మధ్య యుగాల చరిత్రను దాటుకుని అతి భీకర దహన విధ్వంసాన్ని చేధించుకుని స్వేచ్ఛగా భారతీయ పునాదుల మీద సంప్రదాయాల మీద భారతదేశ చరిత్ర లిఖించబడాలని అఖండ భారత్ స్వేచ్ఛా నినాదాన్ని ప్రజలకు అందించాలని తహతహలాడిన గొప్ప యోధులు గతించిన చరిత్రలో మనకు కొద్దిమంది తారసపడతారు. వారెప్పుడు వెలిగే దివ్వెలు చరిత్ర చీకటిని చీల్చుకుంటూ వారు నిర్మించిన హిందూ రాష్ట్ర జాతీయోద్యమ భావన ప్రజల్లోకి గొప్పగా వెళ్లి నిలబడి పోరాడి పంజా విసిరిన సింహంలా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుందంటే కారణం వారి సైద్ధాంతిక పోరాట పటిమ మరియు స్వేచ్ఛాభారత్ కోసం వారు సూత్రీకరిచిన అభివృద్ధి నినాదం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీ మాతృక ఐన జన సంఘ్ సృష్టికర్త 1952 లో మొదలైన జనసంఘ్ నినాదం భారతీయ హిందూ రాష్ట్ర జాతీయోద్యమ భావన ఇంకా వివరంగా చెప్పాలంటే అఖండ హిందూ భారత్ ఈ మట్టిలో ఉన్న సంప్రదాయాన్ని మేము నిలబెడతాం మా హిందూ ధార్మికతను ఎవరో దయా దాక్షణ్యాల మీద బతికేలా మేము వదలం అని గర్జించిన కొదమ సింహాల ఆలోచనకు పురుడు పోసుకున్నదే హిందూ సైద్ధాంతిక సూత్రీకరణ ఈ నినాదం ఒక సంచలనం అప్పటి వరకు బ్రిటిష్ చరిత్ర కింద లేదా నవాబుల బానిస నీడ కింద సాగిన భారతీయ చీకటి చరిత్రను ఒక్కసారి దులిపి వాటికి వెలుగు రవ్వలు జోడించి సుందర భవిష్యత్ కోసం సూత్రీకరించిన న్యాయబద్ద సిద్ధాంతం ఇది ఇప్పుడు దేదీప్య మానంగా ప్రకాశిస్తుంది దేశం అంతా తన కాషాయ జెండాను రెపరెపలాడిస్తుంది.
భారతీయ జనతా పార్టీ పుట్టుక – సవాళ్లు
జనసంఘ్ మూలనినాదం హిందూ జాతీయోద్యమ భావన, దాని సృష్టికర్త శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ఆలోచనలకు విస్తృత రూపం ఇస్తూ కదిలిన భావజాలం తర్వాత ఎన్నో ఆటుపోట్లకు గురై జనతా పార్టీగా అవతరించి అప్పటి కాంగ్రెస్ పార్టీని గద్దె దించే ప్రయత్నంలో విజయం సాధించి మొరార్జీ దేశాయ్ ను తోలి కాంగ్రెస్సేతర ప్రధాన మంత్రిగా ఏర్పాటు చేసుకున్నా అది ఎంతో కాలం మనుగడ లో ఉండలేకపోయింది. దీంతో 1980 ఏప్రిల్ 6 న జనసంఘ్ ముఖ్య నాయకులైన లాల్ కిషన్ అద్వానీ వాజపేయి నాయకత్వం లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి పూర్తి స్థాయి అఖండ హిందూ రాష్ట్ర నినాదంతో హైందవ మూలాలతో పార్టీ ప్రజల్లోకి వెళ్లి తన ఉనికిని నిలబెట్టుకుంది ఐతే 1984 ఇందిరాగాంధీ హత్యానంతరం వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకుంది కేవలం రెండు సీట్లు మాత్రమే బీజేపీకి రావటం జరిగింది . తదనంతరం 1988 ఎన్నికల్లో జనతా దళ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా తర్వాత మద్దతు ఉపసంహరణ చేయటం ప్రభుత్వం పడిపోవటం అన్ని జరిగిపోయాయి ఇలా తన ఉనికి కోసం 1991 నుండి 1996 వరకు పోరాటం సాగించింది. ఐతే 