“మా అన్నయ్య నాగబాబు, మా వదిన పద్మజ, వాళ్లబ్బాయి, ప్రముఖ హీరో వరుణ్ తేజ్, వాళ్ల పాప నీహారిక, మా అక్క, ప్రముఖ టీవీ కార్యక్రమాల నిర్మాత మాధవి గారు, మా బావ డాక్టర్ రాజు గారు, మా అక్క విజయదర్గ, ఆమె ఇద్దరు పిల్లలు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్… వీళ్లందరూ కౌలు రైతుల కుటుంబాలకు ఆపన్నహస్తం అందించేందుకు కలిసికట్టుగా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నేను జనసేనలో ఉన్నప్పటికీ మా ఇంట్లో వరుణ్ తేజ్ కానీ, సాయితేజ్ కానీ, వైష్ణవ్ కానీ, నీహారిక కానీ రాజకీయాల పట్ల తటస్థంగా ఉంటారు. నేను బాగా పనిచేయాలని, గెలవాలని కోరుకుంటారు. వీళ్లంతా కూడా వ్యక్తిగతంగా ఏవో సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే టీవీల్లో, ఇతర మీడియాలో వీళ్లు కౌలు రైతుల పరిస్థితి చూసి కదిలిపోయారు. మొట్టమొదటిసారిగా కలిసికట్టుగా ముందుకొచ్చి జనసేనకు విరాళాలు అందించారు” అని వివరించారు.