డిస్పాచ్ స్టేటస్, చెక్ బుక్ డెస్పాచ్ స్టేటస్ , సేవింగ్స్‌పై వడ్డీ, TDS సమాచారంతో పాటు బ్లాక్ చేయబడిన గత ఐదు లావాదేవీల వివరాలను తెలుసుకోవచ్చు.