Connect with us

Hi, what are you looking for?

Andhra News

వాళ్లకు అమ్మఒడి  రాదంట‌..!!!

శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కోడి రామూర్తి స్టేడియంలో అమ్మ ఒడి (Amma Odi) పథకం మూడో విడత కార్యక్రమం ఆయ‌న‌ ప్రారంభించారు. హాజరు శాతం తగ్గడంతోనే 51 వేల మందికి అమ్మఒడి ఇవ్వలేదని…

Share

శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కోడి రామూర్తి స్టేడియంలో అమ్మ ఒడి  పథకం మూడో విడత కార్యక్రమం ఆయ‌న‌ ప్రారంభించారు. హాజరు శాతం తగ్గడంతోనే 51 వేల మందికి అమ్మఒడి ఇవ్వలేదని, మొత్తంగా 1.14 శాతం మంది తల్లులకు అమ్మఒడి పథకం ఇవ్వలేకపోయామని, ఈ విషయంలో తనకు బాధగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు.   అమ్మఒడి పథకంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ పథకాన్ని విమర్శించే వారిలో ఒక్కరైనా.. పిల్లల్ని చదివించే తల్లులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అమ్మఒడి లాంటి పథకం తెచ్చారా? అని అన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజ్యుస్ యాప్తో ఒప్పందం చేసుకున్నామని, శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే బైజ్యుస్ యాప్ ఇప్పుడు పేదలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. 4.7 లక్షల మంది 8వ తరగతి పిల్లలకు సెప్టెంబర్‌లో రూ. 12వేలు విలువజేసే ట్యాబ్ ఇవ్వబోతున్నామన్నామని సీఎం జగన్ చెప్పారు

వేలాది మందికి పథకం దూరం

రకరకాల కారణాలు చూపుతూ జిల్లాలో ‘అమ్మఒడి’కి కోత విధించారు. వేలాది మందిని పథకానికి దూరం చేశారు. జాబితాల్లో పేర్లు గల్లంతు కావడంతో బాధితులు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కానీ సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సహేతుకమైన కారణాలను చూపలేకపోతున్నారు. కొన్నిచోట్ల వాస్తవ విరుద్ధమైన కారణాలను చెబుతున్నారు. విద్యుత్‌ను అధికంగా వినియోగించారని కొందరికి, మీటర్లు అధికంగా ఉన్నాయని మరికొందరికి, మ్యాపింగ్‌ కాలేదని ఇంకొందరికి మొండిచేయి చూపారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తులు అప్‌లోడ్‌ చేసిన క్రమంలో దొర్లిన తప్పిదాలు మరికొందరికి శాపంగా మారాయి. వెరసి జిల్లాలో వేలాది మంది పేర్లు ‘అమ్మఒడి’ జాబితా నుంచి గల్లంతయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో విద్యాశాఖలో అస్పష్టత నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 38 మండలాలు ఉండగా.. విభజనతో 30 మండలాలే మిగిలాయి. అయితే ఉమ్మడి జిల్లా లబ్ధిదారులకు.. ఇప్పటికీ పోల్చుకుంటే మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాల్లో భాగంగా ‘అమ్మఒడి’ పథకాన్ని అమలుచేస్తోంది. 2019-20 విద్యాసంవత్సరంలో తొలుత పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున నగదు జమ చేశారు. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండోసారి రూ.1,000లను మినహాయించి రూ.14,000 చొప్పున జమ చేశారు. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి జనవరిలో అందించాల్సి ఉన్నా.. రకరకాల కారణాలు చూపుతూ జూన్‌ మాసాంతంలో నగదు విడుదల చేస్తున్నారు. సోమవారం జిల్లా నుంచే ‘అమ్మఒడి’ నగదు పంపిణీ ప్రక్రియను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది కేవలం రూ.13 వేలు మాత్రమే అందించనున్నారు.

గణాంకాలు పరిశీలిస్తే..

ఉమ్మడి జిల్లా గణాంకాలను పరిశీలిస్తే.. 2019-20లో 2,39,902 మంది, 2020-21లో 3,77,692 మందికి ‘అమ్మఒడి’ పథకం వర్తించింది. ఈ ఏడాది మాత్రం 2,00,153 మందికి మాత్రమే లబ్ధిదారులుగా తేల్చారు. అయితే జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎనిమిది మండలాలు తగ్గాయి. కానీ లబ్ధిదారుల సంఖ్య కూడా దాదాపు లక్షకుపైగా తగ్గడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విద్యాశాఖ అధికారులు కూడా స్పష్టతనివ్వడం లేదు. లబ్ధిదారులను కుదించాలన్న ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. నెలకు రూ.12 వేలపైన వేతనం, పట్టణాల్లో 1,000 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు, ఏడాదిలో 75 శాతం హాజరు, నెలకు 300 విద్యుత్‌ యూనిట్ల వాడకం, నాలుగు చక్రాల వాహనాలు వంటి నిబంధనలతో భారీగా అమ్మఒడికి కోతలు విధించారు. టెక్నికల్‌గా తల్లుల రేషన్‌కార్డుల్లో పిల్లల పేర్లులేవన్న సాకుతో పలువుర్ని నిలిపేసినట్లు సమాచారం. అర్హత సాధించిన చాలామందికి బ్యాంకు అకౌంట్లు విషయంలో దెబ్బతిన్నారు. జాబితాల్లో చాలామంది పేర్లు పక్కన ఇన్‌యాక్టివ్‌ అకౌంట్‌ అని చూపించింది. అవన్నీ పూర్తిచేసుకుని… సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకున్నా వారికీ పథకం వర్తించలేదు.

శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనతో శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీఎం జగన్ నేడు జిల్లాలో పర్యటించారు. ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన అమ్మ ఒడి పథకం నిధులు విడుదల కార్యక్రమం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో ప్రారంభమైంది. అయితే, సీఎం పర్యటనతో శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వచ్చిన వారిని సీఎం భద్రతా చర్యలలో భాగంగా టౌన్ ఔట్ కట్స్ లో బస్సులు నిలిపివేస్తున్నారు. దాంతో నాలుగు కిలోమీటర్లు నడుచుకొని చేరుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సొమ్మసిల్లిన విద్యార్థులు

సీఎం జగన్ హాజరైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక చిన్నారులు సృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. కనీస సౌకర్యాలను సైతం గాలికి వదిలేసి చిన్నారులను సభకు రప్పించడంతో ఇలా జరిగిందని శ్రీకాకుళం వాసులు విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మీద ఉన్న శ్రద్ధ పిల్లలపైన లేకపోవడం  ఏంటని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి ఘోర పరాభవం

మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ఘోర పరాభవం ఎదురైంది. సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన ఉన్న వేళ తనకు అవమానం జరిగిందని, దాన్ని భరించలేనంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కారు వద్దకు వచ్చి మాజీ మంత్రి, ధర్మాన కృష్ణదాస్ బతిమిలాడినా సరే తాను రాను అంటూ కృపారాణి భీష్మించుకుని కూర్చున్నారు. తనకు జరిగిన సన్మానం చాలని, ఇక అవమానాలు భరించలేనని ధర్మానకు చెప్పి కారులో వెళ్లిపోయారు.

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Su Kaçak Tespiti Nasıl Yapılır Beşiktaş su kaçak tespiti Beşiktaş su kaçak tespiti yapan Uzman, kalorifer borularında meydana gelen su kaçaklarını iki farklı yöntemle...

Lingual Support by India Fascinates