వరుస సినిమాలతో రష్మిక మందన్న బిజీగా ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ బిజీ గా మారిపోయింది. హిందీలో ఆల్రెడీ ఇప్పటికే రెండు, మూడు సినిమాలు చేస్తోంది అందులో ఒక మూవీ అమితాబ్ తో కలిసి నటించింది, షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం మల్టీ లాంగ్వేజ్ మూవీస్ లో రష్మిక నటిస్తోంది. హను రాఘవపూడి డైరెక్షన్ లో రాబోతున్న సీతారామన్ మూవీలో రష్మిక నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరో గా స్వప్నదత్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందాన్న ఓ లీడ్ రోల్ లో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని బక్రీద్ సందర్భంగా రిలీజ్ చేశారు. ఇందులో ముస్లిం అమ్మాయిగా రష్మిక కనిపించబోతోంది.
అఫ్రీన్ అనే పాత్రలో కనిపిస్తున్న రష్మిక పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్మిక ఫస్ట్ లుక్ మీద విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో రష్మికకు జోడిగా పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటిస్తున్నట్టు అనిపిస్తోంది. బాలాజీ పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. రష్మిక ఫస్ట్ లుక్ మీద తరుణ్ ఇలా స్పందించాడు. ఓయ్ రష్మిక మందాన్న ఈ ప్రయాణంలో నేను ఎప్పుడు జాయిన్ అవ్వాలి. బాలాజీ ఉన్నాడు కదా ? అని అడిగేశాడు. దీనికి రష్మిక వెరైటీగా ఒక రిప్లై కూడా ఇచ్చింది. మన జర్నీ ఆల్రెడీ మొదలైంది.. బాలాజీ.. ఇండియా (నీ కోసం) రావడానికి ఇప్పుడే ఫ్లైట్ ఎక్కానని చెప్పుకొచ్చింది. మొత్తానికి సీతారామం అనే ఈ లవ్ స్టోరీ సినిమా ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాతో అయినా హను రాఘవపూడికి హిట్ వస్తుందో లేదో చూడాలి. ఆయన చివరగా తెరకెక్కించిన పడిపడి లేచే మనసు సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.
😂😂 No Emojis, because I’m being in the character 😂😂
💕💞 @iamRashmika #RashmikaMandanna ✨#RashmikaStories pic.twitter.com/hCO2HNgKqp
— Rashmika Sweden FC 💕💞 (@LoveRashmika) July 10, 2022
