ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది.మరింత పారదర్శకంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్లో చెల్లింపులు జరిగే చూడాలన్నారు. ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా ఈ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, దాని కింద కార్యక్రమాలు, వైద్య ఆరోగ్యశాఖలో నాడు – నేడు కింద చేపడుతున్న పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై సీఎం సమీక్షించారు.
సమీక్షలో ముఖ్యాంశాలు..
ఏ తరహా ప్రసవం జరిగినా తల్లికి రూ.5వేలు, ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5వేలు ఇవ్వాలని సీఎం ఆదేశం. సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్ జరిగినా రూ.5వేలు. గతంలో సిజేరియన్ జరిగితే రూ.3వేలే, దీన్ని రూ.5వేలకు పెంచాలన్న ముఖ్యమంత్రి.
– సహజ ప్రసవం అయినా, సిజరేయన్ అయినా తల్లిబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి, ఒకే మొత్తాన్ని ఇవ్వాలి, సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ,సహజ ప్రసవంపై అవగాహన, చైతన్యం నింపాల్సిన బాధ్యత వైద్యులదే
ఆరోగ్య శ్రీ పరిధిలో మరిన్ని వైద్య చికిత్సలు:
– ఆరోగ్య శ్రీపై సీఎం సమీక్ష.
– ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చును వివరించిన అధికారులు.
– ఆరోగ్యశ్రీలో 2446 ప్రొసీజర్లు కవర్ అవుతున్నాయని తెలిపిన అధికారులు:
– దీనిపై నిరంతర అధ్యయనం చేయాలి, అవసరాల మేరకు, మరింత మంచి చేయడానికి ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం ఆదేశం.
– ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించామన్న అధికారులు.
– వైద్యులు, వైద్య సంఘాలతో చర్చిస్తున్నామన్న అధికారులు.
– వారంరోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం ఆదేశం.
– నెలకు ఆరోగ్య శ్రీ కింద కనీసంగా రూ.270 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న అధికారులు.
– 104,108 కోసం నెలకు కనీసంగా రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న అధికారులు.
– ఆరోగ్య ఆసరా కింద నెలకు కనీసంగా రూ.35 కోట్లు ఖర్చుచేస్తున్నామన్న అధికారులు.
– అంటే కేవలం ఆరోగ్యశ్రీ, దానికింద కార్యకలాపాలకోసం ఏడాదికి దాదాపు రూ.4వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలిపిన అధికారులు.
– గత ఏడాది ఆయుష్మాన్‌భారత్ కింద వచ్చింది రూ.223 కోట్లు అని వెల్లడించిన అధికారులు.
– ఈ ఏడాది రూ.360 కోట్లు ఇస్తామని అంచనాగా చెప్పారన్న అధికారులు.
మరింత పారదర్శకంగా ఆరోగ్య శ్రీ పథకం:
– నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్లో చెల్లింపు:
– ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా ఈ ప్రక్రియ.
–ముందుగా పేషెంటు డిశ్చార్జి అయ్యే సమయంలో కన్సెంటు ఫారం స్వీకరణ:
– పేషెంటు, బ్యాంకు, ఆస్పత్రి మధ్య కన్సెంటుతో కూడిన ఫారం:
– ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం.
– ఈ విధానంలో చాలావరకు పొరపాట్లను నివారించే అవకాశం ఉంటుంది:
–రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపైనా సీఎం సమీక్ష
– కోవిడ్ పరిస్థితులన్నీ పూర్తిగా నియంత్రణలో ఉన్నాయన్న అధికారులు.
– అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం.
– రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌పైనా సీఎం సమీక్ష.
– 18 సంవత్సరాల్లోపు వారికి కూడా రెండుడోసులు దాదాపుగా పూర్తి.
– 15 నుంచి 17 ఏళ్లలోపు వారికి 99.65శాతం వ్యాక్సినేషన్ పూర్తి.
– 12 నుంచి 14 ఏళ్లలోపు వారికి 97.78శాతం వ్యాక్సినేషన్ పూర్తి.
నిర్దేశించుకున్న సమయంలోగా పనులు :
– విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, కొత్త ఆస్పత్రుల నిర్మాణం, వీటిలో అభివృద్ధి పనులు నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం.
– విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్‌లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని, కొత్తవాటి నిర్మాణం కూడా పూర్తవుతోందని చెప్పిన అధికారుల.
– పీహెచ్‌సీల్లో 977 సెంటర్లలో అభివృద్ధిపనులు పూర్తయ్యాయని, కొత్తవాటి నిర్మాణం చురుగ్గా సాగుతోందన్న అధికారులు.
–కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం సమీక్ష.
– రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు.
– విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నంలలో కొత్త మెడికల్ కాలేజీల్లో 2023 నుంచి మెడికల్ ప్రవేశాలకోసం కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.
– మెడికల్‌కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం చేయాల్సిన పనులు వేగంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు.
– ఇక్కడ డిసెంబర్‌నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
– మిగిలిన చోట్ల కూడా నిర్మాణాలు వేగవంతం చేయాలన్న సీఎం.
– ఒకటి రెండు చోట్ల స్థలాలపై కోర్టు కేసులున్నాయన్న అధికారులు.
వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నంచేయాలన్న సీఎం.
క్యాన్సర్ కేర్‌పై ప్రభుత్వం దృష్టి:
– భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.
– 2020లో ఏపీలో 34వేల మంది క్యాన్సర్ కారణంగా మృతి.
– ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల చాలా మంది మరణిస్తున్నారన్న అధికారులు.
– చివరిదశలో గుర్తించి, చికిత్సకోసం భారీగా ఖర్చు చేస్తున్నారని అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుందని తెలిపిన అధికారులు.
– విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్ గుర్తింపుపై దృష్టిపెట్టాలి : సీఎం
– అందుకోసం విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, పీహెచ్‌సీలను వీలైనంత త్వరగా పూర్తిచేసుకోవాలి.
– డిసెంబర్ కల్లా వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోండి.
– ఇవి పూర్తయితే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం సమర్థవంతంగా అమలు జరుగుతుంది, క్యాన్సర్ గుర్తింపు అన్నది సులభంగా జరుగుతుంది:
– ఈలోగా సిబ్బందికి క్యాన్సర్ స్క్రీనింగ్‌పై శిక్షణ ఇప్పించాలి.
– దీనివల్ల క్యాన్సర్ గుర్తింపు నుంచి చికిత్స వరకూ సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పడుతుంది
– టాటా మెమోరియల్ ద్వారా రాష్ట్రంలో వైద్య సిబ్బందికి, వైద్యులకు శిక్షణకు ఎంఓయూ కుదిరిందన్న అధికారులు:
– దీంతోపాటు స్విమ్స్ ఆస్పత్రిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలన్న సీఎం.
– కొత్తగా ఏర్పాటు చేసే 16 మెడికల్‌కాలేజీలతో కలిపి 27 మెడికల్‌కాలేజీల్లో కూడా క్యాన్సర్ నివారణకు రెండేసి చొప్పున లైనాక్ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్.
– ఇందులో మూడు కాలేజీల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు నిర్ణయం, విశాఖ, తిరుపతి, గుంటూరులో క్యాన్సర్ నివారణపై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పెట్టాలని ప్రతిపాదన.
– పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధంచేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం ఆదేశం. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.