శ్రీకాకుళం జిల్లా సోంపేట రూరల్ బారువలో జగన్నాథ రథయాత్రకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ ఏటా యాత్రను ఘనంగా నిర్వహిస్తుంటారు. గత రెండేళ్లుగా కొవిడ్‌తో నిర్వహించలేదు. ఈ ఏడాది అన్నిచోట్ల రథయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ బారువలో మాత్రం ఎటువంటి ఏర్పాట్లు జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అసలు యాత్ర నిర్వహిస్తారా? లేదా? అన్నది స్పష్టతలేదు. మరోవైపు రథయాత్ర సమయం సమీపిస్తోంది. మరో మూడురోజుల వ్యవధి మాత్రమే ఉంది. నుంచే రథయాత్ర ప్రారంభం కానుంది. కానీ ఇంతవరకూ రథం సిద్ధం చేయలేదు. ఆరుబయట అలానే విడిచిపెట్టేశారు. దీంతో యాత్ర నిర్వహణపై నీలినీడలు కమ్ము కుంటున్నాయి. మరోవైపు యాత్రలో కీలకమైన గుండిచా మందిరం నిర్మాణ పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. రథయాత్ర నాటికి మందిరం పనులు జరుగుతాయా లేదా? అన్న అనుమానం కలుగు తోంది. దీనిపై దేవదాయశాఖ మేనేజర్ రామారావు ’ ప్రస్తావించగా.. రథయాత్ర పూజలు కొనసాగుతాయని చెప్పారు. రథం బాగుచేసేందుకు పనివారు దొరకలేదన్నారు. అందుకే నిరూప యోగంగా ఉందని పేర్కొన్నారు. గత రెండేళ్లు మాదిరిగా తొమ్మిది రోజుల పాటు పూజలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
జగన్నాథ రథయాత్రకు
ఒడిశాలో ఉన్న నాలుగు ప్రధాన ధాములలో పూరీ ధామ్ ఒకటి. దీనిని మోక్ష ప్రదాత అని కూడా అంటారు. విష్ణువు అవతారమైన జగన్నాథుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ప్రతి సంవత్సరం జగన్నాథ్ పూరిలో రథయాత్ర జరుగుతుంది, ఇది ఒడిశాలోనే కాకుండా భారతదేశం, విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. పూరీలో జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా సాగుతుంది. దీనిని రథోత్సవం అని కూడా అంటారు. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. జూలై 1వ తేదీ శుక్రవారం నుంచి ఒరిస్సాలో జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం ఆషాఢ మాసం, శుక్ల పక్షం రెండవ రోజు నుంచి ప్రారంభమవుతుంది. రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి సుభద్ర మూడు వేర్వేరు రథాలపై ఊరేగుతారు. ఆషాఢ శుక్ల దశమి నాడు, ఈ మూడు రథాలు తిరిగి ప్రధాన ఆలయం దగ్గరకు చేరుకుంటాయి. ఈ రథయాత్రలో ఉపయోగించే రథాలు చాలా ప్రత్యేకమైన రీతిలో రూపొందించారు. రథం తయారీలో ఎలాంటి లోహాన్ని వినియోగించరు.ఈ మూడు రథాలను పవిత్రమైన చెక్కతో తయారు చేస్తారు. రథాల తయారీకి శుభప్రదమైన చెట్లను వినియోగిస్తారు.వసంత పంచమి నుండి రథాలకు సంబంధించిన కలప ఎంపిక జరుగుతుంది. కలపను సేకరించాక అక్షయ తృతీయ నుండి రథాల తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.జగన్నాథుని రథంలో మొత్తం 16 చక్రాలు ఉంటాయి. జగన్నాథుని రథం ఎరుపు, పసుపు రంగులో ఉంటుంది. మిగిలిన రెండు రథాల కంటే ఈ రథం కొంచెం పెద్దదిగా ఉంటుంది.
జగన్నాథుని రథం వెనుక బలభద్ర, సుభద్రల రథాలు ఉంటాయి. జగన్నాథుని రథంపై హనుమంతుడు, నరసింహుని చిహ్నాలు కనిపిస్తాయి.రథయాత్ర సమయంలో, జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు జగన్నాథ ఆలయం నుండి జనక్‌పూర్‌లోని గుండిచా ఆలయానికి చేరుకునే దారిలో నగరాన్ని సందర్శిస్తారు. యాత్ర రెండవ రోజు, రథంపై ఉంచిన జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఆచార వ్యవహారాల ప్రకారం, అత్తవారి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. స్వామివారు ఏడు రోజుల పాటు ఇక్కడే విశ్రమిస్తారు. 8వ రోజు అంటే ఆషాఢ శుక్ల దశమి నాడు రథంపై కూర్చున్న దేవతలతో యాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథాల తిరుగు ప్రయాణాన్ని బహుద యాత్ర అంటారు.జగన్నాథుని రథానికి రక్షకులు గరుడుడు, నరసింహుడు. ఈ రథంలో జయవిజయులు అనే ఇద్దరు ద్వారపాలకులు కూడా ఉంటారు.రథంలోని గుర్రాలు తెల్లగా ఉంటాయి. వాటి పేర్లు శంఖ, బలాహక, శ్వేత హరిదాస్వ. రథాన్ని లాగే తాడును శంఖచూడ్ అంటారు. ఇది పాము పేరు.రథయాత్రలో ఎనిమిది మంది ఋషులు కూడా ఉంటారు. ఈ ఋషులు… నారదుడు, దేవల్, వ్యాసుడు, శుక, పరాశర, విశిష్ట, విశ్వామిత్ర, రుద్రుడు.
రథయాత్ర చూడాలంటే రెండు కళ్లు సరిపోవు
ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే రథోత్సవాన్ని తిలకించేందుకు రెండు కళ్లు చాలవు. రథాయాత్ర సమయంలో ఉత్సవమూర్తులైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులను ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకొచ్చి రత్నపీఠంపై అలంకరిస్తారు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు రథంపై సిద్ధంగా ఉన్న ఉత్సవమూర్తులకు…పూరీ సంస్థానాధీశులు నమస్కరించి…స్వామి ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. అంతరం జగన్నాథ రథచక్రాలు కదులుతాయి.