మీపై ఉన్న అవినీతి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ముఖ్యమంత్రి జగన్ (Jagan)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత అవినీతి పరుడై సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోన్న జగన్‌రెడ్డి అవినీతిని అరికడతామంటూ యాప్ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. యాప్‌కి 14400 నెంబర్ కాకుండా, 6093 అయితే యాప్ట్‌గా ఉండేదన్నారు. ‘‘అవినీతి చూస్తూ ఉండొద్దు, అవినీతి గురించి వింటూ ఉండొద్దు, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పండి అంటూ లెక్చర్ ఇస్తున్న అవినీతి అనకొండ జగన్ రెడ్డి గారూ.. అవినీతిపై ఈ నేతిబీరకాయ కబుర్లు మాని.. మీపై ఉన్న అవినీతి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా?’’ అని లోకేష్ ట్వీట్‌లో సవాల్ చేశారు.
@naralokesh దేశంలోనే అత్యంత అవినీతి పరుడై సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోన్న జగన్‌రెడ్డి అవినీతిని అరికడదామంటూ యాప్ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.
@naralokesh యాప్‌కి 14400 నెంబర్ కాకుండా, 6093 అయితే యాప్ట్‌గా ఉండేది. అవినీతి చూస్తూ ఉండొద్దు, అవినీతి గురించి వింటూ ఉండొద్దు, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పండి అంటూ లెక్చర్ ఇస్తోన్న అవినీతి అనకొండ @ysjagan గారూ అవినీతిపై ఈ నేతిబీర కబుర్లు మాని..
@naralokesh మీపై ఉన్న అవినీతి కేసులు విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా?
జగన్ అవినీతిపై ఎవరికి ఫిర్యాదు చేయాలి ?: బుద్దా వెంకన్న
అవినీతి గురించి సీఎం జగన్ మాట్లాడం విడ్డూరంగా ఉందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. రూ.42వేల కోట్లు ఈడీ జప్తు చేస్తే.. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏపీలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ మారారన్నారు. లిక్కర్, ఇసుక అక్రమాల ద్వారా రూ.కోట్లు జగన్కు చేరుతున్నాయని ఆరోపించారు. ఈ అక్రమాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో జగనే చెప్పాలన్నారు. ఉద్యోగులపై కక్ష సాధించేందుకే యాప్ అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. సీఎం జగన్ అవినీతిని అరికడతామంటూ యాప్ విడుదల చేసిన దగ్గర నుండి అందరూ ఆశ్చర్యం తో చర్చించుకుంటున్నారు. ప్రజలను మాయ చేయడానికే ఇటువంటి యాప్ లు అన్నారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉద్యోగులను టార్గెట్ చేశారు. అందులో భాగంగా ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగులను గుర్తించి, ఈ యాప్ ద్వారా బుక్ చేస్తారు. జగన్ అవినీతి లో భాగస్వామికి, మరో న్యాయవాది కి రాజ్యసభ సీట్లు ఇచ్చారన్నారు. ఈ రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్న సీఎంగారిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో చెపాలని కోరారు. మరో యాప్ రూపొందించి మీ నాయకులు, మీ ప్రజాప్రతినిధులు చేసే అవినీతి పై ఫిర్యాదు చేసేలా చూడాలి సూచించారు. దేవుడు సొమ్మును మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్యాయంగా దోచేశాడు. కొడాలి నాని ఎంత దోచుకున్నాడో ఆయనకే లెక్క లేదు. జగన్ యాప్ విడుదల చేయడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.