వ్యవసాయం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే మానవ మూలాల్లోకి వెళ్ళితీరాలి మనిషి అభివృద్ధి చెందకుండా నాగరికత లేని వ్యక్తి గా ఉన్న దశ నుండి మానవ మేధస్సు ఉవ్వెత్తున ఎగిసిన ప్రగతి పదం వరకు మనం తెలుసుకోవాలి అలాగే మానవుడు తన స్వీయ రక్షణ కోసం సమూహం గా ఏర్పడి తన జీవనం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల్లో వ్యవసాయం ఒకటి ఇది యాదృచ్ఛికం గా మొదలైనా చివరికి అదే మానవునికి ఆధారమైంది మానవ చరిత్రలో అతి పెద్ద అంశముగా మారింది ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశముగా మారింది వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న మానవుడు తదనంతరం తన మేధో సంపత్తి ద్వారా సంపద సమకూర్చుకోవటం,సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి మాత్రం ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే.. భారతదేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు . అవి ఖరీఫ్ పంట కాలం .. జూన్ నెల నుంచి అక్టోబరు వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి,చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరుశనగ. రబీ పంటకాలం.. అక్టోబరు నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు – గోధుమ, బార్లీ, మినుములు, ప్రొద్దు తిరుగుడు, ధనియాలు, ఆవాలు మొదలైనవి. జైద్ పంటకాలం.. మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు – పుచ్చకాయలు, దోస కాయలు, కూరగాయలు, మొదలైనవి.
ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ – వ్యవసాయ రంగం : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయింపులు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. వివిధ పథకాల కోసం రూ. 11,387 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు రైతు భరోసా పథకానికి ఈ ఏడాది రూ. 3,900 కోట్లు మరియు ఉచిత పంట బీమాకు రూ. 1,802 కోట్లు దేవిధంగా విద్యుత్ రాయితీ కోసం రూ. 5,000 కోట్లు కేటాయింపులు జరిగాయి
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2022-23 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఇందులో . మొత్తం రూ.2,56,257 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 47,996 కోట్లు, రెవెన్యూ లోటు అంచనా రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724 కోట్లుగా పేర్కొన్నారు.బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు చేశారు. వ్యవసాయ రంగానికి ఏకంగా రూ. 11,387 కోట్లు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ ఉచిత పంట బీమా, వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ నిధి, ఉచిత, రాయితీ విద్యుత్ సరఫరా కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు
వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ యోజన
‘‘ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి ద్వారా రూ. 20,117.59 కోట్లు రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేసారు ఈ పథకం ప్రజల్లోకి బాగా వెళ్తుందని ఆశించారు . ఇందులో భాగంగా పీఎం కిసాన్ పథకం ద్వారా అందించే రూ. 6 వేలకు అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 7,500 జమ చేస్తున్నారు . అలాగే, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్ప సంఖ్యాక వర్గాల వారికి చెందిన 1.67 లక్షల మంది భూమి లేని కౌలుదారులు, అటవీ హక్కుల గుర్తింపు చట్టం కిందకు వచ్చే (ఆర్ఓఎఫ్ఆర్) కుటుంబాలకు రూ. 13,500 చొప్పున రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రత్యేక కేటాయింపులు చేసారు . 52.40 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు రైతు భరోసా పథకానికి ఈ ఏడాది రూ. 3,900 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది . కానీ ఈ రైతు భరోసా మాత్రం ఎంతో మంది రైతులకు అందలేదనేది సత్యం .
