వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ బిజినెస్ లో వైసీపీ ప్రభుత్వం కారణంగా దారుణంగా మోసపోయినట్లు కనిపిస్తోంది. దీంతో కొంత కాలం నుంచి వైసీపీ నుంచి అంటీముట్టనట్టుగా ఉంటున్నారు మాగుంట. ఢిల్లీ మద్యం ఎక్సయిజ్ విధానంలో కొన్ని జిమ్మిక్కులు జరిగాయనే నెపంతో అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణకు ఆదేశించారు. ఈ మద్యం విధానంలో జరిగిన అవకతవకల కారణంగా సిబిఐ రంగంలోకి దిగి అక్కడి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిసోడియాతో పాటు మాగుంట పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. అసలు విషయానికి వస్తే ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి డిస్టిల్లరీలు ఉన్నాయి. ఢిల్లీలో మాగుంట ఆగ్రోఫామ్స్ పేరుతో కంపెనీ కూడా ఉంది. ఇక ఢిల్లీలో తన కంపెనీకి అక్కడి మద్యం విధానంలో భాగంగా కాంట్రాక్ట్స్ ని సొంతం చేసుకున్నారు. ఐతే ఈయన కంపెనీ మాత్రమే కాకుండా ఇంకొన్ని కంపెనీలు కూడా కాంట్రాక్టు పొందాయి. ఐతే ఈ కంపెనీల్లో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు మాగుంట పరిస్థితి చూస్తుంటే అడకత్తెరలో పోక చెక్కల మారిపోయింది. ఒక్కసారి ఈ కంపెనీలకు సంబంధించి విచారణ పేరుతో భయపెట్టి అతన్ని తమ పార్టీలోకి లాగాలని బీజేపీ చూస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం ఆయన పార్టీ మారే సూచనలే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఐతే ఇప్పుడు మాగుంట వైసీపీలో ఏమంత యాక్టీవ్గా ఉన్నట్లు కనిపించడం లేదని పార్టీ మిగతావాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఆయన బిజినెస్ లను జగన్ దెబ్బతీశారని అక్కసు కూడా ఉంది. అందులోనూ పార్టీలో ఆధిపత్య పోరుతో తనకు పెద్దగా గుర్తింపు కూడా రాలేదనే బాధ కూడా మనసులో ఉంది. దీంతో ఆయన టీడీపీలోకి కానీ, అటు బీజేపీలోకి కానీ వెళ్లే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఐతే ఇప్పుడు ఈ టైంలో మాగుంటకు కావాలనే చిక్కులు తీసుకొచ్చి ఆయన మీద ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారా..లేకపోతె మాగుంట మీద సానుభూతి తీసుకొచ్చే ప్రయత్నమా అనే విషయం తెలియదు. ఇక నిన్నటి విషయం చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం పై ఆ పార్టీ కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ప్రభుత్వ స్ట్రాటజీలో భాగమా…ఇదంతా పొలిటికల్ డ్రామా అనే విషయం తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.