మొన్న ఇండియా టుడే.. లేటెస్టుగా టైమ్స్ నౌ.. ఈ రెండూ సర్వేలు చేసి.. మళ్లీ జగన్మోహన్ రెడ్డే గెలుస్తారని రిపోర్టులు ఇచ్చాయి. ఇండియా టుడే 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటారని, టైమ్స్ అయితే 19 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. ప్రస్తుతం వైసీపీకి 23 మంది ఎంపీలు ఉన్నారు. అంటే కాస్త తగ్గడం తప్పితే మొత్తం మీద బలం చెక్కు చెదరలేదనే అనుకోవాలి. ఇఫ్పుడు ఈ సర్వేల మీద హాట్ డిస్కషన్ నడుస్తోంది. దీని మీద రెండు రకాల వాదనలు నడుస్తున్నాయి. ఒకటి ఇవి ప్యాబ్రికేటేడె అని.. సమయం సందర్భం లేకుండా ఇఫ్పుడు సర్వేలు చేయడం ఏంటని.ఇవి వైసీపీ వారు చేయించుకున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.వైసీపీవారు చేయించుకున్న సర్వేల్లోనే ఓడిపోతారని వచ్చిందని చెబుతుంటే ఈ సర్వేలు ఎందుకు ఇలా వచ్చాయనే ప్రశ్న వస్తోంది. మరోవైపు వైసీపీవారు మాత్రం తాము చెబుతున్నది నిజమేనని కాస్త వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే అయినా తమను ఓడించేంత కాదని ప్రజలు సమస్యలపై తమను నిలదీస్తున్నారని అంతేగాని తమ ప్రభుత్వం పడిపోవాలనో తమను ఓఢించాలనో కోరుకోవటం లేదని వాదిస్తున్నారు. అందుకే ఈ సర్వేలు వాస్తవమేనని అవి ట్రెండ్ మాత్రమేనని వాస్తవానికి ఇంకా ఎక్కువే తమకు వస్తాయని వారంటున్నారు.
ఇక ప్రతిపక్షాలు అయితే ఇవి ప్రశాంత్ కిషోర్ హ్యాండ్ తోనే జరిగాయని ఆయన ప్లాన్ ప్రకారమే ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి, వైసీపీ ఓడిపోదు అనేది జనం మైండ్స్ లో రిజిస్టర్ చేయడానికి ఈ సర్వేలు చేయించారని అర్ధమైపోతుందని అంటున్నారు. మరోవైపు కొంతమంది అయితే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బిజెపి పొత్తు కుదుర్చుకుంటాయనే టాక్ ఉంది. ఆ దిశగా చర్చలు నడుస్తున్నాయని అంటున్నారని చెబుతున్నారు. ఆ పొత్తు లేకుండా ఉంటే వచ్చే ఫలితాలు ఇలాగే ఉండొచ్చని కూడా అంటున్నారు.వైసీపీ నేతలు మాత్రం జగనన్న చెప్పింది నిజమేనని తమ పార్టీ మళ్లీ గెలుస్తుందని దుష్టచతుష్టయం కావాలనే ఏదో తాము ఓడిపోతామని ప్రచారం చేస్తుందని,అది అబద్ధమని ఈ సర్వేలు చెబుతున్నాయంటున్నారు. ఇక ప్రతిపక్షాల్లో కూడా ఈ సర్వేలు కలకలం రేపాయి. అంటే తమ ప్రత్యర్ధి జగన్ ని ఓడించడం అంత ఈజీ కాదని తెలుస్తోందని, కాబట్టి వ్యూహం పకడ్బందీగా ఉండాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా పొత్తుల విషయంలో ఎలాంటి ఈగోలకు పోకుండా సర్దుబాటు చేసుకోవాలని ఏ మాత్రం ఈగోకి పోయి విడిపోయినా ఫలితం దారుణంగా ఉంటుందనడానికి ఈ సర్వే రిజల్ట్స్ ఓ ఉదాహరణ అని హెచ్చరిస్తున్నారు.సర్వేలు ఎంతవరకు నిజమో తెలియకపోయినా అధికార పార్టీకి ఫీల్ గుడ్ ఫీలింగ్ రావడానికి, ప్రతిపక్షాలు అలర్ట్ కావడానికి మాత్రం ఇవి ఉపయోగపడుతున్నాయని చెప్పొచ్చు.