Connect with us

Hi, what are you looking for?

Andhra News

తిరుమలలో ఉద్యోగిపై దాడి : ప్రైవేట్ సిబ్బంది బరితెగింపు

తిరుమలలో అధికార పార్టీ నేతల ప్రైవేటు సిబ్బంది బరితెగిస్తున్నారు. తాము అడిగిన అతిధి గృహాలు కేటాయించకపోతే దాడులకు సైతం తెగబడుతున్నారు. టిటిడి సిబ్బందిపై నేరుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులపై రువాబు చేస్తున్నారు.

Share

తిరుమలలో అధికార పార్టీ నేతల ప్రైవేటు సిబ్బంది బరితెగిస్తున్నారు. తాము అడిగిన అతిధి గృహాలు కేటాయించకపోతే దాడులకు సైతం తెగబడుతున్నారు. టిటిడి సిబ్బందిపై నేరుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులపై రువాబు చేస్తున్నారు. టిటిడి ఈవో ధర్మారెడ్డి కుమారుడి నిశ్చితార్థం ఉండడంతో తిరుమలలోని పద్మావతి సముదాయంలోని అతిధి గృహాలను టిటిడి అధికారులు బ్లాక్ చేశారు. దీంతో పద్మావతి సముదాయంలో గదుల కేటాయింపు కొంతమందికి మాత్రమే పరిమితం చేశారు అధికారులు. సిఫార్సు లేఖలు కలిగిన వారికి ఎంబిసీ 34 లో గదులు కేటాయింపు జరిగింది.

తిరుపతి జిల్లాకు ఓ ఎమ్మెల్యే అనుచ‌రులు ఎంబిసీ-

34 వద్దకు తనకు ఓ అతిధి గృహాన్ని కేటాయించాలని గదుల కేటాయింపులో ఉన్న సీనియర్ అసిస్టెంట్ వెంకటరత్నంను కోరాడు. గదులు ఖాళీ లేవని, ఖాళీ కాగానే తమకు కేటాయిస్తామని బదులు ఇచ్చి వేచి ఉండమని చెప్పాడు. దీంతో దాదాపు గంటన్నర వరకూ ఎమ్మెల్యే ప్ర‌వేట్ సిబ్బంది కేటాయింపు‌ కేంద్రం వద్దే వేచి ఉన్నా అతిధి గృహం కేటాయించలేదు. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ప్ర‌యివేట్‌ సిబ్బంది నవీన్ కుమార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న వెంకటరత్నంతో వాగ్వాదానికి దిగాడు. ఒకరినొక్కరు తీవ్రంగా దూషించుకునే స్ధాయి వరకూ వీరి గొడవ దారి తీసింది. అదే సమయంలో అక్కడ ఉన్న కొందరు టిటిడి సిబ్బంది, భక్తులు ఇరువురిని సముదాయించి అక్కడి నుండి పంపేశారు .

తర్వాత నవీన్ స్ధానికంగా ఉన్న కొందరు వ్యక్తులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.. తన ఎమ్మెల్యేకు అవసరం అయ్యే అతిధి గృహాన్ని కూడా కేటాయించలేరా అంటు ఆగ్రహించిన వారు.. నేరుగా ఎంబిసీ-34 వద్దకు చేరుకుని కార్యాలయం తలుపులు తీయాలంటూ గెట్టిగా కేకలు వేస్తూ గది తలుపులను కాలితో తన్ని హడావుడి చేశారు. దీంతో కార్యాలయంలో‌ నుండి బయటకు వచ్చిన సీనియర్ అసిస్టెంట్ వెంకటరత్నం వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించాడు.. వచ్చిన వారు తిరుమల స్ధానికులు అవడంతో పరిస్థితిని అర్ధం అయ్యేలా వివరించే ప్రయత్నం చేసే లోపే పృద్వీరాజ్ అలియాస్ బబ్లూ అనే యువకుడు ఒక్కసారిగా టిటిడి ఉద్యోగి వెంకటరత్నంపై పిడిగుద్దులు గుద్దాడు. అక్కడ ఉన్న వారు ఎంత ఆపేందుకు ప్రయత్నం చేసిన వారి మాట లెక్క చేయకుండా టిటిడి సిబ్బందిని దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..తనకు ఎటువంటి భయం లేదని టిటిడి అధికారిని హెచ్చరించాడు.. తీవ్ర గాయాల పాలైన వెంకటరత్నం తిరుమల టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్ధలంకు పోలీసులు చేరుకునే‌ లోపే నిందితుడు బబ్లూ ఘడన స్ధలం నుండి పరార్ అయ్యాడు. టిటిడి ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భాధితుడిని అశ్వినీ ఆసుపత్రికి తరలించి బబ్లూని అదుపులోకి తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు..

