ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారం ప్రభుత్వం చేతుల్లో ఉంది. గతంలో మద్యం దుకాణాలకు రెండేళ్ల వరకు పర్మిషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటుచేసింది. వేలం పాటల్ని నిలిపేసింది. అయితే అదే సమయంలో బార్లు మాత్రం మూయించలేకపోయింది. వాటిని ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోలేకపోయింది. ఇందు కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ కోర్టుల్లో నిలబడలేదు. ఎందుకంటే బార్లకు ప్రభుత్వం ఐదేళ్లకు లైసెన్స్‌లు ఇస్తుంది. 2017లో చివరి సారిగా లైసెన్స్‌లు ఇచ్చారు. అవి ఈ ఏడాది ముగిసిపోతున్నాయి. ఇప్పుడు కొత్త బార్ పాలసీని ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.
భారీగా లైసెన్స్ ఫీజులు పెంచాలని నిర్ణయం
అయితే మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుందనేది మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠగా మారింది. అయితే ఆర్థిక కష్టాల కారణంగా బార్లను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 840 బార్లు ఉన్నాయి. ఆ సంఖ్యను యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నారు. కానీ ఆదాయం కోసం లైసెన్సు ఫీజులు మాత్రం భారీగా పెంచనున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం మూడు శ్లాబుల్లో 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.10 లక్షలు 50వేలు నుండి 3లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.20 లక్షలు.. 3 లక్షలకు పైగా ఉన్న ప్రాంతాల్లో రూ. 30 లక్షలు.. ఫీజులు ఉన్నాయి.
గతంలోనే కొత్త పాలసీ తెచ్చే ప్రయత్నం చేసి విఫలం
వాటిని ఇప్పుడు వరుసగా రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 50 లక్షలుగా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. కొత్త పాలసీకి నెల రోజులే సమయం ఉన్నందున వారం పది రోజుల్లో బార్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎక్సైజ్ శాఖ రెడీ అవుతోంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఎంపిక విధానం ఉంటాయి. అన్ని బార్లకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు ఇచ్చింది. టీడీపీ కి దగ్గరగా ఉన్న వారందరిని దూరం పెట్టి, 2019 నవంబరులోనే కొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది.
ఎంత కాలానికి పర్మిషన్ ఇస్తారు ?
కానీ తమకు 2022 వరకు గడువు ఉందంటూ బార్ల యాజమాన్యాలు, కోర్టు మెట్లెక్కారు. దీంతో ప్రభుత్వం చేసిన ప్రయత్నం ముందుకు సాగలేదు. ఇప్పుడు పాలసీ గడువు ముగియడంతో అన్ని అస్త్రాలను సిద్దం చేసుకునేందుకు సర్కార్ రెడీ అయ్యింది. ఎన్నికల హామీ ప్రకారం జగన్ ప్రభుత్వం మిగిలిన రెండేళ్లలో మద్యనిషేధం అమలుచేయాల్సి ఉంది. మరి కొత్తగా వచ్చే బార్లకు ఎన్ని సంవత్సరాలు అనుమతులు ఇస్తారనేది ఆసక్తిగా మారింది.
బార్ల సంఖ్య పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో బార్ల సంఖ్య పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త బార్ పాలసీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, జిల్లాలు పెరిగిన బార్ల సంఖ్య పెంచకూడదని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. 840 బార్ల లైసెన్స్‌లు మరో రెండు నెలలు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈలోగా బార్ల లైసెన్స్‌లు పొందేందుకు వేలం, లాటరీ నిర్వహించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 840 బార్లకు మాత్రమే లైసెన్సులు పునరుద్ధరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2022- 23 ఆర్థిక సంవత్సరానికి కొత్త బార్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్ లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. కొత్త పాలసీలో లైసెన్స్ ఫీజుతో పాటు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు సంవత్సరానికి 10 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
లైసెన్స్‌ల గడువు పొడిగింపు
ఏపీలో బార్ లైసెన్సులను మరో రెండు నెలలు పొడిగిస్తూ ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెలాఖరుతో లైసెన్సుల గడువు ముగుస్తుండటంతో వాటి కాలపరిమితిని ఆగస్టు 31 వరకూ పొడిగించారు. ఈ రెండు నెలల కాలానికి ప్రత్యేకంగా నిర్దేశించిన ఫీజులను ఈ నెల 27న చెల్లించాలని, సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రస్తుత లైసెన్సుల గడువు 2 నెలలు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి కొత్త బార్ పాలసీని విడుదల చేసింది. మూడేళ్ళ కాలపరిమితితో కొత్త లైసెన్స్‌లు జారీచేయనున్నట్టు ప్రకటించింది. కొత్త పాలసీలో లైసెన్స్ ఫీజుతో పాటు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీలను ఏడాదికి 10 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. మద్య నియంత్రణ విధానంలో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 840 బార్లకు మాత్రమే లైసెన్సులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న బార్లు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా కొత్త పట్టణాలకు విస్తరించేలా లైసెన్స్‌లను క్రమబద్దీకరిస్తామని పేర్కొన్నది. పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఎన్ని బార్లు ఉండాలో ఆబ్కారీ శాఖ కమిషనర్ నిర్ణయిస్తారని తెలిపింది. లైసెన్స్ పొందిన వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్‌లో 10 కిలోమీటర్లు, మున్సిపాలిటీలో 3 కి.మీ. పరిధిలో ఎక్కడైనా బార్‌ను పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది.
జగన్ మద్య నిషేధ హామీ విషయంలో వెనక్కి తగ్గినట్లే
మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్‌కే పరిమితం చేసి ఎన్నికలకు వెళ్తాం. ఇదే మా శపథం అని.. తెగ చాలెంజ్‌లు చేసిన వైసీపీ పెద్దలు ఇప్పుడు ప్రజల్ని వెక్కిరిస్తున్నారు. మూడేళ్లకు బార్ లైసెన్స్‌లు ఇస్తామని గెజిట్ రిలీజ్ చేశారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ మూడేళ్లకు బార్ పాలసీ ఇస్తున్నారు. అంటే స్టార్ హోటళ్లకే కాదు రొటీన్ బార్లు కూడా ఉంటాయన్నమాట. మరి ఎన్నికలకు వెళ్తారో లేదో తెలియదు కానీ బార్ల పై మత్రం రూ. కోట్లకు కోట్లు ఫీజులు వసూలు చేసేందుకు రేట్లు ఫిక్స్ చేశారు.
ఇప్పుడు బార్లకు కూడా మూడేళ్ల బార్ పాలసీని ప్రకటించడంతో సీఎం జగన్ మద్య నిషేధ హామీ విషయంలో వెనక్కి తగ్గినట్లే. త్రీ స్టార్ హోటల్స్‌కు విడిగా ధరలు నిర్ణయించారు. రూ. ఐదు లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు బార్లు పెట్టాలనుకునే అన్ని త్రీ స్టార్ హోటల్స్ కట్టాలి. ఆ పైన జనాభాను బట్టి రూ. 15 నుంచి 50 లక్షలు ఏడాదికోసారి చెల్లించాలి. మొత్తంగా 840 బార్లకు అనుమతి ఇస్తారు. అంటే… ఇప్పుడు ఉన్న బార్లన్నీ ఉంటాయన్నమాట అలాగే ప్రతీ ఏడాది పది శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్తారు. ఇటీవల మద్యం బాండ్లపై రూ. ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చుకున్నప్పుడు పాక్షికంగా కూడా మద్య నిషేధం చేయబోమని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.