కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసి అవి తామే చేసినట్టు సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఇటివల రాష్ట్ర పర్యాటనకు వచ్చిన కేంద్ర మంత్రి విమర్శించారు. దేశంలో చిట్టచివరి వ్యక్తి కనీస అవసరాలను తీర్చడంతో పాటు సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అన్న లక్ష్యంతో, కుల, మత, ప్రాంత బేధం లేకుండా అట్టడుగు స్థాయిలో ఉన్న చిట్టచివరి వ్యక్తి కనీసావాసాలను తీర్చడంతో పాటు, ఉపాధి, మెరుగైన సామాజిక, ఆర్థిక జీవన విధానాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోంది. మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించడానికి రూ.1618 కోట్లను ఖర్చు పెట్టి, చాలామటుకు సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం. కానీ చేసుకున్న ఒప్పందం ప్రకారం నీటి కోసం కనీసం 10 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక ఏళ్లకేళ్లు కాలయాపన చేయడంతో, ఎయిమ్స్‌లోని కొన్ని భవనాలు ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. అతి తక్కువ ధరలో అత్యున్నత వైద్యచికిత్సను ప్రజలకు అందించే ఎయిమ్స్ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. ఏప్రిల్ 2016లో ప్రారంభించిన ఈ–నాం పథకం 21 రాష్ట్రాల్లో అమలవుతూ, 1000 వ్యవసాయ మండీలలో ఒక కోటి 76 లక్షల రైతులు, 2 లక్షల 24 వేల కొనుగోలుదారులు, 2179 ఎఫ్‌పివోలు నమోదయ్యాయి. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులను కొనుగోలుదారులకు అనుసంధానం చేస్తోంది ఈ పోర్టల్. ఆంధ్రప్రదేశ్‌లోని 33 మండీలలో ఈ–నాం ఉన్నప్పటికీ, చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు, దళారుల కారణంగా పూర్తి స్థాయిలో దీని ప్రయోజనాలు రైతులు పొందలేకపోతున్నారు. కొవిడ్ సంక్షోభంలో దేశప్రజలు క్షుద్బాధను అనుభవించకూడదని భావించి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా 80 కోట్ల మందికి ప్రతి నెలా ఐదు కిలోల బియ్యం/గోధుమలు అందించింది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం. మన రాష్ట్రంలో ప్రతీ నెలా ఒక లక్ష మెట్రిక్ టన్నులకు పైగా అందించింది కేంద్రం. నీ, ఒక్కటంటే ఒక్క రేషన్ షాప్‌లో కనీసం పథకం పేరు కానీ, ప్రధానమంత్రి ఫోటో కానీ లేకుండా కేవలం ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు, స్టిక్కర్లు పెట్టుకున్నారు. ఈ విషయంపై కేంద్రం రాష్ట్రాలను ఆదేశించినప్పటికీ మార్పు లేదు. సొమ్ము ఒకరిది సోకు ఇంకొకరిది అన్న చందాన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తుంది.
