అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన లెవెల్ గురించి నేషనల్ లెవెల్ కి పెరిగింది. పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చూపించాడు. తాజాగా అల్లు అర్జున్ కి మరో గౌరవం దక్కింది. ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేసి మంచి కలెక్షన్స్ రాబట్టిన మూవీ పుష్ప. ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ అన్ని భాషల్లో కలిపి 5 బిలియన్ వ్యూస్ సంపాదించింది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ నత అద్భుతమైన స్టార్ డమ్ సూపర్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపాడు. ముఖ్యంగా ఈ సినిమాలో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు యూత్‌తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా ఇపుడు నార్త్ బెల్ట్ ప్రాంతాల్లో సౌత్ హీరోల సినిమాలకు మంచి గిరాకీ ఉంది. గంగోత్రి విడుదలైనపుడు చాలా మంది తిట్టారు కూడా. కానీ అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు ఆ హీరోను చూసి వావ్ అంటున్నాయి. ఇప్పుడు ఏకంగా ఇండియాటుడే ఇంగ్లీష్ కవర్ పేజ్ పై నార్త్‌లో సత్తా చాటుతున్న హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఆర్ఠికల్ రాసింది. ఆర్య నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతం అంటూ పొగిడేసింది.
అల్లు అర్జున్ పుష్ప విషయానికొస్తే.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకు గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది. ఈ సినిమా సక్సెస్‌తో హీరోగా అల్లు అర్జున్ నటిగా రష్మిక మందన్న రేంజ్ మారిపోయింది. మొత్తంగా మన హీరోలు తమ యాక్టింగ్‌తో ఇంట గెలిచి రచ్చ చేసే పనిలో పడ్డారు. ఇక త్వరలో విజయ్ దేవరకొండ కూడా ‘లైగర్’తో ప్యాన్ ఇండియా మార్కెట్ హీరోగా తనను తాను నిరుపించుకునే పనిలో పడ్డాడు. బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్‌తో యశ్. అక్కడి ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ఆ తర్వాత పుష్పలో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్యాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటుతున్నారు. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఇపుడు సౌత్ హీరోలే చిత్ర పరిశ్రమను ఏలుతున్నారనే చెప్పాలి. బన్ని వచ్చినపుడు ఎవరీ కుర్రాడు ఇలా ఉన్నాడు..? బ్యాగ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవచ్చా..? అంటూ చాలా విమర్శలు వచ్చాయి. బహుశా తెలుగులో ఏ వారసుడిపై కూడా ఈ స్థాయి విమర్శలు రాలేదు. ఇక తర్వాత్తర్వాత అల్లు అర్జున్ తనని తాను మౌల్డ్ చేసుకుని ఈరోజు ఒక రేంజ్ లో నిలబడ్డాడు.