దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. థర్డ్ వేవ్ తర్వాత భారీగా తగ్గిన కేసులు, మరణాలతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం, విద్యార్థులకు ఈ నెల 18 నుంచి ప్రారంభమైన ఎన్‌సీసీ క్యాంప్ ఎన్‌సీసీ క్యాంప్‌లో మొత్తం 317 మంది విద్యార్థులు ఉన్నారు.. ఇందులో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం. దీంతో లక్షణాలున్న విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచిన అధికారులు, 40 మంది విద్యార్థులు రిజల్ట్స్ వచ్చాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి క్యాంపు కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.. కరోనా కట్టడికి ప్రత్యేకంగా చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కోరుతున్నారు.
అన్ని జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జిల్లా కలెక్టర్లు పరిధిలో అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఇందులో వాణిజ్య, వ్యాపార, ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలన్నారు. అన్ని హోటల్స్, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థల్లో, సోషల్ మీడియా ద్వారా, వివిధ రకాల పోటీలు, మత సంస్థల్లో కరోనా నియంత్రణపై పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించాలని, గ్రామ, పట్టణ, మండల స్థాయిలో క్యాండిల్ ర్యాలీ లు నిర్వహించి కరోనా నివారణకు ప్రజలను చైతన్య పరచాలన్నారు.
గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో 1,985 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్ లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 11,542గా ఉంది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 186.54 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.