కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కరోనా బారినపడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. ప్రస్తుతం సోనియా ఐసొలేషన్‌లో ఉన్నారని, ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందుతుందన్నారు. గత వారం రోజులుగా సోనియా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారని, వారిలో కూడా కొందరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించామని సుర్జేవాలా ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోనియా బాగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారన్నారు.
Randeep Singh Surjewala @rssurjewala
Congress President, Smt Sonia Gandhi has been meeting leaders & activists over last week, some of whom have been found Covid +ve.
Congress President had developed mild fever & Covid symptoms last evening. On testing, she has been found to be Covid positive.
త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా.. కోవిడ్ నుంచి సోనియా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా జీ.. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
@narendramodi
Wishing Congress President Smt. Sonia Gandhi Ji a speedy recovery from COVID-19.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాహుల్, జూన్ 8న సోనియా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. మరోవైపు గాంధీ ఫ్యామిలీపై బీజేపీ కక్ష కట్టిందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సోనియా కరోనా బారినపడడంతో విచారణకు హాజరయ్యే అవకాశాలు లేనట్టు సమాచారం.
సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయడం పై కాంగ్రెస్ నేతలు, బీజేపీని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని, ప్రతి పక్షాలను భయపెట్టడానికి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఎద్దెవా చేశారు. రాజకీయంగా కక్ష సాధించడం కోసం మళ్లీ పాత కేసును తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రభుత్వంపై నెలకొన్న.. వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ఈ విధంగా చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.