ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆర్కిటెక్ట్ కంపెనీ నార్మన్ అండ్ ఫోస్టర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ డిజైన్స్ చేసి ఇచ్చినా దానికి సంబందించిన బకాయిలు ఇంత వరకు చెల్లించలేదని ఈ పిటీషన్ లో పేర్కొంది. రావాల్సిన బిల్లులను మధ్యవర్తిత్వం ద్వారా ఇప్పించాలని కోరుతూ నార్మన్ అండ్ ఫాస్టర్ కంపెనీ వేసిన పిటీషన్ ని సుప్రీమ్ కోర్ట్ విచారణకు స్వీకరించింది. రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గత ప్రభుత్వం అమరావతి డిజైన్లను రూపొందించడానికి ఇంటర్నేషనల్ కంపెనీలను సంప్రదించినప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీ లండన్ కి చెందిన నార్మన్ అండ్ ఫోస్టర్స్ వారు ఈ డీల్ కి ఓకే చెప్పి అమరావతికి ఒక రూపు తీసుకొస్తామని చెప్పింది.
చెప్పినట్టుగానే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ సముదాయానికి సంబందించిన డిజైన్స్ ని అందించింది. దీంతో పాటు గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ప్రధాన భవనమైన సెక్రటేరియట్ కాంప్లెక్స్ డిజైన్స్ ని అందించే బిడ్ ని కూడా నార్మన్ కంపెనీ దక్కించుకుంది. నార్మన్ ఫాస్టర్ కంపెనీ డిజైన్స్ చాలా కాస్ట్లీ. డిజైన్స్ చేయించారు కానీ ఒప్పందం ప్రకారం చెల్లింపులను మాత్రం మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు చేయలేదు. ఐతే జగన్ అధికారంలోకి రాగానే అమరావతి విషయాన్ని పక్కన పెట్టేసారు. కాంట్రాక్టర్స్ కి బిల్లులు చెల్లించలేదు. నార్మన్ కంపెనీ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా జగన్ సర్కార్ పట్టించుకోకపోయేసరికి ఎట్టకేలకు సుప్రీమ్ కోర్ట్ లో పిటీషన్ వేసింది. ఇప్పటికే రాష్ట్రము పరువు పోయింది ఇక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో లో ఏపీ పరువు పోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
