జిల్లా జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి బొర్రా సుబ్బారెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ నెల 23న పోలింగ్, 26న లెక్కింపు నిర్వహించనున్నారు.
ఆత్మకూరు ఉప ఎన్నికల పోటీకి సంబంధించి తుది జాబితా రెడీ అయింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేలింది. ఈమేరకు ఆర్వో హరేంధిర ప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. 28 నామినేషన్లలో 13 తిరస్కరణకు గురి కాగా.. మొత్తం 15 మంది అర్హులుగా ఉన్నారు.
అధికార వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో నిలవగా.. బీజేపీ తరపున భరత్ కుమార్ పోటీలో ఉన్నారు. బీఎస్పీ తరపున నందా ఓబులేసు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ తమ అభ్యర్థులను పోటీలో లేకుండా చేశాయి. ఇక జనసేన కూడా పోటీకి దూరంగానే ఉంటామని ప్రకటించింది. మొత్తమ్మీద 14మంది అభ్యర్థులు ఇప్పుడు ఆత్మకూరు తుదిపోరుకి సిద్ధమయ్యారు.బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులున్నాయని.. ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన వివిధ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు అభ్యర్థులందరూ సహకరించాలని కోరారు.
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో 2,13,330 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలతో ఎన్నికలు నిర్వహిస్తూ డీఎంహెచ్ఓ ను నోడల్ అధికారిగా నియమించారు. పోస్టల్ బ్యాలెట్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. వికలాంగులు, వృద్ధులు, కరోనా బాధితులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశముంది.
ఇక ప్రచారం విషయానికొస్తే.. అధికార వైసీపీ ఈ విషయంలో దూసుకుపోతోంది. బీజేపీ అధినాయకత్వం కూడా ఉప ఎన్నికపై ఫోకస్ పెంచింది. బీజేపీ తరపున కూడా కీలక నేతలు ఆత్మకూరులో పర్యటిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా, ఇతర రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు ఆత్మకూరులోనే మకాం వేశారు. అధికార వైసీపీ ప్రచార పర్వాన్ని ఇప్పటికే ప్రారంభించింది. . ఒక్కో మండలానికి ఒక్కో మంత్రి, ఒక ఎమ్మెల్యేని ఇన్ చార్జి లుగా నియమించారు. మొత్తం ఆరు మండలాలకు సంబంధించి ఇన్చార్జిల నియామకం పూర్తయింది.
అనంతసాగరం మండలం – మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏఎస్ పేట మండలం – మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆత్మకూరు టౌన్ – మంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే శ్రీకాంత్
ఆత్మకూరు రూరల్ – మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, చేజర్ల మండలం – మంత్రి రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని
మర్రిపాడు మండలం – మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, సంగం మండలం – మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.
ఆత్మకూరు బై పోల్ నామినేషన్ల ఉప సంహరణ గుడువు ముగిసింది. పోటీలో మొత్తం 14 మంది అభ్యర్ధులు ఉన్నారు. ఇప్పుడు ప్రధాన పోటీ వైసీపీ వర్సెస్ బీజేపీగా మారింది. ఇక్కడ గెలుపు కంటే మెజార్టీ వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇందు కోసం అభ్యర్ధిత్వం ఖరారు అయిన సమయం నుంచే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో తాను తప్పని స్థితిలో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెబుతున్నారు. నియోజకవర్గంలో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తున్నారు.
బీజేపీ తమ అభ్యర్ధిని రంగంలోకి దింపింది. భరత్ కుమార్ కు మద్దతు సోము వీర్రాజు ఎక్కువగా నెల్లూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 12న నెల్లూరు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుమారుడు వివాహ రిసిప్షెన్ జరగనుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వస్తారని చెబుతున్నారు. దీని పైన అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఇక, అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మంత్రి రోజా.. మాజీ మంత్రి కొడాలి నాని కి చేజెర్ల మండల బాధ్యతలు అప్పగించారు. అక్కడ మెజార్టీ ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అసలు లక్ష్యం అదే..ఎన్నికల చర్చ వేళ మర్రిపాడు- మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లు పర్యవేక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్వేలు ఉప ఎన్నిక కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆత్మకూరు లో ఇప్పుడు విక్రమ్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీనే ఎన్నికతో ప్రారంభం కావటంతో..ఎటువంటి ఫలితం వస్తుంది..ఎంత మెజార్టీ వస్తుందనేదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు జూన్ 23న పోలింగ్ జరగనుంది. జూన్ 29న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు జూన్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 6వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. జూన్ 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నెల 30న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నామినేషన్ల కోలాహలం మొదలైంది.