– కొండ ప్రాంత మంచినీటి సమస్యను అధిగమించేందుకు నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కృషి
– గతంలో 5 ఏళ్లలో వున్న ప్రజాప్రతినిదులు అభివృద్ధిని గాలికి వదిలేసి కాలక్షేపం చేశారు
– ప్రజలకు నేరుగా పరిపాలన అందించేందుకు వాలంటరీ వ్యవస్థ
– చంద్రబాబు నిర్వహించిన మహానాడు తొడలు కొట్టడానికే పరిమితమైంది– జగనన్నను విమర్శించే అర్హత, హక్కు చంద్రబాబుకు లేదు
– చంద్రబాబు హయాంలో దోచుకోవడం పంచుకోవడం తప్ప అభివృద్ది సూన్యం
– బుద్దా వెంకన్న ఒక జోకర్ పెద్ద బఫూన్
– బుద్దా వెంకన్న ఎమ్మెల్సీగా వుండి 6 ఏళ్లు ఇంట్లో నిద్రపోయాడు – వెలంపల్లి
46వ డివిజన్ లోని 144వ సచివాలయం పరిధిలో 43వ రోజు సోమవారం గడపగడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని సెవెంత్ డే చర్చ్ వీధి, రామారావు వీధి, దేవయ్య వీధి, ఏసురత్నం వీధి, గురుస్వామి వీధి, తదితర ప్రాంతాల్లో పర్యటించి గడపగడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వపరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ ప్రాంతం అంతా కొండా ప్రాంతం కావడంతో కొంత మంచినీటి సమస్య వుంది దానిని అధిగమించేందుకు నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కృషి చేయటం జరుగుతుందన్నారు. కొంత మెట్ల మార్గం సమస్య వుంది దానిని కూడా అభివృద్ది పరిచేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇక్కడ గతంలో ఈ ప్రాంతంలో టీడీపీ కార్పొరేటర్ వున్న సమయంలో కాస్తాంత సిమెంట్ కూడా వేసిన చరిత్ర కూడా లేదన్నారు.నేడు మా హయాంలో ఈ డివిజన్ పరిధిలో పార్కు, దోబిఖానను, కొండా ప్రాంతంలో మెట్ల అభివృద్ది ఇంకా అనేక ప్రాంతాల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గతంలో 5 ఏళ్ల కాలంలో వున్న ప్రజాప్రతినిదులు అభివృద్ధిని గాలికి వదిలేసి కాలక్షేపం చేశారన్నారు. గత 42 రోజుల నుండి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.గత ప్రభుత్వాలు చేయలేని సాహసం మా జగనన్న ప్రభుత్వం హయాంలో ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుందన్నారు. ప్రజలకు నేరుగా పరిపాలన అందించేందుకు వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగందన్నారు. చంద్రబాబు నిర్వహించిన మహానాడు తొడలు కొట్టడానికే పరిమితమైందన్నారు. పేద ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.జగనన్న వచ్చాకా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. జగనన్నను విమర్శించే అర్హత హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు హయాంలో దోచుకోవడం పంచుకోవడం తప్ప అభివృద్ది సున్యం అన్నారు. పవన్ కళ్యాణ్ కి గత చంద్రబాబు హయాంలో జనవాణి గుర్తురాలేదా అని ప్రశ్నించారు. పవన్ ప్రచారం కోసమే జనవాణి కార్యక్రమం అన్నారు. జగన్ మోహన్ రెడ్డి విమర్శించే స్థాయి అర్హత పవన్ కళ్యాణ్ కి లేదన్నారు. పవన్ చేతగాని వాడు కాబట్టే రెండు చోట్ల విడిపోయడన్నారు. పవన్ కి దమ్ము ధైర్యం సింగిల్ గా పోటీ చేయాలని సవాలు విసిరారు.పనికిమాలిన పవన్ కళ్యాణ్ కి ప్రజా సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బుద్దా వెంకన్న ఒక జోకర్ పెద్ద బఫూన్ అన్నారు. మా ప్లీనరీ విజయవంతం అయిందని తట్టుకోలేక కళ్ళు వున్న కబోదులు మాటలు సరికాదన్నారు.బుద్దా వెంకన్నకు బుద్ది లేదు ఎమ్మెల్సీ గా వుండి ఇంట్లో నిద్రపోయాడన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాయన నరేంద్ర, వెన్నం రజీని, కర్నాటి రాంబాబు, గంటిగంపు వెంకట్, జలసూత్రం శ్రీను, వీర్ల ప్రసాద్, మస్తాన్ రావు, రెడ్డి, వీర్లా చందు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చేర్మెన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులూ, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటరీస్, నగరపాలక సంస్థ, రెవిన్యూ అధికారులు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.