మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న జి.ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వై.సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ డి.రమేష్ మూడు బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుల బెయిల్ పిటిషన్లను గతంలోనే తిరస్కరించారని, ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడం సబబు కాదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. బెయిల్ జారీలో పిటిషనర్ కస్టడీ కాలం, నేరం చేసిన తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలి. వ్యక్తిగత స్వేచ్ఛ అమూల్యమైన హక్కు అయినప్పటికీ, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
న్యాయమూర్తులపై పోస్టులు: మాజీ ఎమ్మెల్యేను సీబీఐ ప్రశ్నించనుంది
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను విచారించబోతున్నట్లు సీబీఐ హైకోర్టుకు తెలియజేసింది. తనపై సీబీఐ వేసిన కేసును కొట్టివేయాలని ఆమంచి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.
న్యాయమూర్తులపై పోస్టులు : మాజీ ఎమ్మెల్యేను సీబీఐ ప్రశ్నించనుంది
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను విచారించబోతున్నట్లు సీబీఐ హైకోర్టుకు తెలియజేసింది. తనపై సీబీఐ వేసిన కేసును కొట్టివేయాలని ఆమంచి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఆగస్టు 5న సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆమంచికి నోటీసులు అందజేశామని సీబీఐ తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్ .హరినాథ్ జస్టిస్ ఎన్ .జయసూర్యకు తెలియజేశారు. తదుపరి విచారణను జడ్జ్ ఆగస్టు 8 కి వాయిదా వేశారు.