విశాఖపట్నం : అఖండ సూపర్ హిట్ తో జోష్ మీద ఉన్న బాలకృష్ణ ఇంకో ప్రాజెక్టును పట్టాలెక్కించారు. జూన్ 10వ తేదీ తన పుట్టినరోజు కాగా ఆయన అభిమానులకు ఒకరోజు ముందుగానే హుషారు తెప్పించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఖరారుకాని ఆ సినిమా #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. జూన్ 10న బాలకృష్ణ జన్మదినం సందర్భంగా చిత్ర బృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.
నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.. భయం నా బ్లడ్ లోనే లేదురా..బోసడికే.. నరకడం మొదలెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలక్కూడా తెలీదు నా కొడకల్లారా అంటూ బాలకృష్ణ గర్జించిన డైలాగ్స్ అప్పుడే యూట్యూబ్ ను ఊపేస్తున్నాయ్.. టీజర్ రిలీజ్ అయిన రెండు గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
ఇందులోని బాలకృష్ణ ఆహార్యం, ఆయన చెప్పిన సంభాషణలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. పులిచర్ల నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచార చిత్రాన్ని చూస్తుంటే అర్థమవుతోంది. బాలకృష్ణ అభిమానులు ఆశించే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉండేలా డైరెక్టర్ గోపిచంద్ ప్లాన్ చేశారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ, కూర్పు: నవీన్ నూలి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, పోరాటాలు: రామ్‌లక్ష్మణ్, ప్రొడక్షన్‌డిజైన్: ఎ.ఎస్. ప్రకాశ్.