ప్రత్యేకంగా రెండు వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే ఇలా శిక్షణ ఎందుకు – బీజేపీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీ శాఖ, మైనారిటీ కార్పోరేషన్ తీరు ఎలా ఉందంటే అన్నం నేను పెడతాను కూర నువ్వు తెచ్చుకో.. చాయ్ నేను పెడతాను పాలు నువ్వు తెచ్చుకో అనేలా ఉంది. మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే డ్రోన్ శిక్షణ పెద్దగా ప్రయోజనం కలిగించేలా లేకపోగా సర్టిఫికెట్ కోసం వారు భారీగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చే పరిస్థితి నెలకొంది. మైనార్టీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవులు, ముస్లింలు చెందిన పిల్లలకు మాత్రమే ఉచిత శిక్షణ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులకు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో వందేసి మందికి చొప్పున 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం కొంతమంది నిపుణులను రప్పించి వారితో ఫీజులు చెల్లించి వారితో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తుంది. ఈ 45 రోజులూ విద్యార్థులు బస, భోజనం వంటివి సొంతంగానే ఏర్పాటుచేసుకోవాలి. మైనారిటీ వర్గాలు అంటేనే వారి ఆర్థిక స్థోమత అంతంతమాత్రం. వారిలో ఎక్కువ మంది నిరుపేదలే ఉంటారు. మరి వాళ్ళు వేరే జిల్లాల్లో 45 రోజులు నివాసం ఉంటూ శిక్షణ పొందడం అంటే వారికి తలకు మించిన భారమే అవుతుంది. అయినా సరే ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం లేదు. ఇక వీరికి శిక్షణ అనంతరం బెంగళూరులో ఉపాధి చూపిస్తాం అంటున్న ప్రభుత్వం వారి శిక్షణకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఇప్పించే విషయంలో తమకు బాధ్యత లేదు అంటోంది.
మైనారిటీ విద్యార్థులపై సర్టిఫికెట్ భారం
వాస్తవానికి డ్రోన్ శిక్షణ పొందినంత మాత్రాన అందరూ డ్రోన్లు ఎగరేస్తాం అంటే కుదరదు. ప్రభుత్వం ఒప్పుకోదు. కేంద్ర పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) వారి నుంచి సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే ఈ డ్రోన్లు వినియోగించవచ్చు ఆపరేట్ చేయవచ్చు. ఈ సర్టిఫికెట్ కోసం దాదాపు రూ.65 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ సర్టిఫికెట్ లేకుండానే కొన్ని సంస్థలు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తాయి కానీ సర్టిఫికెట్ ఉన్నవారికి అనంత విలువ, గౌరవం, జీతభత్యాలు వీళ్లకు ఉండవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తమవద్ద శిక్షణ పొందిన విద్యార్థులను డీజీసీఏ వారు నిర్వహించే ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలకు పంపి సర్టిఫికెట్స్ కూడా వచ్చేలా చేయకుండా కేవలం ట్రైనింగ్ ఇచ్చి పంపేయడం వల్ల ఏమి లాభం అన్న సందేహాలు వ్యక్తమవుతున్నయి. ఈ సర్టిఫికెట్ పొందాలంటే ఈ పేద, నిరుపేద విద్యార్థులు దాదాపు 65 వేలు చేతి సొమ్ములు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ఆ చేసేదేదో సంపూర్ణంగా చేయకుండా శిక్షణ ఇచ్చి వదిలేయడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఓ అధికారి మాట్లాడుతూ తాము సమగ్రమైన శిక్షణ ఇస్తామని, వాటితో అభ్యర్థులు డ్రోన్స్ ఆపరేట్ చేసుకోవచ్చని, అయితే సర్టిఫికెట్ కావాలంటే డీజీసీఏ వారి పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించాలని దీనికి ఫీజు దాదాపు రూ.65 వేలు అవుతుందన్నారు. ఇది అభ్యర్థులే భరించాలని స్పష్టం చేశారు.
మైనార్టీ యువతకు సువర్ణావకాశం : ఉపముఖ్య మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా
డ్రోన్ పైలట్ విభాగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకుని స్వయం అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో కడప నగరపాలక సంస్థ పరిధిలోని మున్సిపల్ ఉర్దూ స్కూల్‌లో మైనార్టీ సంక్షేమశాఖ, సిఇడిఎం ఆధ్వర్యంలో డ్రోన్ పైలట్ ఉచిత శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ప్రస్తు తం మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక యుగంలో డ్రోన్‌ల వినియోగం శర వేగంగా విస్తరిస్తోందన్నారు. ఇటీవల పెద్ద, పెద్ద వేడుకలు, సమా వేశాల్లో డ్రోన్‌ల ఆధారంగా కెమెరా లతో ఫొటోలు చిత్రీకరించడం చూస్తున్నామన్నారు.