వైఎస్సార్ ఉచిత పంట బీమా – ఈ క్రాఫ్ రిజిస్ట్రేషన్
మన ప్రభుత్వం ‘ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్’ ఆధారంగా వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేస్తోంది. 2019 ఖరీఫ్ సీజనులో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రక్షత్య నగదు బదిలీ పథకం ద్వారా 29.05 లక్షల మంది రైతులకు రూ. 3,707.02 కోట్లు బీమా క్లెయిమ్స్‌ను, గత ప్రభుత్వ బకాయిలతో సహా చెల్లిస్తున్నారని ప్రభుత్వం చెప్తుంది వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కోసం 2022- 23 లో రూ. 1,802 కోట్ల కేటాయింపులు జరిగినట్టు తెలుస్తుంది కానీ వాస్తవం లో మాత్రం ఈ పథకం లో ఎన్నో ఇబ్బందులు తెలెత్తి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు
వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు – ప్రభుత్వ ఆర్భాటం
2019- 20 రబీ కాలంలో, 2020- 21 ఖరీఫ్ కాలంలో తీసుకున్న రూ. లక్ష వరకు ఉన్న పంట రుణాల కోసం 2021- 22 ఆర్థిక సంవత్సరంలో 12.30 లక్షల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 207.72 కోట్ల రూపాయిల వడ్డీ రాయితీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్తున్నారు ఈ ఏడాదికి గాను వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కోసం రూ. 500 కోట్ల కేటాయింపులు చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్తున్నా వాస్తవంలో అందుకున్న లబ్ధిదారులు మాత్రం చాల తక్కువ
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు – ఇబ్బందులు
గ్రామ సచివాలయాల విస్తరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ముందుగా పరీక్షించిన నాణ్యమైన మూల వనరులను సరఫరా చేయడం ద్వారా రైతు భరోసా కేంద్రాలు రైతులకు వివిధ సేవలు అందిస్తున్నాయి. ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాల కోసం రూ. 18 కోట్లు కేటాయింపులు చేసినా ఈ రైతు భరోసా కేంద్రాల్లో మాత్రం చాల అవకతవకలు ఉన్నట్టు తెలుస్తుంది
వ్యవసాయ మార్కెటింగ్- ధరల స్థిరీకరణ నిధి – ప్రభుత్వ లోపాలు
రైతులకు మద్దతు ధర అందించడంలో మార్కెటింగ్ శాఖకు కలిగే నష్టాలను పూడ్చేందుకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసారు . ఏపీలో భారీగా పండించే మిరప, పసుపు, ఉల్లి, చిన్న మినుములు, అరటి, బత్తాయి వంటి మరో 6 రకాల పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది ఐతే . ఈ ఏడాది బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసం రూ. 500 కోట్లు కేటాయిస్తున్నాం.అని ప్రభుత్వం గొప్పలు చెప్తున్నా వాస్తవం లో మాత్రం ఎక్కడ పొంతన లేదు
ఉచిత రాయితీ విద్యుత్ సరఫరా – ప్రభుత్వ అగచాట్లు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అవసరాల కోసం 19.64 లక్షల పంపు సెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్ సరఫరా చేస్తోంది. ఉద్యానవన, నర్సరీలకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తోంది. అలాగే, ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ. 1.50 చొప్పున రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్తుంది . వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అమర్చేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని వాగ్దానాలు చేస్తుంది . ఈ ఏడాది విద్యుత్ రాయితీ కోసం రూ. 5,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.’’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు ఐతే ఇదంతా కాగితాల్లో ఉండే లెక్కలేనన్ని వస్తాం లో ఇందుకు విరుద్ధం గా ఉంటుందని మనకి రైతు మరణాలు తెలియజేస్తున్నాయి
సంక్షోభం లో వ్యవసాయం
2020 – 2021 లో వర్షాలు బాగా కురిసినప్పటికీ భారీ వర్షాలతో లక్షలాది ఎకరాలు నష్టపోయాయి అంతేకాకుండా రాష్ట్రంలో 158 మండలాల్లో వర్షపాతం తక్కువగా ఉంది ఐతే దీనికి తగట్టు ఖరీఫ్ సాగు జరగలేదు గతం తో పోల్చితే సాధారణ విస్తీర్ణం కన్నా 10 లక్షల ఎకరాలు తగ్గింది ఆదాయం తగ్గి భూమి ఖర్చులు పెరగటం తో పంటవేయకుండా వున్నారు చాల జిల్లాలో వారి విస్తరణం తగ్గింది వ్యవసాయ ఆదారంగా ఉన్న18 ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి కరువు ప్రణతాల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు ఇప్పటికే అధికార లెక్కల ప్రకారం 889 రైతులు ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా కౌలు రైతులు 15 లక్షల మందికి పైగా ఉన్నప్పటికీ 5 .25 లక్షల మందికి మాత్రమే కార్డులిచ్చారు రైతు భరోసా 30 వేల మందికి మాత్రమే దక్కింది ఈ క్రొప్ బుకింగ్ యజమాని పేరుతో నమోదైంది వ్యవసాయ కులాల పరిస్థితి మరి దుర్భరంగా ఉంది ఉపాధి హామీ పథకాల్లో నిధులు 900 కోట్లు బకాయిలు ఉన్నాయి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదనే చెప్పాలి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి లోపాలను సరి చేయాలనీ ప్రజలు కోరుకుంటున్నారు