ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ 20 టోర్నమెంట్ లోగోను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రీమియర్ టీ-20 లోగోతో పాటు టీ 20 టీజర్‌ను సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు. జూలై 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నం డాక్టర్ వైయస్ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్ నిర్వహించనున్నారు. జూలై 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంను ఆహ్వానించారు.
ఐపీఎల్ తరహాలో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. బీసీసీఐ నుంచి ఏపీఎల్ నిర్వహించేందుకు అనుమతులు పొందినట్టు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, సౌరాష్ట్రకు బీసీసీఐ అనుమతులు ఇచ్చింది. నాలుగో రాష్ట్రంగా ఏపి నిలిచింది.