దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. దేశంలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో, ఫోర్త్ వేవ్ ప్రారంభమయిందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుండి శనివారం వరకూ 17,092 కొత్త కేసులు నమోదు అయ్యయి. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 14, 684 మంది కోవిడ్ నుండి కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివిటీ రేటు 4.14 శాతం గా ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కోరోనా బారిన పడ్డారు. మాజీ హోంమత్రి సుచరితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే వంశీకి కూడా కరోనా సోకింది. వీరికి జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల తమతో కాంటాక్టు అయిన వాళ్లంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించగా ఎమ్మెల్యే వంశీకి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. గతంలో కూడా వంశీ కరోనా బారినపడ్డారు. వంశీ హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని, కోలుకున్న అనంతరం నియోజవర్గానికి వస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు
ఇటీవల కాలం వరకూ పెద్దగా కేసులు నమోదు లేకపోవడంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. మాస్క్ లు ధరించడం గానీ, భౌతిక దూరం పాటించడం గానీ చేయడం లేదు. వివిద రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు యధావిధిగా జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం అధికార వైసీపీ నేతలు .. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లో తిరుగుతుండగా, టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. ఈ తరుణంలో కరోనా కేసులు పెరుగుతుండటం, నేతలు కరోనా బారిన పడుతుండటం కలకలాన్ని రేపుతోంది.