ఆగష్టు 2 నుండి యువ సంఘర్షణ యాత్ర
భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగష్టు 2 నుండి 15వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువ సంఘర్షణ యాత్ర చేపట్ట బోతొంది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్ అధ్యక్షత వహించారు. ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్, లోగో ను సోము వీర్రాజు ఆవిష్కరించారు.. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. టీచర్స్, పోలీసు విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తాం అన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తాం అని చెప్పారు, అన్ని వర్గాల వారికి నేనున్నా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు.
నేడు వైసీపి ప్రభుత్వం తీరు వల్ల అందరూ నష్ట పోయారు,యువ మోర్చా ఆధ్వర్యంలో నాలుగు జోన్లలో యాత్ర చేపట్టారు, మా పార్టీ పరంగా మేము కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉంది,బైక్ ర్యాలీకి అనుమతి ఇస్తారనే మేము భావిస్తున్నాం.మోడీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు ప్రమేయం లేదు ఆదివాసీల గురించి మాత్రమే మోడీ మాట్లాడారు,ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం సరి కాదు..కొంతమంది సడన్ గా పుట్టుకొచ్చి మేధావులుగా మాట్లాడతారు.అటువంటి వారి మాటలను మేము పట్టించుకోం..
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది మోడీ మంత్రం,ఎపి లొ కొంతమంది కి అధికారమే కావాలి.. అభివృద్ధి అక్కర్లేదు. బిజెపి కి అభివృద్ధి కావాలి.. ప్రత్యామ్నాయ శక్తి గా ఎపిలో ఎదుగుతుంది.ఎపి లో రెండో కోటా రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. పేదల పక్షాన బిజెపి ఉద్యమం చేస్తుంది.విద్య, వైద్యానికి బిజెపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది.
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాంరాష్ట్రం లో జాతీయ రహదారులు బాగున్నా.. రాష్ట్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయి.ఈ రాష్ట్ర రహదారులు నిర్వహణ బాధ్యత యువకులకు అప్పగిస్తాం.మొక్కలు పెంచి..వాటిని సంరక్షించడం ద్వారా నిరుద్యోగ యువతకు అవకాశం ఇస్తాంతెలంగాణ, ఎపి లలో బిజెపి అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తాం .జాతీయ సమావేశాలలో కూడా భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించాం
కేతినేని సురేంద్ర మోహన్ బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఈరోజు బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు.మూడేళ్లల్లో వాటిని అమలు చేయకుండా మోసం చేశారు.బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో యాత్ర చేపడుతున్నాం.నాలుగు జోన్ లలో ఒకే సారి ఈ యాత్ర జరుగుతుంది.మోడీ సాయాలు, జగన్ మోసాలు పై ప్రజలకు వివరిస్తాం.రాష్ట్ర ప్రభుత్వం పై సంఘర్షణకు సిద్దం అవుతున్నాం.ఉద్యోగాలు లేవు, కోట్ల మంది ఆశలు అడియాసలు చేశారు. రాష్ట్రం లో యువత మత్తుకుబానిస అవుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుంది
.ఆగష్టు2న తిరుపతి నుంచి ప్రారంభమై రాయలసీమ లో ఒక యాత్ర.తిరుపతి నుంచే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు , విజయవాడ వైపు మరో ర్యాలీ.మచిలీపట్నం నుంచి ప్రారంభమై ఉభయగోదావరి జిల్లాల మీదుగా రాజమండ్రి వరకు ఉత్తరాంధ్ర లో మరో ర్యాలీ చేపడతాం.అన్ని ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం అన్నారు.
ఆగష్టు15 వరకు ఈ ర్యాలీలు జరుగుతాయి
కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలి.ప్రజలు కూడా ఆలోచన చేయాలి.. అభివృద్ధి చేసే బిజెపి ని ఆదరించాలి. రాయలసీమలో 1900, కోస్తాంధ్ర లో 1700, గోదావరి జిల్లాల్లో1400, ఉత్తరాంధ్రలో 1400 కిమీ,సుమారు7,500కి.మీ ఈ యాత్ర సాగుతుంది.విజయవాడ లోనే ఆగష్టు లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం అన్నారు.