రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా 4 రాష్ట్రాల్లో 16 సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా.. అందులో 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 16 సీట్లను ఎన్నికలు జరిగాయి
నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 8 స్థానాలను బీజేపీ దక్కించుకోగా.. ఐదు కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, స్వతంత్రులు ఒక్కో సీటును కైవసం చేసుకున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మూడు సీట్లను దక్కించుకోగా.. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌సీపీ నేతలు, ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. దీంతో అక్కడ బీజేపీ మూడో సీటును గెలిచి షాకిచ్చింది. శివసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు.
కర్ణాటక, రాజస్థాన్‌ల నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎనిమిది మంది అభ్యర్థుల్లో… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నేత జైరాం రమేష్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఉన్నారు. కాగా, మహారాష్ట్ర, హర్యానాలో పార్టీల మధ్య పరస్పరఆరోపణలతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. రాజస్థాన్‌లో బిజెపి ఎమ్మెల్యే ఒకరు పార్టీ నుంచి మారడంతో ఇబ్బందిని ఎదుర్కొన్నప్పటికీ, జెడి(ఎస్) ఎమ్మెల్యే , స్వతంత్ర శాసనసభ్యుడు క్రాస్ ఓటింగ్ చేయడం వల్ల మూడవ అభ్యర్థి గెలుపొందడంతో కర్ణాటకలో దాని జూదం ఫలించింది. కర్నాటకలోని నాలుగు స్థానాల్లో బిజెపి మూడు స్థానాలను గెలుచుకుంది. ఇదిలావుండగా కాంగ్రెస్ రాజస్థాన్‌లో క్రాస్ ఓటింగ్ , బేరసారాల భయాల మధ్య ముగ్గురు పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంది.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో పార్టీల అంచనాలు తలకిందులయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తమకు బలం లేని దగ్గర కూడా గెలిచి నిలిచింది. సాధారణ ఎన్నికల్లాగే ఈసారి రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠను రేపాయి. మొత్తం 16 స్థానాలకు గానూ 8స్థానాలను బీజేపీ దక్కించుకోగా కాంగ్రెస్ -5, శివసేన, ఎన్సీపీ,ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించాయి. ప్రధానంగా హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనకు గట్టి షాక్ ఇచ్చింది బీజేపీ. హర్యానాలో కాంగ్రెస్ తరుపున బరిలో నిలిచిన అజయ్ మాకెన్ ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ ఒకస్థానంలో గెలిపొందగా..మరో స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి కైవసం చేసుకున్నాడు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాము ఓటేసిన బ్యాలెట్లను బహిరంగంగా ప్రదర్శించారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
మహారాష్ట్రలో శివసేన్ సర్కార్ షాక్
మహారాష్ట్రలో శివసేన కూటమి బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు సీట్లను బీజేపీ గెలుచుకోగా మూడు అధికార కూటమికి దక్కాయి. ఇక్కడ ఆరవ స్థానం కోసం శివసేన బీజేపీ మధ్య గట్టి పోటీ నడిచింది. అయితే ఆ స్థానాన్ని అనూహ్యంగా కమలం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ నుంచి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మాహాదిక్ గెలిపొందగా..మహా వికాస్ అగాఢీ కూటమి నుండి సంజయ్ రౌత్, ప్రపుల్ పటేల్,ఇమ్రాన్ ప్రతాప్ గర్హి గెలిపొందారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్..కర్ణాటకలో బీజేపీ
ఇక కర్ణాటకలో బీజేపీ తరుపున నిర్మల సీతారామన్, నటుడు జగ్గేష్, పారిశ్రామికవేత్త లెహర్ సింగ్ సిరోయ్ విజయం సాధించగా..కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్ ఎన్నికయ్యారు. ఇక్కడ బలం లేకున్న బీజేపీ, జేడీఎస్ వేర్వేరు అభ్యర్థులను నిలపగా దానిని బీజేపీ క్యాష్ చేసుకుని విన్ అయింది. ఇక రాజస్థాన్ లో కాంగ్రెస్ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు,రణదీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారి గెలిపొందగా..బీజేపీ నుంచి ఘనశ్యామ్ తివారీ విజయం సాధించారు. అయితే బీజేపీ మద్ధతుతో బరిలోకి దిగిన జీగ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ఓడిపోయారు.
తాజా ఎన్నికలతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తున్నందన.. రాజ్యసభ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. రాజ్యసభలో ఈ మధ్యే 100 మార్కును దాటిన బీజేపీకి కూడా కొన్ని స్థానాలు తగ్గి.. వందలోపే పరిమితమవుతుంది. యూపీలో ఒకప్పుడు అధికారంలో ఉన్న బీఎస్పీ.. పెద్దల సభలో ఒకే ఒక్క సీటుకు పరిమితం కానుంది.