ఏపీ పర్యటనలో భాగంగా ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి భారతీ పవార్. మంగళగిరిలో ఏర్పాటుచేసిన ఎయిమ్సును సందర్శించిన కేంద్ర మంత్రి భారతీ పవార్.. మంగళగిరి ఎయిమ్స్ ను కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు ముచ్చెటమలు పట్టించారు. ఆమె ఎయిమ్స్ లోని అవుట్ పేషెంట్ విభాగం నుంచి పరీక్షల చేసే విభాగాల వరకూ నిశితంగా పరిశీలించారు. అక్కడ ఉన్న రోగులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. దక్షిణాదిన ఏర్పాటు చేేసిన ఎయిమ్స్ లో అధికారుల నిర్లక్ష్యం కనపిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. రోగుల నుంచి అన్ని వివరాలను తెలుసుకున్న కేంద్ర మంత్రి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అక్కడ అందుతోన్న సేవలపై రోగుల నుంచి ఆరా తీశారు. మందులు అందుతున్నాయా..? లేదా అంటూ రోగుల బంధువులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి పవార్.
కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ మంగళగిరి ఎయిమ్స్ ని సందర్శించారు. ఓపీ మొదలుకుని ఆస్పత్రిలో అందుతోన్న ప్రతి ఒక్క సేవ పైనా ఎయిమ్స్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పవార్. దీంతో నీళ్లు నమిలారు ఎయిమ్స్ అధికారులు. ఆస్పత్రికి నీటి సమస్య ఉందని.. టెండర్లు రావడం లేదన్నారు అధికారులు.
ఇంత పెద్ద భవనాలు కట్టడానికి టెండర్లు వచ్చినప్పుడు.. నీటి సరఫరా కోసం టెండర్లు ఎందుకు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లారా అంటూ ప్రశ్నించారు పవార్. సీఎం ఈ సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారని అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. వెంట పడి పని చేయించుకోవాలి కదా అంటూ కేంద్ర మంత్రి చురకలు అంటించారు. AIIMS లో ఖాళీలను భర్తీ చేయాల్సిన అంశాన్ని ప్రస్తావించారు అధికారులు.
దీనిపై ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. ఓపీ సరిగా చూడడం లేదన్న ఫిర్యాదులపై అధికారులను వివరణ అడిగారు కేంద్ర మంత్రి. మీరు చేయలేకపోతున్నారని.. ప్రతి రోజూ నన్నే ఓ గంట పాటు ఓపీ చూడమంటారా..? అంటూ కేంద్ర మంత్రి పవార్ సీరియస్ అయ్యారు. ల్యాబ్ రిపోర్టులు ఎంత సేపట్లో అందిస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి.
గంటలో అందిస్తున్నట్టు వెల్లడించిన అధికారులు. తనకొచ్చిన సమాచారం ప్రకారం ఓ రోజు పడుతోందని.. రిపోర్టులు వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. వేల కోట్ల రూపాయలతో నిధులందించినా ఆస్పత్రి నిర్వహణ ఇలా చేస్తారా..? అంటూ అధికారులపై మండిపడ్డారు కేంద్రమంత్రి భారతీ పవార్. ప్రధాని మోడీ ఒక్కరే పని చేస్తే సరిపోదని.. అందరూ పని చేయాలన్నారు కేంద్ర మంత్రి పవార్.
జనరిక్ మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా..? లేవా..? అంటూ ఆరా తీశారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు గురించి కేంద్ర మంత్రి అడిగారు. అయితే, ఆయుష్మాన్ భారత్ పథకం గురించి అవగాహన లేదన్నారు రోగుల బంధువులు. ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించిన బోర్డులను ఆస్పత్రి ఆవరణలో డిస్ ప్లే చేయాలని మంత్రి పవార్ ఆదేశించారు.
దక్షిణాదిన మొదటి ఎయిమ్స్ మంగళగిరిలోనే ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి సిబ్బంది రోగులకు చక్కటి సేవలు అందిస్తున్నారు. ఐపీడీ బ్లాక్సును కొన్ని నెలలు పూర్తి చేయనున్నాం. ఎయిమ్స్‌ను మరింత అభివృద్ది చేపట్టనున్నాం. ట్రామా సేవలను అందించేందుకు కృషి చేస్తాం. మంగళగిరి ఎయిమ్స్ కి ఎక్కువగా తెలుగు వారే వస్తారన్నారు కేంద్ర మంత్రి భారతీ పవార్. వారికి భాషాపరమైన ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎయుమ్స్ ఆస్పత్రికున్న నీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం. ప్రస్తుతం యూజీ తరగతులు జరుగుతున్నాయి.. త్వరలోనే పీజీ క్లాసులు ప్రారంభించేలా చర్యలు చేపడతాం అన్నారు