వ్యవసాయం, ల్యాండ్ సర్వేయింగ్, మైనింగ్, కీలకమైన రక్షణ రంగం వంటి అనేక రంగాల్లో డ్రోన్‌ల ఉపయోగం, డ్రోన్ పైలెట్ అనలిస్ట్‌ల అవసరం ఎక్కు వగా ఉంటోందన్నారు. ఇందులో భాగం గా పేద కుటుం బాల నుంచి వచ్చిన మైనార్టీ నిరుద్యో గ యువ తకు పైలెట్ ప్రాజెక్ట్ కింద మన జిల్లాలో మొదటిసారిగా డ్రోన్ పైలట్ ఉచిత శిక్షణా తరగతులను డ్రోన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి నేత త్వంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంద న్నారు. వీటి శిక్షణ కోసం బెంగ ళూర్, హైదరాబాద్ వంటి నగరాలకు నిరుద్యోగ యువత ఎంతో వ్యయ ప్రయాసలతో కోర్చి దాదాపుగా రూ.50 వేల వెచ్చించి కోచిం గ్ తీసుకు ంటున్నారన్నారు. మైనార్టీ నిరుద్యోగ యువతకు ద ష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ పైలట్ కోర్సులను 45 రోజుల్లో ఉచి తంగా నేర్పించి, సర్టిఫికేట్‌తో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందన్నారు. డ్రోన్స్ వినియోగంలో టెక్నిషియన్స్ కొరత ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నిరుద్యోగుల యువతకు స్కిల్ డెవల ప్‌మెం ట్ కింద డ్రోన్ ఉచిత ట్రైనింగ్ తరగతులను నిర్వహి స్తామన్నారు.
ప్రతి విద్యార్థికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలి – బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి
ప్రభుత్వ వనరులపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉంటాయి, అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా రెండు వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే ఇలా శిక్షణ ఎందుకు ఇస్తున్నారు ? అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
ఇది మతపరమైన ఆలోచనలకు దారితీయవచ్చు, ఆంధ్ర ప్రభుత్వం భావితరాల విద్యార్థులతో చాలా నీచ రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము విద్యకు వ్యతిరేకం కాదు, ఉద్యోగాల శిక్షణకు వ్యతిరేకం కాదు, అయితే ఈ శిక్షణ మైనారిటీల కోసం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర మైనారిటీలను, ఇతర వెనుకబడినవర్గాల వారి శిక్షణ ప్రయోజనాల కోసం ఎందుకు పరిగణించకూడదు ? ప్రతి విద్యార్థికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలన్నారు..
Everyone has the equal rights on the resources then why @AndhraPradeshCM has specifically kept training only for students of 2 communities?
It could lead to communal tensions, Andhra gvt is doing very dirty politics with our students. They should take back this decision. pic.twitter.com/gguL3v2lmd
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 22, 2022
డ్రోన్ పైలెట్ శిక్షణ అవ్వడం ఎలా..
దేశీయ అవసరాలకు భవిష్యత్‌లో డ్రోన్ పైలెట్‌లు చాలా ముఖ్యం. దాదాపుగా కొన్నేళ్లేలో డ్రోన్ వ్యవస్థ రూ.30,000 కోట్లకు పైగా పరిశ్రమగా రూపుదిద్దుకొంటుందని అంచనా ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా డ్రోన్ పైలట్లకు శిక్షణనిచ్చేందుకు 2025 నాటికి సుమారు 150 స్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నారని అంచన . దేశీయ అవసరాలకు భవిష్యత్‌లో డ్రోన్ పైలెట్ (Drone Pilot) లు చాలా ముఖ్యం. దాదాపుగా కొన్నేళ్లేలో డ్రోన్ వ్యవస్థ రూ. 30,000 కోట్లకు పైగా పరిశ్రమగా రూపుదిద్దుకొంటుందని అంచనా ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా డ్రోన్ పైలట్లకు శిక్షణనిచ్చేందుకు 2025 నాటికి సుమారు 150 స్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డ్రోన్ డెస్టినేషన్ సీఈవో చిరాగ్ శర్మ తెలిపారు. ఇందుకోసం యూనివర్సిటీలు, వ్యవసాయ రంగ సంస్థలు, పోలీస్ అకాడమీలతో చేతులు కలపనున్నట్లు వివరించారు. దేశంలో తొలి రిమోట్ పైలట్ ట్రైనింగ్ సంస్థగా డ్రోన్ డెస్టినేషన్ .. అనుమతులు పొందింది. ప్రస్తుతం ఆరు స్కూల్స్ (Schools) ను నిర్వహిస్తోంది. త్వరలో కోయంబత్తూర్, మదురైలో మరో రెండు ప్రారంభించనున్నట్లు శర్మ పేర్కొన్నారు.
ముందుగా డ్రోన్ లైసెన్స్ పొందాలి. మీరు మరింత ముందుకు వెళ్లడానికి ముందు, భారతదేశంలోని డ్రోన్‌ల వర్గాలను మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే లైసెన్స్ దానిపై ఆధారపడి ఉంటుంది. నానో డ్రోన్లు, వాణిజ్యేతర ఉపయోగం కోసం మైక్రో డ్రోన్లను ఆపరేట్ చేయడానికి పైలట్ లైసెన్స్ అవసరం లేదు. కానీ ఇతర రకాల డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ వర్గంలో ఏదైనా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ద్వారా అధికారం పొందిన సంస్థ నుంచి లైసెన్స్ మరియు శిక్షణ పొందాలి. నోటిఫై చేయబడిన నిబంధనల ప్రకారం, అన్ని డ్రోన్ శిక్షణ, పరీక్షలు అధీకృత డ్రోన్ పాఠశాలచే నిర్వహించబడతాయి.