గతంలో జగన్ తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని..కేవలం స్టార్ హోటళ్లలోనే మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. అంతే కాదు..మద్యంపై ప్రభుత్వం ఆధారపడటమా అంటూ ఎద్దేవా చేశారు. తర్వాత దశల వారీ మద్య నిషేధం అన్నారు. ఇప్పుడు బాండ్స్ ద్వారా అప్పులు తెచ్చుకోవటానికి వీలుగా అసలు ఆ ఛాన్సే లేదని తేల్చేశారు.
జగన్ సర్కారు మరో కీలక అంశంలో రివర్స్ గేర్ వేసింది. లిక్కర్ బాండ్స్ ద్వారా నిధులు సమీకరించిన సర్కారు మద్య నిషేధం ఉసెత్తమని బాండ్ రాసి ఇచ్చింది. పాక్షికంగా అయినా..పూర్తిగా కూడా అసలు మద్య నిషేధం ఉండదని ప్రకటించింది. ఒక వేళ నిషేధం అమలు చేయాల్సి వస్తే..అది అమల్లోకి వచ్చినప్పటి నుంచి మూడు నెలల్లో ఈ బాండ్స్ ను ఉపసంహరించుకోవటానికి అనుమతి మంజూరు చేసింది. అంటే ఈ లెక్కన ఏపీలో మద్య నిషేధం అన్న ఊసే ఉండదు.
లిక్కర్ బాండ్స్ తో 8000 కోట్లు..
తెలుగు రాష్ట్రాల్లో జగన్ సర్కారు ఓ కొత్త ప్రయోగం చేసింది. అప్పుల కోసం నానా తిప్పలు పడుతున్న ప్రభుత్వం కొత్తగా లిక్కర్ బాండ్స్ తెచ్చింది. ఈ బాండ్స్ వేలం ద్వారా 2000 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఏకంగా పది వేల కోట్ల రూపాయలు వచ్చాయి. అయితే అందులో 8000 కోట్ల రూపాయలను మాత్రం సర్కారు ఉపయోగించుకునే యోచనలో ఉంది. ఏపీ బ్రీవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్ సీడీ) జారీ చేసి ఈ నిధులు సమీకరించింది. అయితే బాండ్స్ జారీ వ్యవహారాన్ని ఏపీ సర్కారు అత్యంత గోప్యంగా నడిపించింది.
గత కొంత కాలంగా ఏపీ సర్కారుకు లిక్కర్ ద్వారా భారీ ఎత్తున ఆదాయం వస్తోంది. అంతకు ముందు ఏడాది లిక్కర్ ఆదాయం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉంటే..గత ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా ఇది 18 వేల కోట్ల రూపాయలకు చేరింది. మర్చంట్ బ్యాంకర్లు ఈ బాండ్స్ పై మంచి విశ్వాసంతో ఉండటంతో ఇది విజయవంతం అయింది. ఎన్ సీడీల పై కనీస వడ్డీ 7.5 శాతం ఖరారు చేయగా..గరిష్టంగా ఇది 9.5 శాతానికి చేరింది. మద్యం ఆదాయానికి సంబంధించి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి..రోజువారీ ప్రాతిపదికన మద్యం ద్వారా వచ్చే డబ్బును ఆ ఖాతాలో జమ చేయనున్నారు.
పంజాబ్ రాష్ట్రం మద్యం బాబులకు గుడ్ న్యూస్ చప్పింది. పంజాబ్‌లోని ఆమ్ఆద్మీ సర్కార్ సరికొత్త ఎక్సైజ్ పాలసీ 2022-23ని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంజాబ్ క్యాబినెట్ ఆమోదించింది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 40 శాతం అధికంగాఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి ఈ సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ముఖ్యంగా 35 నుంచి 60 శాతం వరకు ధరలను తగ్గించేలా సరికొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఈ కొత్త విధానం వల్ల 2021-22లో రూ.6,158 కోట్ల ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,647.85 కోట్లకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.
పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యంలోని ఆప్ సర్కార్ మద్యం పాలసీని తీసుకురావడమేకాదు, కొన్నినిర్మాణాత్మక చర్యలను ప్రతిపాదించింది. లాట్ల ద్వారా మద్యం విక్రయాలను కేటాయించే బదులు, టెండర్లను ఆహ్వానించడంద్వారా వేలం వేయనుంది. అలాగే డిస్టిల్లర్లు, మద్యం పంపిణీదారులు, మద్యం రిటైలర్లు డీలింక్ చేయనుంది.
అంతేకాదు రాష్ట్రంలో కొత్త డిస్టిలరీల ప్రారంభంపై నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. పంజాబ్ మీడియం లిక్కర్ (పిఎంఎల్) మినహా అన్ని రకాల మద్యంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం వసూలు చేయనుంది. హర్యానా నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. మద్యం ధరల తగ్గుదలతో ఎక్సైజ్ ఆదాయాన్ని 40 శాతం పెంచుకోవాలని భావిస్తోంది. ఈ పాలసీ తొమ్మిది నెలల పాటు 2023, 31 మార్చి వరకు అమల్లో ఉంటుంది.
మద్యం కల్తీ, స్మగ్లింగ్, అక్రమ డిస్టిలరీలను అరికట్టేందుకు డిపార్ట్‌మెంట్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను పటిష్టం చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజం తెలిపారు. ఇందుకోసం పోలీసు శాఖకు రెండు అదనపు బెటాలియన్లు కేటాయించనున్నామన్నారు. ఫలితంగా హర్యానా కంటే10-15 శాతం తక్కువగా ధరలు ఉండ నున్నాయి. కొన్ని బ్రాండ్‌ల ధరలు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా వాడే ఇండియన్ ఐఎంఎఫ్‌ఎల్ ధర కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం పంజాబ్‌లో ఐఎంఎఫ్ఎల్ ధర 400 రూపాయలకు దిగిరానుంది.