1996 వచ్చే సరికి తన ఉనికిని కొంత మెరుగు పరుచుకొని అతి పెద్ద రాజకీయ పక్షంగా 120 సీట్లతో కొనసాగింది 1998 లో ఎన్డీయే కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన అన్నా డిఎంకే అధ్యక్షురాలు తన మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది తదనంతరం 1999 లో ఎన్డీయే కూటమికి 303 స్థానాలు రాగా ఒక్క బీజేపీకి 183 స్థానాలు వచ్చాయి. పోక్రాన్ లో అణు పరీక్షలు జరిపి దేశ సార్వభౌమత్వానికి పెద్ద పీట వేశారు కార్గిల్ విజయం ప్రసార భారతి బిల్ తమ విజయాలుగా బీజేపీ ఇప్పటికి చెప్పుకుంటుంది తదనంతరం 2004 లో ఓటమి చవిచూసింది. ఐతే మొత్తంగా చూస్తే1999 నుండి 2004 వరకు బీజేపీ వివిధ పార్టీల సహాయం తో ప్రభుత్వాన్ని నడిపింది. తదనంతరం 2014 వరకు ప్రతిపక్ష పాత్ర పోషించింది 2014 లో నరేంద్రమోడీ నాయకత్వంలో 543 స్థానాలకు గాను 281 స్థానాలు బీజేపీ మిత్రపక్షాలు గెలుచుకొని కేంద్రం లో ప్రభుత్వాన్ని నడిపారు తదనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల్లో ౩౦౩ స్థానాలు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు – హిందూ బహుజన వాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే 2019 వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో బహుజనులు అండగా నిలబడ్డారు. బీసీ వర్గాల్లో ఉన్న యాదవ, తూర్పు కాపు, రజక, కురుబ, మత్స్యకార, ముస్లిం వర్గాలు పూర్తిగా వైసీపీ వెంట నడిచాయి. అదేవిధంగా ఓసీల్లో కాపులు, వైశ్య బ్రాహ్మణ, క్షత్రియులు కూడా వైసీపీ వెంట చాలా వరకు నడిచారు. సంక్షేమ నినాదం మరియు బీసీ ల మీద కాపు కులాల మీద కేంద్రీకరించి పని చేసిన విధానంతో మంచి ఫలితాలు రాబట్టారు ఐతే హామీలలో లోపాలు ధరల పెరుగుదల విద్యుత్ చార్జీల పెంపు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. సరిగ్గా బీజేపీ తన దృష్టిని ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కాష్ చేసుకోవాలని చూస్తున్నా కొంత వోటింగ్ పార్టీ కార్యక్రమాలు తక్కువ వున్న నేపథ్యంలో సభ్యత్వం ఆందోళన ప్రచారం మీద తన ద్రుష్టి సారించింది. ఏది ఏమైనా వివిధ వర్గాలుగా విడివిడిగా ఉన్న బహుజనుల్లో ఐక్యత ను సృష్టిస్తే అందునా హిందు బహుజన వాదాన్ని వారి మధ్య హిందు జాతీయ స్ఫూర్తిని తీసుకురాగలిగితే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయటం పెద్ద కష్టం ఏమి కాదు ఇప్పటికే వరుసగా ఆ పార్టీ అగ్ర నేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముందుముందు బీజేపీ తన అస్తిత్వాన్ని ఇక్కడ నిలుపుకుంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు కూడా బీజేపీని కలుపుకొనిపోవాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఏదో రోజు ఇక్కడ పాగా వేస్తుందనటంలో సందేహం లేదు.