Connect with us

Hi, what are you looking for?

Opinion

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం – సవాళ్లు

పారిశ్రామీకరణ అంటే ప్రజలు వ్యవసాయం నుండి ఉత్పాదకత శక్తిని పెంచటంకోసం పరిశ్రమల  వైపు మళ్ళటం వస్తువులను ఉత్పత్తి చేసి తద్వారా జాతీయోత్పత్తిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటం మరొకరకంగా చెప్పాలంటే…

Share

పారిశ్రామీకరణ అంటే ఏంటి ?

పారిశ్రామీకరణ అంటే ప్రజలు వ్యవసాయం నుండి ఉత్పాదకత శక్తిని పెంచటంకోసం పరిశ్రమల  వైపు మళ్ళటం వస్తువులను ఉత్పత్తి చేసి తద్వారా జాతీయోత్పత్తిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటం మరొకరకంగా చెప్పాలంటే   ప్రజల జీవన విధానం వ్యవసాయం నుండి పరిశ్రమల్లో వస్తు ఉత్పాదకతను పెంచే విధంగా అభివృద్ధి చెందటాన్ని పారిశ్రామీకరణ అంటారు వ్యవసాయంనుండి పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు జరిగిన మొదటి పరివర్తనను పారిశ్రామిక విప్లవం అని పిలుస్తారు. ఇది 18 వ శతాబ్దం మధ్య నుండి 19 వ శతాబ్దం ప్రారంభం వరకు ఐరోపా లోను, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలలోనూ జరిగింది. గ్రేట్ బ్రిటన్లో మొదలై, ఆ తరువాత బెల్జియం, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్సు లకు పాకింది.సాంకేతిక పురోగతి, గ్రామీణ పనుల నుండి పారిశ్రామిక శ్రమకు మారడం, కొత్త పారిశ్రామిక వ్యవస్థలో ఆర్థిక పెట్టుబడులు, వర్గ స్పృహలో ప్రారంభ పరిణామాలు, తత్సంబంధిత సిద్ధాంతాలు మొదలైనవి ఈ ప్రారంభ పారిశ్రామికీకరణ లక్షణాలు. తరువాతి కాలంలో, వ్యాఖ్యాతలు దీన్ని మొదటి పారిశ్రామిక విప్లవం అన్నారు. 19 వ శతాబ్దం మధ్యలో ఆవిరి యంత్రానికి మెరుగుపరచడం, అంతర్గత దహన యంత్రపు ఆవిష్కరణ, విద్యుత్తును ఉపయోగించడం, కాలువలు, రైల్వేలు, విద్యుత్-శక్తి నిర్మాణం తరువాత వచ్చిన మార్పులన్నిటినీ కలిపి “రెండవ పారిశ్రామిక విప్లవం” అని అంటారు. అసెంబ్లీ లైన్‌ను ప్రవేశపెట్టడం ఈ దశకు ఊపునిచ్చింది. ఇళ్ళ స్థానంలో బొగ్గు గనులు, ఉక్కు కర్మాగారాలు, వస్త్ర కర్మాగారాలు మొదలైనవి పని ప్రదేశంగా మారాయి. 20 వ శతాబ్దం చివరి నాటికి, తూర్పు ఆసియా ప్రపంచంలోని సరికొత్త పారిశ్రామికీకరణ చెందిన ప్రాంతంగా మారింది. బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) పారిశ్రామికీకరణ ప్రక్రియలో సాగుతున్నాయి.

పట్టణీకరణ

పారిశ్రామిక విప్లవం అంటే వ్యావసాయిక సమాజం నుండి తరలడమే. దీని కారణంగా ప్రజలు ఉద్యోగాల కోసం గ్రామాల నుండి కర్మాగారాలను నెలకొల్పిన ప్రదేశాలకు వలస వెళ్ళారు. గ్రామీణ ప్రజలు చేపట్టిన ఈ వలసలు పట్టణీకరణకూ, పట్టణ జనాభాలో పెరుగుదలకూ దారితీసాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – పారిశ్రామిక విధానం

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టేందుకు వీలుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశామని వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక విధానానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు  పరిశ్రమలు, పారిశ్రామిక మౌలిక వసతులు, ఐటీ, నైపుణ్యాభివృద్ధికి కలిపి రికార్డు స్థాయిలో రూ.5,081.41 కోట్లు కేటాయింపులు జరిగాయని ఇంత పెద్ద మొత్తం లో కేటాయింపులు ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో జరగలేదన్నారు . గత ఏడాది కేటాయించిన రూ.4,779.1 కోట్లతో పోలిస్తే ఇది 6.32 శాతం అదనం. ఇందులో ఒక్క పారిశ్రామిక మౌలిక వసతులకే రూ.1,142.53 కోట్లు వ్యయం చేస్తామని చెప్పారు . పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు, రెండు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్న సంగతి అందరికి తెలుసునని అన్నారు  ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ మారిటైం బోర్డు రూ.8,000 కోట్లు రుణం తీసుకోవడానికి కూడా అనుమతించారు. ఇందులో ఇప్పటికే రామాయపట్నం, భావనపాడు పోర్టు పనులకు టెండర్లు ఖరారు కాగా.. బందరు పోర్టుకు తాజాగా టెండర్లు పిలిచారు. అదే విధంగా విశాఖ వద్ద భోగాపురం, నెల్లూరు దగదర్తి వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇక పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన విద్యార్థులను అందించడానికి ఏకంగా రూ.969.91 కోట్లు వ్యయం చేయనున్నట్లు కూడా మంత్రి ప్రకటించారు. పరిశ్రమల రంగానికి రూ.2,755.17 కోట్లు, ఐటీ రంగానికి రూ. 212.13 కోట్లు కేటాయించారు కేటాయింపుల్లో వేల కోట్లు జమ చేసినా అవి పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న

ఎంఎస్‌ఎంఈలకు రూ.450 కోట్లు – ఎంతవరకు నిజం ?

అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ఈ బడ్జెట్‌లో రూ.450 కోట్లు కేటాయించారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వైఎస్సార్‌ జగనన్న, వైఎస్సార్‌ బడుగు వికాసం కింద రాయితీలకు రూ.175 కోట్లు కేటాయించారు. ఐటీ రంగ కంపెనీల ప్రోత్సాహకాలకు రూ.60 కోట్లు, ఇతర పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.411.62 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. ఏడీబీ నిధులతో అభివృద్ధి చేస్తున్న విశాఖ–చెన్నై కారిడార్‌లో వివిధ పనులకు రూ.611.86 కోట్లు కేటాయించారు. ఈ కారిడార్లో రహదారుల అభివృద్ధికి రూ.250 కోట్లు, ఏపీఐఐసీ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.236.86 కోట్లు, విద్యుత్‌ సదుపాయాల కోసం రూ.125 కోట్లు వ్యయం చేయనున్నారు

వాస్తవానికి ఇన్ని కేటాయింపులు చేసిన కింది స్థాయి వరకు ఎంత చేరింది అనేది ప్రశ్న అందులో ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతవరకు ఉందనేది కూడా తెలుస్తుంది వాస్తవానికి ప్రభుత్వ కేటాయింపులు ఆకాశాన్ని అంటుతున్న లబ్దిదారులకు చేరేవరకు అది పూర్తీ స్థాయిలో మారిపోతుంది చాల తక్కువ శాతం కింది స్థాయి లబ్దిదారులకు చేరుతుందనేది వాస్తవం..

వైఎస్సార్‌ ఈఎంసీ ప్రారంభం

ఐటీ, ఎలక్ట్రానిక్‌ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా కొప్పర్తిలో వైఎస్సార్‌ ఈఎంసీని సీఎం జగన్‌ గత ఏడాది డిసెంబర్‌ 23న ప్రారంభించారని బుగ్గన చెప్పారు. ఇప్పటికే ఇక్కడ రూ.660 కోట్లతో 9,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. ఈ రంగంలో వచ్చే మూడేళ్లలో రూ.4,000 కోట్ల పెట్టుబడితో 25,000 మందికి ఉపాధి కల్పించే కంపెనీలు రానున్నాయన్నారు. వాస్తవానికి ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మనం ఎంత వెనక పడిఉన్నామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే అర్ధమవుతుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – మోసపూరిత పారిశ్రామిక విధానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా పారిశ్రామిక  విధానాన్ని రూపొందించింది చాల వరకు పోర్టులను ప్రైవేటీకరించింది గంగవరం పోర్ట్ లో పది శాతం అదానీ కి అమ్మింది ప్రభుత్వ స్థలాలను పక్కన పెట్టింది వైస్సార్ ఏపీ వన్ పేరుతొ ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ పోతోంది అంతేకాకుండా బిల్డ్ ఏపీ  పేరుతో బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కు చౌకగా కట్టబెట్టింది ఎల్ జి పాలిమర్ ఘటనలో కూడా కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించిందే తప్ప అసలు ప్రభుత్వం ఎందుకు పారిశ్రామిక ప్రమాదాలు నివారించలేకపోతుందో చెప్పలేకపోయింది కేవలం ద్రుష్టి మరలించే వాదన తప్ప ఇది మరొకటి కాదు చిన్న పరిశ్రమలు మూత పడ్డాయి రిటైల్ వ్యాపారం దెబ్బతింది ఈ కలాం లో చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఒక్కటి కూడా రాష్ట్రానికి రాలేదు

జగన్ దావోస్ పర్యటనలో గ్రీన్ ఎనర్జీ కి సంబంధించి అదానీ గ్రూప్ తో  మరియు గ్రీన్ కో అరబిందో తో ఒప్పందం  చేసుకున్నామని అదేవిధంగా హైడ్రోజన్ అమోనియం ఉత్పత్తులు మీద ద్రుష్టి పెట్టామని బైజూస్ తో ఒప్పందం విద్యారంగం లో మార్పులు తెస్తుందని అయన చెప్పారు వాస్తవానికి ఇవన్నీ గత ఒప్పందాల చరిత్రే తప్ప ఇందులో మరేం కొత్తదనం లేదు ఎవరు ఎన్ని చెప్పినా పారిశ్రామిక ప్రగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కుంటు పడిందని చెప్పక తప్పదు ..ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి నూతన పారిశ్రామిక విధానం మీద ద్రుష్టి పెట్టాలని మేధావులు విద్యావంతులు కోరుకుంటున్నారు

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Uncategorized

Hgh x2 dosage, crazy bulk hgh-x2 before and after – Buy legal anabolic steroids                    ...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Alluri Seetharama Raju

Prediksi forum Syair cambodia Hari Ini 2023     Forum syair cambodia 2023, kode syair cambodia hari ini, code syair cambodia bd, prediksi cambodia...

Uncategorized

Buy sarms in europe, hgh apotheke – Buy legal anabolic steroids                          ...

Lingual Support by India Fascinates