Connect with us

Hi, what are you looking for?

Andhra News

మెరుగైన ఫలితాల కోసం పరీక్షలను రెండు టర్మ్‌లుగా విభజించిన CBSE బోర్డు

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 – 2022 లో విద్యార్థులు పరీక్షల్లో మంచి స్కోర్ చేసేందుకు అకాడమిక్ సెషన్ ని రెండు టర్మ్స్ గా విభజించింది సీబీఎస్ఈ బోర్డు…

Share

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 – 2022 లో విద్యార్థులు పరీక్షల్లో మంచి స్కోర్ చేసేందుకు అకాడమిక్ సెషన్ ని రెండు టర్మ్స్ గా విభజించింది సీబీఎస్ఈ బోర్డు. రెండో టర్మ్‌ పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని, ఆన్‌లైన్‌ పద్ధతి ఉండదని స్పష్టం చేసింది. కరోనా టైములో పరీక్షలు నిర్వహించిన సమయంలో మార్కులు వేయడం పెద్ద సమస్యగా మారింది. దీంతో ఏటా పరీక్షలను రెండు టర్మ్‌లుగా నిర్వహించాలని నిర్ణయించారు. తొలి టర్మ్‌ పరీక్షలు పూర్తయ్యాయి కూడా. పరీక్షలను ఇలా రెండు విభాగాలుగా చేసి నిర్వహిస్తే సిలబస్ కూడా త్వరగా కవర్ చేసే అవకాశం ఉంటుందని, ఉపాధ్యాయులకు పెద్ద సమస్య కూడా ఉండదు అని పలువురు సీబీఎస్ఈ స్కూల్ టీచర్స్ తమ అభిప్రాయాలను తెలిపారు. ఇలా పరీక్షల విభజన చేయడం వలన విద్యార్థులు సబ్జక్ట్స్ ని చక్కగా రివిజన్ చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుందన్నారు. ఇక ఇప్పుడు 10 మరియు 12 తరగతులకు సంబంధించిన 2022 పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మొత్తం 92.7 శాతం మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించగా, 10వ తరగతి పరీక్షలో 94.40 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.12వ తరగతిలో 1,34,797 మంది విద్యార్థులు 95 శాతానికిపైగా, 33,432 మంది 90 శాతానికిపైగా మార్కులు సాధించారు. 10వ తరగతిలో 64,908 మంది అభ్యర్థులు 95 శాతానికిపైగా స్కోరు సాధించగా, 2,36,993 మంది 90 శాతానికి పైగా స్కోరు సాధించారు.

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Su Kaçak Tespiti Nasıl Yapılır Beşiktaş su kaçak tespiti Beşiktaş su kaçak tespiti yapan Uzman, kalorifer borularında meydana gelen su kaçaklarını iki farklı yöntemle...

Lingual Support by India Fascinates