మహాపురుషులు ఎన్టీఆర్ కుమార్తె మరణించి ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్న పరిస్థితుల్లో ఎంతటి విరోధులైనా ఒక్క నిమిషం బాధపడుతారు,కానీ విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతిలు మాత్రం మానవత్వం లేకుండా నీచంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు.
నిజాలు మాట్లాడటాన్ని విజయసాయిరెడ్డి ఎప్పుడో మర్చిపోయారు. 16 నెలలు జైల్లో ఉన్న ఆయన అబద్ధాలు చెప్పడానికే పనికొస్తాడు,వేల కోట్లు ఆస్తులు పోగేసుకున్నావుగా విజయసాయిరెడ్డీ..ఇంకా ఎందుకు ఇలాంటి నీచాలకు పాల్పడుతున్నావ్ అని అన్నారు.
అప్పుడేమో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంటి పెరట్లో ఉందని కూశావ్..అసలు డైమండే లేదని నీ ధర్మారెడ్డే చెప్పాడు..ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి, పులివెందులలో మీ జగన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డిని నరికి నరికి చంపారు. మొదట హార్ట్ అటాక్ అని నువ్వే వీధి నాటకమేశావ్..ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంపించాడని పచ్చి అబద్ధాలు మాట్లాడావ్,ఇప్పుడేమో ఆ హత్య కేసు మీద అసలు సీఐబీ విచారణే వద్దని జగన్ రెడ్డే చెప్పుకుంటున్నాడు..ఆయన చెల్లెలు సునీత ఏమో సీబీఐ కావాలని డిమాండ్ చేస్తోంది,అసలు సమాజంలో ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారా..అనే బుద్ధి కూడా మీకు లేదా
మీలో ఒకరు ఇంకో కూత కూడా కూశారు..ఎన్టీఆర్ కుమార్తె మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని,మీకు దమ్ముంటే సీబీఐ ఎంక్వయిరీ వేయించుకోండి..రోజూ ఢిల్లీకి వెళ్లి అక్కడ కాళ్లు పట్టుకోవడం మీకు అలవాటే కదా..ఇఫ్పుడు కూడా కాళ్లు పట్టుకుని వేయించుకోండి అని తీవ్రంగా స్పందించారు.
చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అడిగితే సీబీఐ విచారణ జరపరనే విషయం జ్ఞానం కూడా మీకు లేదా రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే, కోర్టు మార్గదర్శకాలతోనూ సీబీఐ విచారణకు ఆదేశిస్తారు,లేదంటే కేంద్ర ప్రభుత్వ సంబంధిత అంశమైతే వేస్తారనే విషయకుండా నిత్యం సీబీఐ కోర్టుల చుట్టూ తిరిగే మీకు తెలియకుండా పోయిందా, లక్ష్మీపార్వతీ..అసలు మీరు మహిళేనా..ఒక ఆడపడుచుగా ప్రవర్తిస్తున్నావా…ఎందుకమ్మా ఇలా తయారైనావ్,ఎన్టీఆర్ కుటుంబంలో అడుగుపెట్టకముందు అసలు నీ బతుకేందమ్మా,నీ కొడుకు, నీ కోడలు, వారి పిల్లలు తాము లక్ష్మీపార్వతి కుటుంబసభ్యులమని చెప్పుకునేలా బతుకుమ్మా,మరీ అంత దిగజారిపోవద్దమ్మా..మీరు నిజంగా మనుషులైతే మీరు చెప్పే ఆ సర్వే నంబర్లలో భూములను వెతుక్కొని సీబీఐ విచారణ వేయించుకోండి,మీ ఇద్దరికి కొంచెం మానవత్వమున్నా శోకసంద్రంలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబానికి క్షమాపణ చెప్పండి అని డిమాండ్ చేశారు.