టిటిడి ఉద్యోగిపై దాడి చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి – నారా లోకేష్

తిరుమల స్ధానికుడిగా ఉంటూ టిటిడి ఉద్యోగిపై దాడి చేయడమే కాకుండా భక్తులను భయాందోళనకు గురి చేసిన బబ్లూపై కఠిన చర్యలు తీసుకోవాలని పొలీసులు అధికారులను టిటిడి ఈవో ఆదేశించినట్లు తెలుస్తొంది. టిటిడి ఉద్యోగిపై దాడిని పలువురు నాయకులు ఖండించారు. తిరుమల పవిత్రతను ఒక పక్కా ప్రణాళికతో వైసీపి ప్రభుత్వం దెబ్బ తీస్తోందని, వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారని నారా లోకేష్ విమర్శించారు.

దాడి గురించి ఉద్యోగి అతని మాటల్లోనే

నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాను. గత రాత్రి తిరుమల ఎంబీసీ-34 నా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు బబ్లూ అనే తిరుమల స్థానికుడు నా పై దడి చేసి నన్ను గాయ పరిచాడు. నా పై దాడి ఘటనను సంబంధిత పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి అతడిని అరెస్టు చేశారు. నేను నా ఫిర్యాదులో ఎక్కడా నా పై తిరుపతి ఎంఎల్ఏ అనుచరుడు దాడి చేసినట్టుగా రాయలేదు. ఇది పూర్తిగా అవాస్తవం.కొందరు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాపై జరిగిన దాడిని వాడుకొంటున్నారు.

ఆ కుటుంబానికి బిజెపి అండగా ఉంటుంది – ప్రకాశ్ రెడ్డి

తిరుమలలోని ఒక సీనియర్ అసిస్టెంట్ పై ఎమ్మెల్యే అనుచరుడు దాడి చేయడాన్ని బిజెపి పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. వెంకటరత్నం అనే సీనియర్ అసిస్టెంట్ ను రూములు లేవని చెప్పినందుకు ఎమ్మెల్యే అనుచరుడైన ఒక వ్యక్తి దాడి చేపి, దూషించడం జరిగింది. ఈ సంఘటన తిరుమలలో ఎంబీసీ కాటేజెస్ వద్ద చోటుచేసుకుంది.

దీనిపై స్పందిస్తూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి దాడికి పాల్పడిన వ్యక్తులు వారి వెనుక ఉన్న వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి నాయకులు రౌడీయిజం పవిత్ర పుణ్యక్షేత్రాల వరకు పాకింది, రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ ల బదులు వైసిపి సెక్షన్లో అమలులో ఉన్నాయి అంటూ విమర్శించారు. పోలీసు లో పూర్తిస్థాయి వైఫల్యమే ఇటువంటి దాడులకు కారణమని ఆయనన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి పార్టీ కార్యకర్తలుగా మారిపోయారని దీని వలన రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడుతుందని విమర్శించారు.

దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఆ వ్యక్తి వెనుక ఉన్న ప్రధాన శక్తులను అదుపులోకి తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటువంటి దాడులు జరగడం దురదృష్టకరమని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే, దాడికి పాల్పడిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి సామాన్య శ్రీనివాస్ వరప్రసాద్, అజయ్ కుమార్, కిరణ్ దాడిలో గాయపడిన టిటిడి ఉద్యోగి వెంకటరత్నంలో ఆయన నివాసం ముందు కలిసి పరామర్శించడం జరిగింది.

 

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Beşiktaş su kaçak tespiti Beşiktaş’ta Su Kaçağı Tespiti ve Onarımı Kameralı Su Kaçağı Tespiti ve Onarımı Beşiktaş’ta su kaçağı tespiti ve onarımı firmamız tarafından...

Lingual Support by India Fascinates