దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తరచుగా వివాదాస్పద పోస్ట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన హీరోయిన్ అర్థ నగ్న ఫోటో షేర్ చేయడంతో పాటు హాట్ కామెంట్ చేశారు. వర్మ ఏదో ఒక వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ ఉంటారు. తరచుగా ఆయన జీవితంలో నిత్యకృత్యం జరిగేదే ఇది. ఇటీవల ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద కామెంట్ పెట్టారు. ద్రౌపది రాష్ట్రపతి అయినప్పుడు పాండవులు ఎవరు? ముఖ్యంగా కౌరవులు ఎవరు? అంటూ వర్మ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై బీజేపీ వర్గాలు, దళిత సంఘాలు మండిపడ్డాయి. వర్మపై పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి.
తాజాగా వర్మ హీరోయిన్ అప్సరా రాణి(Apsara Rani) అర్ధనగ్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. లోదుస్తులు మాత్రమే ధరించి ఉన్న అప్సర హాట్ ఫోజులో నిలుచున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడమే కాకుండా.. ఈమె శరీరంలో అందంగా లేని భాగాన్ని నాకు చెప్పకుండా ఉండగలరా? అంటూ కామెంట్ పెట్టాడు. వర్మ ప్రశ్నకు, అప్సర రాణి ఫోటోపై నెటిజెన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.
ఇక ఇటీవల వర్మ కొండా చిత్రం విడుదల చేశారు. కొండా సురేఖ, మురళి బయోపిక్ గా కొండా చిత్రం తెరకెక్కింది. ఈ మూవీని జనాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. కొండా చిత్రానికి కనీస వసూళ్లు దక్కలేదు. అలాగే విడుదలకు వర్మ మరో మూవీ సిద్ధం చేశారు. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన లడ్కి జులై 15న విడుదల కానుంది. ఇండో చైనీస్ మూవీగా లడ్కీ చైనీస్ భాషలో కూడా విడుదల కానుంది.
https://www.instagram.com/p/CfZIQ7cvPKQ/?utm_source=ig_web_copy_link