ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సోమవారం తిరుపతి సందర్శించి ఆ శ్రీనివాసుడి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ శ్రీవారి ఆశీస్సులతో తనకు మంత్రిగా అవకాశం దక్కిందన్నారు. రాష్ట్రమంతా పర్యటించి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. జగనన్న కోరుకున్న విధంగా రాష్ట్రాన్ని పరుగులు తీయించాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడుని దుమ్మెత్తిపోశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి వరద రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికి తెలుసన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం అందించలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేశారన్నారు. ఎన్ని అవరోధాలు, కష్టాలు ఎదురైనా పేద వారి సంక్షేమమే ప్రధమ ధ్యేయంగా జగనన్న పని చేస్తున్నారన్నారు. ప్రజలందరికి వాలంటీర్ల ద్వారా రేషన్ , పాలు, కావాల్సిన వసతులు అందించారన్నారు. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు పోలవరాన్ని పూర్తిచేయలేకపోయారన్నారు. చంద్రబాబు చేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంను మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్ గా చేసుకోలేక పోయావు అన్నారు.
