‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ సమీక్షాసమావేశం ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైఎస్.జగన్ మాట్లాతున్నారు. ఈ సమీక్షలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణ ప్రగతిపై, ఖరీఫ్ సన్నద్ధతపై సీఎం వైయస్.జగన్ సమీక్షించనున్నారు. అదే విధంగా గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేల నిర్మాణంపై దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా వైయస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంపై, స్పందన ఫిర్యాదుల పరిష్కారం, ఇరిగేషన్, జాతీయ రహదారుల భూసేకరణ అంశాలపై సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
@YSRCParty ‘స్పందన’పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం
– పలు కీలక అంశాలపై అధికారులతో సీఎం సమీక్ష
– కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం వైఎస్ జగన్