ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు కలిశారు. రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ దంపతులను.. సతీసమేతంగా సీఎం జగన్ కలిశారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్, సతీమణి వైఎస్ భారతిరెడ్డికి.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. ఆపై సీఎం జగన్ సతీసమేతంగా గవర్నర్ దంపతులను సత్కరించారు. ఆపై దాదాపు గంట సేపు గవర్నర్, సీఎం జగన్ ఏకాంతంగా సమావేశం అయ్యారు.
ఈ భేటీలో సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి.. సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వివరించినట్లు సమాచారం.
కోనసీమ జిల్లా ఘటనలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సహా పలువురు ప్రజా సంఘాల నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అమలాపురం అల్లర్ల విషయంలో గవర్నర్‌కు పలు వర్గాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను తగులబెట్టారని.. కోనసీమ ఆందోళనలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు తెలుస్తోంది. అలాగే, కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును కొనసాగించాలా లేదా అనే అంశంపైనా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. అమరావతిలో రూ.40 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో టీటీడీ నిర్మించిన, ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా గవర్నర్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆ సందర్భంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పలు కీలక బిల్లులపైనా గవర్నర్‌తో సీఎం జగన్ చర్చించారు.
Biswa Bhusan Harichandan @BiswabhusanHC
Andhra Pradesh Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy along with his wife Smt. Y.S. Bharathi Reddy, called on me and Lady Governor Smt. Suprava Harichandan at Raj Bhavan on Monday on a courtesy visit.
@AndhraPradeshCM @ysjagan
20 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
సీఎం.. గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. కీలకమైన బిల్లుల ప్రాధాన్యాన్ని గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీ నుంచి వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి శాసనసభ నిర్వహణ తేదీలు, సహా సభలో పెట్టే పలు కీలక బిల్లులపై గవర్నర్‌తో సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కోన రఘుపతి రాజీనామా చేయనున్నారు. ఈ స్థానంలో కోలగట్ల వీరభద్ర స్వామిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికపైనా గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు తెలిసింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, తాజా రాజకీయ పరిణామాలపైనా గవర్నర్‌తో సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం.