గుంటూరు జిల్లా మంగళగిరిలో పేదలకు రూ.2కే భోజనం పెట్టేందుకు తెదేపా నాయకులు ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్‌ను నగరపాలకసంస్థ అధికారులు ధ్వంసం చేశారు. కొత్త బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్, డాక్టర్ ఎం.ఎస్.ఎస్.కోటేశ్వరరావుల విగ్రహాల వద్ద తెదేపా నాయకులు క్యాంటీన్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని దీనిని ఏర్పాటు చేస్తున్నామని నాయకులు చెప్పారు.
మంగళగిరిలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో వివాదం చెలరేగుతోంది. తొలగించిన చోటే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తున్న టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు మంగళగిరి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు రూ.2 భోజనం పెడతామని టీడీపీ నేతలు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
లక్షమందితో ఛలో మంగళగిరి
అన్నా క్యాంటీన్ ఏర్పాటుకి అంగీకరించేది లేదని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు, అన్న క్యాంటీన్ ఏర్పాటుకి అడ్డు తగిలితే భారీగా ఉద్యమించాలని టీడీపీ నిర్ణయించింది. త్వరలోనే లక్ష మందితో అన్న క్యాంటీన్ – ఛలో మంగళగిరి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
అన్న క్యాంటీన్‌ను రెండుసార్లు ధ్వంసం
పేదలకు రూ.2 కే అన్నం పెట్టే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్‌ను మున్సిపాలిటీ అధికారులు జూన్ 9 ధ్వంసం చేశారు. కొత్త బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్, డాక్టర్ ఎం.ఎస్.ఎస్.కోటేశ్వరరావుల విగ్రహాల సమీపంలో క్యాంటీన్ ఏర్పాట్లు చేసుకున్నారు. నేడు ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా దీనిని ఏర్పాటు చేస్తున్నామని టీడీపీ చెప్పారు. ఇదే ప్రదేశంలో చలివేంద్రం ఏర్పాటు చేసి కొన్ని నెలలుగా ఫ్రీగా మజ్జిగ, తాగునీరు జనాలకు ఇస్తున్నారు. గతంలో ఉన్న ప్లాట్‌ఫారంపైనే క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని, మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఏర్పాట్లను తొలగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తు్నారు.
మళ్లీ తిరిగి క్యాంటీన్ ఏర్పాటు చేయగా.. రాత్రి సమయంలో మళ్లీ భారీ సంఖ్యలో పోలీసులు, అధికారులు వచ్చి నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ నేతలు అక్కడికి చేరుకొని అన్న క్యాంటీన్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అన్న క్యాంటీన్లను మూసివేసింది. అప్పట్లో ఈ వ్యవహారంపై టీడీపీ పెద్ద రాద్ధాంతమే చేసింది. అయితే ఇటీవల మహానాడు సందర్భంగా అక్కడక్కడా అన్న క్యాంటీన్లను తెరిచి టీడీపీ హడావిడి చేసింది. ఎన్నారై ఫండ్స్ తో ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో కూడా ఇలాంటి హడావిడే చేశారు టీడీపీ నేతలు. బహిరంగ ప్రదేశంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఈ ఏర్పాటు చేశారు. అయితే అనుమతులు లేవంటూ కార్పొరేషన్ అధికారులు అన్న క్యాంటీన్ ఏర్పాటుని అడ్డుకున్నారు. దీంతో అక్కడ గొడవ మొదలైంది.
పార్టీ ఆఫీస్ లో పెట్టుకోలేరా..? వైసీపీ సలహా
పార్టీ తరపున క్యాంటీన్ పెట్టాలనుకుంటే.. టీడీపీ ఆఫీస్ లోనే అన్న క్యాంటీన్లు తెరవాలని, జిల్లాల్లో కూడా అదే పని చేయాలని సలహా ఇస్తున్నారు వైసీపీ నేతలు. కేవలం ప్రభుత్వంపై నిందలు వేయాలనే ఉద్దేశంతోటే.. నాలుగు రోడ్ల కూడలిలో క్యాంటీన్ పెట్టాలనుకోవడం సరికాదంటున్నారు. మంగళగిరిలో అన్న క్యాంటీన్ ఏర్పాటుపై రెండుసార్లు వాదోపవాదాలు జరిగాయి.
తాత్కాలిక నిర్మాణాలను కార్పొరేషన్ అధికారులు రెండుసార్లు తొలగించారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన గుంటూరు పార్లమెంటు తెదేపా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు నాయకులను డీఎస్పీ జె.రాంబాబు ఆధ్వర్యంలో అదనపు బలగాల సాయంతో అరెస్టు చేసి పెదకాకాని, తాడేపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నిరసనకు దిగారు. పేదలకు భోజనం పెట్టనివ్వకుండా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని నాయకులు విమర్శించారు.మంగళగిరి అన్న క్యాంటీన్ ఏర్పాటు వివాదాలకు కేంద్ర బిందువైంది. మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవకు కారణమైంది.
తాడేపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన..
ఎస్సీ మహిళ అని కూడా చూడకుండా పోలీసులు కొట్టారని తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో అన్న క్యాంటీన్ ఏర్పాట్ల ధ్వంసానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన శిరీషతో పాటు మరో మహిళను పోలీసులు తాడేపల్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. దీంతో తెదేపా కార్యకర్తలు స్టేషన్ వద్దకు వచ్చి ఆమెకు మద్దతుగా నిలిచారు. పోలీసులు, ఎమ్మెల్యే, సీఎంలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.శిరీష పోలీసు వ్యాన్ దిగడానికి నిరాకరించి తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు.. ఎందుకు కొట్టాల్సి వచ్చిందో చెప్పాలని పోలీసులను నిలదీశారు. దీంతో 41వ నోటీసు ఇచ్చి పంపుతామని పోలీసులు వివరించగా.. అదుపులోకి తీసుకున్న చోటే ఎందుకు నోటీసు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొంతసేపు వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె పోలీసు వ్యాన్ దిగి స్టేషన్‌లోకి వెళ్లారు. ఆందోళనలో తాడేపల్లి పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ రాంబాబు మాట్లాడుతూ
అన్నా క్యాంటిన్ నిర్మాణం చట్ట విరుద్ధమని మున్సిపల్ అధికారులు తెలిపారు. ముందస్తు అనుమతి తీసుకొని ఏర్పాటు చేస్తే మాకు అభ్యంతరం లేదు. నగరంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశాం.